5G Technology In India: '5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట - Sakshi
Sakshi News home page

'5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట

Feb 21 2021 8:38 PM | Updated on Feb 22 2021 11:19 AM

5G is a 30 Billion Dollars Gold Mine For Indian IT Firms - Sakshi

న్యూఢిల్లీ: టెలీ కమ్యూనికేషన్ రంగం భవిష్యత్ లో భారత ఐటీ దిగ్గజాలకు కాసుల పంట పండించనున్నది. కరోనా మహమ్మారి పుణ్యమా? అని 5జీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఒకవేల కనుక ప్రపంచంలోని దేశాలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తే క్లౌడ్ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత కంపెనీలకు పెద్ద పెద్ద అవకాశాలు రానున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల మన దేశంలోని ఐటీ దిగ్గజాలకు 30 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు లభిస్తాయని అంచనా. భారతదేశంలో 5జీ రంగంలో పని చేస్తున్న టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలకు భారీగా లబ్ధి పొందనున్నాయి. 

తొలిదశలో టెలికాం ప్రొవైడర్ల నెట్‌వర్క్ ఆధునీకరణ, ఎక్విప్‌మెంట్ రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాలి. టెక్నాలజీలో ఎటువంటి మార్పులు సంభవించిన పరికరాల తయారీదారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు లభిస్తాయి. 5జీ టెక్నాలజీ వల్ల కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి, నూతన సేవలు అందుబాటులోకి తేవడానికి భారీగా వాల్యూక్రియేషన్ అవకాశాలు ఐటీ దిగ్గజాలకు లభిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) కమ్యూనికేషన్స్‌, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండస్ట్రీ గ్రూప్ అధ్యక్షుడు కమల్ భాడాడా వ్యాఖ్యానించారు. హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ కోసం టీసీఎస్ కసరత్తు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

చదవండి:

వాహనదారులకు కేంద్రం తీపికబురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement