తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న తారలు క్రేజ్ ఉన్నంత వరకు వెండితెరపై కనిపిస్తూ ఆపై కనుమరుగయ్యేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పటి తారలు మరో ముందడుగు వేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారు. ప్రస్తుత సినీ స్టార్లు మరో ముందడుగు వేసి తాము సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని స్టార్టప్ (startups) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సంస్థల నుంచి లాభాలు ఆర్జించడమే కాకుండా తమ పెట్టుబడుల ద్వారా ఆ స్టార్టప్‌లకు కూడా గుర్తింపు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో బాలీవుడ్ సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం!
అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ భార్యగా, బీ టౌన్ నటిగా అనుష్క శర్మ అందరికీ తెలుసు. ఈ బాలీవుడ్ నటి ఇటీవలే ప్రత్యామ్నాయ మీట్ పుడ్ స్టార్టప్ బ్లూ ట్రైబ్ ఫుడ్స్‌లో పెట్టుబడి పెట్టడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. విరుష్క జంట ఈ స్టార్టప్‌లో ఎంత పెట్టుబడులు పెట్టారనే తెలియదు. వీటితో పాటు మిల్లెట్స్‌తో తయారుచేసే ఫుడ్ బ్రాండ్ స్లర్ప్ ఫామ్ (Slurrp Farm)లో అనుష్కకు పెట్టుబడులు ఉండగా, డిజిట్ ఇన్సురెన్స్ కంపెనీలోనూ వాటాలున్నాయి.
పంకజ్ త్రిపాఠి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి 30 లక్షలకు పైగా రైతుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న అగ్రిటెక్ ప్లాట్‌ఫారమ్‌లో పెట్టుబడి పెట్టారు. ఇది రైతులకు అవసరమైన డేటాను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఈ నెట్‌వర్క్. దీని ద్వారా రైతలు తమ భూమి నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందేందుకు ఇది వారికి సహకరిస్తుంది.
అలియా భట్
‘ఆర్‌ఆర్‌ఆర్’ ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన అలియా భట్‌కు చాలా వ్యవస్థాపక ఆసక్తులు ఉన్నాయి. ఐఐటీ కాన్పూర్-మద్దతుగల D2C స్టార్టప్ ఫూల్ లో పెట్టుబడులు పెట్టింది. 2017లో స్థాపించబడిన ఈ స్టార్టప్ ఆలయాల్లో పూల వ్యర్థాలతో అగరబత్తీలు, దూప్‌స్టిక్‌లను తయారు చేస్తుంది. అలియా గతంలో ఓమ్నిచానెల్ లైఫ్‌స్టైల్ రిటైలర్ నైకా, ఫ్యాషన్-టెక్ స్టార్టప్ స్టైల్‌క్రాకర్‌లో పెట్టుబడులు పెట్టింది. అదనంగా, అలియా తన వ్యవస్థాపక ప్రయాణాన్ని నవంబర్ 2020లో 'ఎడ్ ఎ మమ్మా," ఎడ్ ఏ మామ్మ (Ed-a-Mamma) పేరిట చిన్నపిల్లల దుస్తుల ప్లాట్‌ఫాంనూ నిర్వహిస్తోంది.
దీపిక పదుకొణె: బాలీవుడ్ నటి, రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె సైతం పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇటీవల పాపులర్ అయిన మింత్రాలోనూ దీపికకు పెట్టుబడులు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేఏ ఎంటర్‌ప్రైజస్ ఎల్‌ఎల్‌పీ పేరిట ఓ కంపెనీ నెలకొల్పారు. వీటితో పాటు మరికొన్ని సంస్థలో వాటాలు ఆమెకు ఉన్నాయి.
సోనూసూద్: సోనూసూద్.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కె12 అనే ఎడ్యుకేషన్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. జితిన్ భాటియాతో కలిసి Explurger అనే సోషల్ మీడియా యాప్‌ను సైతం సోనూ ప్రారంభించారు.
చదవండి: కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!
Comments
Please login to add a commentAdd a comment