
పాక్షికంగా అమలుకు నిర్ణయం
న్యూఢిల్లీ: టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 కింద కొన్ని నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885.. వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం, 1993.. టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం, 1950 స్థానంలో కొత్త చట్టం పాక్షికంగా అమలు కానుంది. ‘‘ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 అమలు తేదీని జూన్ 26గా నిర్ణయించడమైనది.
నాటి నుంచి చట్టంలోని 1, 2, 10 నుంచి 30 వరకు, 42 నుంచి 44 వరకు, 46, 47, 50 నుంచి 58 వరకు, 61, 62 సెక్షన్లు అమల్లోకి వస్తాయి’’అని ప్రభుత్వ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కొత్త చట్టంలోని నిబంధనల కింద కేంద్ర సర్కారు జాతి భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలికమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను తన ఆ«దీనంలోకి తీసుకోవడంతోపాటు నిర్వహించగలదు. స్పామ్, హానికారక కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల నుంచి (సమాచారం) వినియోగదారులకు రక్షణ కలి్పంచడం తప్పనిసరి.