
న్యూఢిల్లీ: ఇకపై అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు తప్పనిసరిగా కొత్త ఫండ్ పథకం (NFO) నిధుల ను 30 రోజుల్లోగా వినియోగించవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.
వెరసి ఏఎంసీలు ఎన్‌ఎఫ్‌వోలో భాగంగా సమీకరించిన నిధులను సంబంధిత పెట్టుబడుల కోసం 30 రోజుల్లోగా వెచ్చించవలసి ఉంటుంది. సెబీ తాజా స ర్క్యులర్ ప్రకారం ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపు తదుపరి గడువు అమల్లోకి రానుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో తప్పుడు విక్రయాలకు తావివ్వకుండా సెబీ చెక్ పెట్టనుంది.
పథకం సమాచార పత్రా(ఎస్‌ఐడీ)లలో ఏ ఎంసీలు నిధుల వినియోగ గడువు, కేటాయింపు తదితరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఒకవేళ 30 పనిదినాల్లోగా నిధుల వినియోగా న్ని చేపట్టలేకపోతే.. కారణాలను వివరిస్తూ ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీకి లేఖ ద్వారా వెల్లడించవలసి ఉంటుంది. తద్వారా కమిటీ మరో 30 రోజుల గడువును ఇచ్చేందుకు వీలుంటుంది.