హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం చందాదార్ల సంఖ్య 2023 మే నెల చివరినాటికి 117.257 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 117.252 కోట్లు ఉంది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల వృద్ధి కేవలం 0.004 శాతం మాత్రమేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా గణాంకాల్లో వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సబ్‌స్రై్కబర్ల సంఖ్య ఏప్రిల్‌తో పోలిస్తే 51.864 కోట్ల నుంచి 51.914 కోట్లకు ఎగసింది. పట్టణ ప్రాంతాల్లో వినియోగదార్ల సంఖ్య 65.388 కోట్ల నుంచి 65.343 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ మొత్తం చందాదార్ల సంఖ్య 85.094 కోట్ల నుంచి 85.681 కోట్లకు పెరిగింది.
వైర్‌లెస్ చందాదార్లు..: మొబైల్ సబ్‌స్రై్కబర్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో 114.313 కోట్లు ఉంటే, మే నెలలో ఈ సంఖ్య 114.321 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో కొత్తగా 30 లక్షల మందిని చేర్చుకోవడంతో సంస్థ మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 43.63 కోట్లను తాకింది. భారతీ ఎయిర్‌టెల్ నూతనంగా 13.2 లక్షల మందిని సొంతం చేసుకుంది. దీంతో ఈ కంపెనీ వైర్‌లెస్ సబ్‌స్రై్కబర్ల సంఖ్య 37.23 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియాను మే నెలలో 28 లక్షల మంది కస్టమర్లు వీడారు.
బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు పెరిగారు
Published Thu, Aug 3 2023 6:33 AM | Last Updated on Thu, Aug 3 2023 6:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment