బడ్జెట్‌పై పలు రంగాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి ప్రతి భారతీయుడికి తెలియాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ రూపకల్పనతో పాటు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మార్పుచేర్పుల కోసం నిపుణులు, ఆర్థికవేత్తల సలహాలు సూచనలు తీసుకోవడం ఎంత ముఖ్యమో బడ్జెట్‌పై సామాన్యుడికి అవగాహన ఉండటం కూడా అంతే ముఖ్య మని, అదే ప్రధాని మోదీ ఉద్దేశమని ఆమె వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆమె వాణిజ్య, పరిశ్రమ వర్గాలు, బ్యాంకర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, విద్యారంగ నిపుణులు, విధాన రూపకర్తలతో సమావేశమై కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సమాలోచనలు జరిపారు. పలు రంగాల ప్రతినిధుల సందేహాలకు ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సమాధానమిచ్చారు. అంతకు ముందు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ తయారీలో ముందుకెళ్లాల్సి ఉంటుం దన్నారు. బడ్జెట్ రూపకల్పన కోసం గత జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 8 నెలల పాటు సుదీర్ఘ కసరత్తు చేశామని తెలిపారు. ఆర్థిక శాఖ లోని ప్రతి కార్యదర్శి శాఖల వారీగా కసరత్తు చేశారని, అన్ని వర్గాలు, అన్ని శాఖలు, అన్ని విభాగాలను సంప్రదించి కేటాయింపులు జరిపామన్నారు.
ఎంఎస్‌ఎంఈ కోసం పోరాడుతున్నా..
బడ్జెట్‌పై సమావేశంలో భాగంగా ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై ఈ బడ్జెట్‌లో దృష్టి పెట్టలేదని, తమకు లాబీ చేసే శక్తి లేనందునే అలా చేశారా? అని ప్రశ్నించగా ఆ ప్రతినిధి వాదనను నిర్మల కొట్టిపారేశారు. తాను ఎంఎస్‌ఎంఈ కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు.
చదవండి : ‘ఏ రాష్ట్రానికీ తగ్గించలేదు’
Comments
Please login to add a commentAdd a comment