ఇటీవల యునికార్న్‌గా మారిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) భారత్‌లో అత్యధిక మంది ప్రొఫెషనల్స్ ఇష్టపడే వర్క్‌ప్లేస్ పరంగా అగ్ర స్టార్టప్‌గా అవతరించింది.
ప్రముఖ రిక్రూటింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ 'టాప్ 20 ఇండియన్ స్టార్టప్‌ల జాబితా'ను తాజాగా విడుదల చేసింది. తమకున్న దాదాపు కోటి మంది సభ్యుల డేటా ఆధారంగా నిపుణులు పని చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ లింక్డ్‌ఇన్ రూపొందించింంది.
ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీలో మెంబర్ ఎంగేజ్‌మెంట్ తదితర అంశాల్లో పురోగతి సాధించి జెప్టో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది ఇదే లింక్డ్‌ఇన్ టాప్ కంపెనీల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌ను సాధించింది.
ఇక ఈ ర్యాంకింగ్‌లో జెప్టో తర్వాతి స్థానాలలో వరుసగా ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్‌టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పాకెట్ ఎఫ్‌ఎం, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న 20 స్టార్టప్‌లలో 14 కొత్తగా చోటు దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment