
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో ఉన్న టెలికాం పరిశ్రమకు బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా టెలికాం రంగాన్ని చేర్చకపోవడం మరింత అసంతృప్తి కలిగించిందని మాథ్యూస్ అన్నారు. రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయి భారంతో ఇబ్బందులు పడుతున్న టెలికాం రంగానికి ఉపశమనం లభిస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు. దీనిపై మరింత వివరాలను పరిశీలించాల్సి వుందని పేర్కొన్నారు.స్మార్ట్ మీటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారనీ అది తమ రంగానికి ఎలా ఉపయోగపడుతుందో చూడాలన్నారు.
మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన ఆదాయ అంచనాను రెట్టింపు చేసి రూ .1.33 లక్షల కోట్లకు చేర్చింది. అప్పుల బారిన పడిన టెలికం రంగం నుంచి వచ్చే ఆదాయ అంచనాను ప్రభుత్వం రెండు రెట్లు పెంచింది. ప్రధానంగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిల (ఏజీఆర్) ద్వారా ఈ ఆదాయాన్ని అందుకోవాలని ప్లాన్ . కాగా ఏజీఆర్ చెల్లింపులు, లైసెన్స్ ఫీజు, అధిక స్పెక్ట్రం ఛార్జీలు (అంతర్జాతీయ ధరలతో పోల్చితే 30-40 శాతం అధికమని) టెల్కోలు వాదిస్తున్నాయి. లైసెన్స్ ఫీజు,ఎస్‌యూపీ లెవీలపై కొంత ఊరట లభిస్తుందని టెలికాం పరిశ్రమ కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకుంది. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
Comments
Please login to add a commentAdd a comment