![Zurich enters Indian general insurance market with Kotak Mahindra Bank - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/3/KOTAK-ZURICH-INSURANCE.jpg.webp?itok=HePI2YAQ)
ముంబై: సాధారణ బీమా సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో (కేజీఐ) స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం రూ. 4,051 కోట్లు వెచి్చంచనుంది. తదుపరి అదనంగా మూడేళ్లలో అదనంగా 19 శాతం వాటాలు కూడా జ్యూరిక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు కేజీఐ మాతృ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది.
వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, కేజీఐ తమకు పటిష్టమైన భాగస్వామి కాగలదని జ్యూరిక్ సీఈవో (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇరు సంస్థల వనరులు, అనుభవం తోడ్పడగలవని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రీమియంలపరంగా నాన్–లైఫ్ మార్కెట్‌లో సెపె్టంబర్‌లో కేజీఐకి 0.52 శాతం వాటా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1,148 కోట్ల మేర స్థూల ప్రీమియం సాధించింది. కొత్త పెట్టుబడుల అనంతరం సంస్థ విలువ రూ. 7,943 కోట్లుగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment