
న్యూఢిల్లీ: స్టార్టప్‌లు ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలని ఎన్‌ఎస్‌ఈ కోరింది. లిస్టింగ్ కారణంగా లిక్విడిటీ పెరుగుతుందని, ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వైదొలగడానికి వీలవుతుందని న్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్ లిమాయే చెప్పారు.
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కారణంగా విస్తృతమైన క్యాపిటల్ మార్కెట్ తోడ్పాటు స్టార్టప్‌లకు లభిస్తుందని వివరించారు. మ్యూచు వల్ ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబ డులు పెడతాయని వివరించారు. ఒకటి రెండు సంవత్సరాల్లో చాలా స్టార్టప్‌లు లిస్టయ్యే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment