tata teleservices
-
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
Multibagger Stock: రూ.10 వేల పెట్టుబడితో ఏడాదిలో రూ.లక్ష లాభం!
అదృష్టం ఊరికే అందరినీ వరించదు. సరైన కాలంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో బుల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారిన పంట పడుతుంది. గత కొంత కాలంగా ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభాలు మూటగట్టుకుంటున్నారు మదుపరులు. అయితే ఈ ఏడాది జనవరి 1న టాటా గ్రూప్ కంపెనీ టీటీఎమ్ఎల్ అంటే టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ షేర్లు కొనుగోలు చేసినవారు ధనవంతులుగా మారిపోయారు. కేవలం ఏడాది కాలంలో ఈ షేర్ ధర సుమారు 1000 శాతం పెరిగింది. అంతే కాదు ఇప్పుడు కూడా తన పరుగులు కొనసాగిస్తోంది. ఈ మల్టీబ్యాగర్ వరుసగా మూడో రోజు పెరిగింది. ఈ బూమ్ మధ్యలో 5 శాతం ఎగువ సర్క్యూట్ స్టాక్‌లో నిమగ్నమై ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 1000 శాతానికి పైగా రాబడులను ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. అయితే ప్రాఫిట్-బుకింగ్ ప్రస్తుత స్థాయి నుండి చూడవచ్చు. ఈ ఏడాది జనవరి 1న రూ.10,000 విలువ గల టిటీఎమ్ఎల్ స్టాక్స్ కొని ఉంటే.. ఇప్పుడు అదే స్టాక్ విలువ రూ.1,00,000 విలువగా మరి ఉండేది. జనవరి 1న రూ.7.85లుగా ఉన్న టిటీఎమ్ఎల్ స్టాక్స్ ధర నేడు రూ.80.05గా ఉంది. గత నెలలో కంపెనీ స్మార్ట్ ఇంటర్నెట్ ఆధారిత సేవలను ప్రారంభించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. అలాగే, సంస్థ ఆదాయం నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో లోటు తగ్గుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో కంపెనీ నష్టం రూ.1410 కోట్ల నుంచి రూ.632 కోట్లకు తగ్గింది. ప్రమోటర్లు అత్యధిక వాటాను కలిగి ఉండటం కంపెనీకి మంచి విషయమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. (చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!) -
టెలికం కంపెనీలకు ‘సుప్రీం’ నిరాశ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల లెక్కల్లో తప్పులు దొర్లాయని, సవరించడానికి అనుమతించాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో వేసిన లెక్కలే చివరివనీ, వీటిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... ► దాదాపు రూ.1.4 లక్షల కోట్ల ఏజీఆర్‌ను టెలికం శాఖ డిమాండ్ చేసింది. టెలికంకు అనుకూలం గా 2019 అక్టోబర్‌లో సుప్రీం తీర్పు నిచ్చింది. ► అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీం కొంత ఊరటనిచ్చింది. టెలికం డిమాండ్ చేసిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీలోపు చెల్లించాలని టెలికం కంపెనీలకు గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన మొత్తాలను 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ఆయా అంశాలపై ఇదే తుది నిర్ణయమని కూడా స్పష్టం చేసింది. ► భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాసహా ఆపరేటర్లు ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించాయి. ► వేర్వేరుగా చూస్తే, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ.58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ.16,798 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.5,835.85 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.4,352.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. ► ఇందులో భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే రూ.18,004 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ ఐడియా రూ.7,854 కోట్లు, టాటాలు రూ.4,197 కోట్లు, రిలయన్స్ జియో రూ.194.79 కోట్లు చెల్లించాయి. ► అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.25,194.58 కోట్లు, ఎయిర్‌సెల్ రూ.12,389 కోట్లు, వీడియోకాన్ కమ్యూనికేషన్స్ రూ.1,376 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇవి దివాలా ప్రక్రియలో ఉన్నాయి. ► ప్రభుత్వానికి రూ.604 కోట్లు బకాయిపడ్డ లూప్ టెలికం, ఎటిసలాట్ డీబీ, ఎస్ టెల్ భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేశాయి. ► ఇదిలావుండగా, తమ ఆస్తులలో భాగంగా ఎయిర్ వేవ్స్ లేదా స్పెక్ట్రంను టెలికం కంపెనీలు బదిలీ చేయవచ్చా లేదా విక్రయించవచ్చా అనే ప్రశ్నపై దాఖలైన ఇతర పిటిషన్ల విచారణ ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ముందు ఉంది. షేర్ల ధరలు ఇలా... సుప్రీం తీర్పు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్ ధర శుక్రవారం ఎన్ఎస్ఈలో దాదాపు 10 శాతం పడి, రూ.8.35 వద్ద ముగిసింది. ఇక ఇండస్ టవర్స్ షేర్ ధర 5 శాతం తగ్గి రూ.220.50 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేర్ ధర మాత్రం స్వల్పంగా (0.29 శాతం) పెరిగి రూ.548.30 వద్ద ముగిసింది. టాటా టెలిసర్వీసెస్ కూడా 5 శాతం నష్టపోయి రూ. 37.75 వద్ద ముగిసింది. వీఐఎల్‌కు ఇబ్బందే: విశ్లేషణలు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు టెలికం కంపెనీలకు ప్రత్యేకంగా రుణ భారాలను మోస్తున్న వొడాఫోన్ ఐడియాకు తీవ్ర ఇబ్బందికర పరిణామమని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ తీర్పు ప్రతికూలతను పరోక్షంగా ఎదుర్కొనే సంస్థల్లో తరువాత ఇండస్ టవర్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. ఫైనాన్షియల్ సేవల సంస్థ... సిటీ దీనిపై విశ్లేషిస్తూ, వొడాఫోన్ ఐడియా దాదాపు రూ.25,000 కోట్ల సమీకరణ ప్రణాళికలపై తాజా పరిణామం ప్రభా వం పడుతుందని పేర్కొంది. అయితే భారతీ ఎయిర్టెల్ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉండబోదని విశ్లేషించింది. ఎడిల్వీస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్) బకాయిలను తిరిగి లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించిన టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం కంపెనీలు పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఉన్నత న్యాయస్థానం టెలికామ్ కంపెనీలకు ఏజీఆర్ బకాయిలను 10 ఏళ్ల కాలం(2030 వరకు)లో తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఏజీఆర్ బకాయిలను ప్రతి సంవత్సరం 10 శాతానికి సమానంగా చెల్లించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి మొదటి విడతగా కంపెనీలు మార్చి 31, 2021లోపు 10 శాతం బకాయిలను చెల్లించాలి. ఏజీఆర్ చార్జీల లెక్కింపునకు సంబంధించి టెలికామ్ విభాగం(డీఒటీ) అనుసరించిన విధానంలో దోషాలు ఉన్నట్లు టెలికాం కంపెనీలు ఆరోపించాయి. ఈ దోషాలను సవరిస్తే కంపెనీలు చెల్లించాల్సిన బకాయలు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నాయి. మొదట విడత బకాయి నిదులు చెల్లించకపోవడంతో మళ్లీ ఈ వివాదం తిరిగి కోర్టుకు వచ్చింది. ఏజీఆర్ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పెట్టుకున్న అభ్యర్థనను తోసిపుచ్చింది, ఏజీఆర్ ఛార్జీలను 10 వార్షిక వాయిదాల్లో చెల్లించాలని ఏప్రిల్ 1న జారీ చేసిన ఆదేశాల్లోనే పునఃలెక్కింపును కోర్టు నిషేధించిందని నేటి తీర్పులో ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్ ఛార్జీలను తిరిగి లెక్కించడం కుదరని తేల్చి చెప్పింది. వొడాఫోన్-ఐడియా రూ.58,254 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు, టాటా టెలిసర్వీసెస్ రూ.16,798 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నాయి. -
టెల్కోలకు మరిన్ని కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్టెల్ రూ. 10వేలకోట్లు, వోడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే బ్యాంక్ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్ వెల్లడించింది. టాటా టెలీ సర్వీసెస్ ప్రకటనపై డాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ టాటా టెలీ సర్వీసెస్‌కు ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్ స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు), పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు. మిగిలిన ఏజీఆర్ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు. మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. -
టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్ డెస్క్ ఆఫీసర్ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్ డెస్క్ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్ ఆఫీసర్ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా.. దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ ఆఫీసర్ తీరుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు. మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్ సంస్థ కామ్ ఫస్ట్ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా.. శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. వివాదం ఏంటంటే... లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్ డెస్క్ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. వొడా–ఐడియా షేరు భారీ పతనం సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38%, ఎస్బీఐ 2.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.77%, యాక్సిస్ బ్యాంక్ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే. -
ఎయిర్టెల్ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్(టీటీఎస్ఎల్) విలీనానికి టెలికం డిపార్ట్మెంట్(డాట్) ఆమోదం తెలిపింది. అయితే భారతీ ఎయిర్టెల్ రూ.7,200 కోట్ల బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాలని షరతు విధించామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల కింద రూ.6,000 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ నుంచి పొందినస్పెక్ట్రమ్ కోసం మరో రూ.1,200 కోట్ల బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాలని ఆ అధికారి వివరించారు. దీంతో ఎయిర్‌టెల్‌లో టాటా టెలీసర్వీసెస్ విలీనం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ విలీనానికి ఈ నెల 9న టెలికం మంత్రి మనోజ్ సిన్హా షరతులతో కూడిన ఆమోదాన్ని తెలిపారని ఆ అధికారి పేర్కొన్నారు. విలీనం జరగటానికి ముందే ఇరు కంపెనీలు కోర్టు కేసుల విషయమై అండర్‌టేకింగ్‌ను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. -
టాటా టెలీ ఫైబర్ ఆస్తుల కోసం బిడ్
ముంబై: టాటా టెలీసర్వీసెస్‌కు చెందిన ఎంటర్ప్రైజ్ బిజినెస్‌ను(ఫైబర్ టెలికం నెట్వర్క్) కొనుగోలు చేయటానికి టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారులే బిడ్ వేసినట్లు తెలిసింది. టాటా గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ కార్యకలాపాల అధినేత, గతంలో బ్రాండ్ కస్టోడియన్‌గా వ్యవహరించిన ముకుందరాజన్ నేతృత్వంలో టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఈ బిడ్‌ను దాఖలు చేశారని ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న ఒక వ్యక్తి వెల్లడించారు. వీరికి టీపీజీ క్యాపిటల్ నేతృత్వంలోని కన్సార్షియమ్ తోడ్పాటునందిస్తోంది. ఈ కన్సార్షియమ్ ఈ ఆస్తుల కోసం వంద కోట్ల డాలర్లపైనే కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ కుదిరితే ఈ రంగంలో ఇదే అతి పెద్ద డీల్ కానుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కమ్యూనికేషన్స్ కూడా ఈ ఆస్తుల కొనుగోళ్ల రేసులో ఉంది. 1,25,000 రూట్ కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్, ఇతర ఆస్తులను ఈ కన్సార్షియమ్ దక్కించుకుంటే ఈ వ్యాపారాన్ని చూసుకోవడం కోసం ముకుందరాజన్ టాటా గ్రూప్ నుంచి బయటకొస్తారని ఆ వ్యక్తి పేర్కొన్నారు. గతంలో టాటా టెలీసర్వీసెస్‌కు ఎమ్‌డీగా రాజన్ పనిచేశారని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించే అనుభవం అయనకుందని, అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ వార్తలపై టాటా సన్స్, టీపీజీ క్యాపిటల్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటాటెలి సర్వీసెస్ తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని గత ఏడాది అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. -
ఖజానాకు భారీగా గండికొట్టిన టెల్కోలు
న్యూఢిల్లీ : మార్కెట్లోకి నూతనంగా ప్రవేశించిన రిలయన్స్ జియోతో పాటు మరో నాలుగు టెలికాం కంపెనీలు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టాయి. ఈ టెలికాం కంపెనీలు రూ.14,800 కోట్లకు పైగా రెవెన్యూలను తక్కువ చేసి చూపించాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,578 కోట్లు గండికొట్టిందని ఆడిట్ సంస్థ కాగ్ మంగళవారం వెల్లడించింది. నేడు పార్లమెంట్‌కు సమర్పించిన రిపోర్టులో కాగ్ ఈ విషయాలను తెలిపింది. రూ.1,015.17 కోట్ల లైసెన్సు ఫీజులను ప్రభుత్వానికి తక్కువ చెల్లించాయని కాగ్ తెలిపింది. రూ.511.53 కోట్లు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ రూపంలో, రూ.1,052.13 కోట్లు చెల్లింపులు ఆలస్యంగా చేసినందుకు గాను వర్తించే వడ్డీలు ప్రభుత్వానికి గండికొట్టాయని పేర్కొంది. టాటా టెలిసర్వీసుల నుంచి రూ.1,893.6 కోట్లు, టెలినార్ నుంచి రూ.603.75 కోట్లు, వీడియోకాన్ నుంచి రూ.48.08 కోట్లు, క్వాడ్రాంట్ నుంచి రూ.26.62 కోట్లు, జియో నుంచి రూ.6.78 కోట్లు... లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, వడ్డీ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు తక్కువగా వచ్చాయని కాగ్ వెల్లడించింది. -
టెలికాం దిగ్గజంలోకి టాటా టెలి కస్టమర్లు
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లోకి టాటా టెలిసర్వీసెస్ కస్టమర్లను మార్చే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. టాటా గ్రూప్ కన్జ్యూమర్ మొబైల్ బిజినెస్‌లను భారతీ ఎయిర్టెల్ టేక్‌వర్ చేసుకున్న నేపథ్యంలో ఇరు కంపెనీ ఈ ప్రక్రియను మొదలుపెట్టాయి. తొలుత యూపీ(వెస్ట్), బిహార్, పశ్చిమబెంగాల్ సర్కిల్లోని కస్టమర్లను ట్రాన్స్ఫర్ చేస్తామని ఇరు కంపెనీ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వచ్చే వారాల్లో టాటా టెలి సర్వీసెస్‌కు చెందిన అన్ని సర్కిల్లోని మొబైల్ కస్టమర్లందర్నీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి మారుస్తామని పేర్కొన్నాయి. ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) అరేంజ్మెంట్ కింద నేటి నుంచి టాటా టెలిసర్వీసెస్ కస్టమర్లను ఎయిర్టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లోకి బదలాయిస్తున్నామని తెలిపాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా కస్టమర్లను ఎయిర్టెల్ సర్వీసులోకి మారుస్తున్నామని చెప్పాయి. ఇటీవలే టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ కన్జ్యూమర్ మొబైల్ బిజినెస్‌లను టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్‌లను ఎయిర్టెల్ తనలో విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. రెగ్యులేటరీ ఆమోదం ద్వారా ఈ టేకోవర్ ప్రక్రియ కొనసాగుతోంది. -
5 రోజుల్లోనే డీల్ పూర్తి, అదెలా?
వ్యాపారాల్లో మార్పులు ఎంత వేగవంతంగా జరుగుతాయో మరోసారి భారతీ గ్రూప్, టాటా టెలిసర్వీసు విషయంలో రుజువైంది. కేవలం ఐదే ఐదు రోజుల్లో టాటా టెలిసర్వీసెస్, ఎయిర్టెల్ గూటికి చేరింది. అంతా అయిపోయిందనుకున్న క్షణంలో టాటా టెలిసర్వీసెస్‌కు కొత్త ఊపిరి పోసినట్టైంది. నిజానికి టాటాలకు, భారతీ కంపెనీలకు మధ్య ఈ విషయంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆగస్టులో వీరి చర్చలు సమసిపోయాయి. ఇక ఎలాంటి డీల్‌ను కుదుర్చుకునేది లేదని తేల్చేసుకున్నాయి. సెప్టెంబర్ చివరి వరకు ఎలాంటి డీల్ కానీ, దానిపై ఇసుమంతైనా ప్రస్తావన లేదు. రిలయన్స్ జియో, ఇతర టెల్కోలతో టాటా గ్రూప్ చర్చలు జరిపినప్పటికీ, అవి కూడా విజయవంతం కాలేదు. చివరికి టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయాలనే టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ విషయంపై టాటా గ్రూప్‌కు చెందిన టాప్ అధికారులు న్యూఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అధికారులను కలిశారు. తమ టెలికాం వ్యాపారాలను మూసివేస్తున్నట్టు గత శుక్రవారం ప్రభుత్వానికి చెప్పేశారు. కానీ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్‌గా వచ్చిన ఎన్ చంద్రశేఖరన్(చంద్ర) టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయడానికి అసలు ఇష్టపడలేదు. ప్రధానమంత్రి కార్యాలయంలోని అధికారులతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులతో భేటీ అయిన చంద్రశేఖరన్, ఈ విషయంపై పలు దఫాల చర్చించారు. ఇప్పటికే టెలికాం పరిశ్రమ ఒత్తిడిలో ఉందని, ఈ సమయంలో ఎలాంటి కంపెనీ మూత పడటానికి ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇష్టపడలేదు. గత వీకెండ్ నుంచి పరిస్థితుల్లో మెల్లమెల్లగా మార్పులు రావడం ప్రారంభమైంది. భారతీ చైర్మన్ సునిల్ మిట్టల్, చంద్రతో సమావేశమయ్యారు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ డీల్‌పై ఓ క్లారిటీకి వచ్చేశారు. తమ టెలికాం వ్యాపారాలను విలీనం చేసుకునేందుకు రెండు కంపెనీలు ఆమోదించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. టాటాలు కూడా తమ 149 ఏళ్ల చరిత్రలో ఏ కంపెనీని మూసివేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో టాటా టెలిసర్వీసెస్‌ను, ఎయిర్‌టెల్‌లో కలిపేశారు. -
మెగా డీల్: టెలికాం దిగ్గజం చేతికి టాటా టెలి
సాక్షి, న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో మూత పడబోతున్న టాటా టెలిసర్వీసుల వైర్లెస్ వ్యాపారాలను ఎవరు కొనబోతున్నారు? నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఎవరి చేతిలోకి వెళ్లబోతుంది? అంటే టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వీటిని సొంతం చేసుకోబోతుందని తెలిసింది. ఈ విషయంపై ఇరు కంపెనీలు అధికారిక ప్రటకన వెలువరించాయి. టాటా టెలీసర్వీసెస్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్‌లో విలీనమవుతుందని కంపెనీలు ప్రకటించాయి. భారతీ ఎంటర్ప్రైజ్ అధినేత సునిల్ మిట్టల్‌తో నాలుగు నెలల పాటు చర్చలు జరిపిన టాటా గ్రూప్, తమ వైర్లెస్ మొబైల్ వ్యాపారాలను ఎయిర్‌టెల్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ డీల్‌లో భాగంగా టాటాకు చెందిన రూ.10వేల కోట్ల స్పెక్ట్రమ్ బాధ్యతను కూడా భారతీ తీసుకోబోతుంది. టాటా టెలి దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో 800, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండుల్లో 180 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం భారతీ బోర్డు సమావేశమైందని, ఈ ప్రతిపాదనను అంగీకరించింది. భారతీ బోర్డు అంగీకారం అనంతరం ఈ విషయంపై ప్రకటన వెలువరించాయి. -
టాటా టెలీ కథ కంచికి!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో గడ్డు పరిస్థితుల నేపథ్యంలో మరో కంపెనీ కథ కంచికి చేరనుంది. టాటా టెలీ సర్వీసెస్ ప్రయాణం త్వరలోనే ముగిసిపోనున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా కార్యకలాపాలను టాటా టెలీ సర్వీసెస్ మూసివేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే 6,000 ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయి. టాటా టెలీ బ్యాంకులకు 28,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. దీంతో ఆస్తులను నిలువునా అమ్మేసి అప్పులు తీర్చే అవకాశం ఉందని అంచనా. ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా టాటాలు టెలికం విభాగం కోసం రూ.50,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా ఆస్తుల విక్రయంతో వచ్చేది కొంతే. టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ లేఖ ఆధారంగా చూస్తే టాటా టెలీ సర్వీసెస్‌ను అర్ధంతరంగా మూసేస్తే గ్రూపునకు వాటిల్లే నష్టం రూ.32,000 కోట్లు. దీంతో పాటు భాగస్వామ్యం నుంచి వైదొలగినందుకు డొకోమోకు చెల్లించిన రూ.7,600 కోట్లు కూడా నష్టం కిందకే వస్తుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో టాటా టెలీసర్వీసెస్ ఏకంగా రూ.4,517 కోట్ల నష్టాలను చవిచూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టం రూ.2,023 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది. టర్నోవర్ రూ.9,419 కోట్లుగా ఉంది. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ఈ కంపెనీ వాటా 3.5 శాతంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టాటా టెలి తనకున్న స్పెక్ట్రమ్‌ను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని ద్వారా కంపెనీకి రూ.10,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అలాగే టవర్ల వ్యాపారం ఏటీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మిగిలి ఉన్న 32 శాతం వాటాను ఏటీసీకి విక్రయించడం వల్ల రూ.6,700 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కంపెనీకి దేశవ్యాప్తంగా 1,25,000 కిలోమీటర్ల మేర ఉన్న ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్‌ను విక్రయించినట్టయితే మరో రూ.5,000–7,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
5000 మందిని ఇంటికి పంపేస్తున్న టాటా
ముంబై : టాటా గ్రూప్ తన 21 ఏళ్ల ఫోన్ సర్వీసు వెంచర్ టాటా టెలిసర్వీసస్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పబోతుంది. ఈ వైర్లెస్ సర్వీసులను మూసివేస్తున్న క్రమంలో టాటా సర్వీసెస్‌కు చెందిన ఉద్యోగులను టాటా గ్రూప్ ఇంటికి పంపేస్తోంది. ఈ మూసివేత ప్రక్రియలో భాగంగా దాదాపు 5వేల మంది ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల నోటీసు కూడా ఇస్తోంది. ఎవరైతే ముందస్తుగా కంపెనీని వీడి వెళ్లాలనుకుంటారో వారికి సెవరెన్స్ ప్యాకేజస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. పెద్ద వారికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్)ను, కొంతమంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీలకు టాటా గ్రూప్ బదిలీ చేస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన తమ టెలికాం కంపెనీని త్వరలోనే మూసివేయబోతున్నాని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు, ఇండస్ట్రి ఇన్సైడర్స్ చెప్పారు. టాటా గ్రూప్ ఎల్లవేళలా తమ ఉద్యోగులను కాపాడుతుందని, కానీ ఈసారి కొద్ది మందిని మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీల్లోకి పంపుతున్నామని ఓ సీనియర్ అధికారి చెప్పారు. టాటా టెలిసర్వీసు కంపెనీ ఉద్యోగులతో ఇతర టాటా కంపెనీలపై భారం మోపడం అన్యాయమంటూ ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలకు తగ్గ వారిని మాత్రమే బదిలీ చేస్తున్నామని తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు వచ్చే నెలల్లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నామని టాటా గ్రూప్ సీనియర్ అధికారి చెప్పారు. మెజార్టీ ఉద్యోగులకు టాటా గ్రూప్‌కు చెందిన ఈ టెలికాం యూనిట్ మూడు నుంచి ఆరు నెలల నోటీసును ఇది ఆఫర్ చేసింది. ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వారు సెవరెన్స్ ప్యాకేజీని అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ వార్షిక రిపోర్టు ప్రకారం 2017 మార్చి వరకు టాటా టెలిసర్వీసులో 5,101 మంది ఉద్యోగులున్నారు. -
టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన 21 ఏళ్ల ఫోన్ సర్వీసు వెంచర్ టాటా టెలిసర్వీసస్‌కు ఇక స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. వైర్లెస్ వ్యాపారాలను మూసివేయనున్నట్టు టాటా గ్రూప్ శుక్రవారం ప్రభుత్వానికి తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులను కలిసిన టాటా గ్రూప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్, టాటా టెలిసర్వీసస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనాథ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయంపై చర్చలు జరిపినట్టు తెలిసింది. ప్రస్తుతం తాము కలిగి ఉన్న స్పెక్ట్రమ్ హోల్డింగ్స్‌ను విక్రయించాలని భావిస్తున్నట్టు చెప్పారు. టాటా టెలిసర్వీసస్ టాటా గ్రూప్ టెలికాం యూనిట్. వైర్లెస్ వ్యాపారాలను మూసివేయాలని వారు భావిస్తున్నారని, ఈ ప్రక్రియను నెలలోగా ప్రారంభించనున్నట్టు ఈ విషయం తెలిసిన సంబంధిత వర్గాలు చెప్పాయి. ఒక్కసారి ఈ ప్రక్రియను వారు ప్రారంభిస్తే 60 రోజుల్లో మొత్తం పూర్తిచేస్తారని పేర్కొన్నాయి. గంటన్నరకు పైగా డీఓటీ అధికారులతో టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశమయ్యారు. ఇతర డిపార్ట్మెంట్లకు కూడా ఇదే విషయంపై సమాచారం అందించనున్నట్టు పేర్కొన్నారు. టాటా టెలిసర్వీసస్‌కు మొత్తం భారత్‌లో 19 సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 149 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి అతిపెద్ద ఒక టాటా గ్రూప్ మూతపడటం ఇదే మొదటిసారి. 1996లో ల్యాండ్‌లైన్ కార్యకలాపాలతో టాటా టెలిసర్వీసస్ను టాటా గ్రూప్ ఏర్పాటుచేసింది. దీని సీడీఎంఏ ఆపరేషన్లను 2002లో, జీఎస్ఎం సర్వీసులను 2008లో ప్రారంభించారు. ఎన్టీటీ డొకోమో నుంచి రూ.14వేల పెట్టుబడులను ఇది పొందింది. -
ఎయిర్ టెల్ గుప్పిట్లోకి మరో టెలికాం
-
ఎయిర్ టెల్ గుప్పిట్లోకి మరో టెలికాం
నష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటూ.. ఎయిర్ టెల్, ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే భారత వ్యాపారాల్లో నష్టాలో ఉన్న టెలినార్ ను తనలో విలీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్ టెల్... మరో టెలికాం ఆపరేటర్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. టాటా గ్రూప్ కు చెందిన టాటా టెలీసర్వీసులను భారతీ ఎయిర్ టెల్ కొనుగోలు చేసే అవకాశముందుని ఓ యూకే రీసెర్చ్ సంస్థ చెప్పింది. దీంతో వచ్చే మూడేళ్లలో కేవలం నాలుగు ఆపరేటర్లు మాత్రమే భారత టెలికాం సెక్టార్ లో ఉంటాయని లండన్ కు చెందిన సీసీఎస్ ఇన్ సైట్ రిపోర్టు చెప్పింది. 57 టెలికాం ఎం అండ్ ఎం ప్రభావితదారులతో అధ్యయనం చేపట్టి సీసీఎస్ ఇన్ సైట్ ఈ రిపోర్టును నివేదించింది. ఈ సర్వేలో 68 శాతం మంది నిపుణులు(బ్యాంకర్లు, లాయర్లు, టెలికాం ఎగ్జిక్యూటివ్ లు) 2020 నాటికి నాలుగే ఆపరేటర్లు మార్కెట్లో ఉంటాయని చెప్పారని రిపోర్టు తెలిపింది. వారిలో 300 మిలియన్ కు పైగా సబ్ స్క్రైబర్లతో మూడు ప్రైవేట్ ప్రొవైడర్లు, 100 మిలియన్ కు పైగా యూజర్లతో ఓ ప్రభుత్వ రంగ ఆపరేటర్ ఉంటుందని పేర్కొంది. టాటా టెలి ఓ కొత్త హోమ్ కోసం వెతుకుతుండగా.. అంబానీ బ్రదర్స్ తమ రెండు వ్యాపారాలను(రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్లు) కలిపేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పింది. వొడాఫోన్, ఐడియా విలీనమవుతూ టెలికాం మార్కెట్లో ఆధిపత్య స్థానానికి వచ్చేయాలని చూస్తుండగా.. భారతీ ఎయిర్ టెల్ కూడా ఇటీవల ఎక్కువగా కొనుగోలు చర్చలు తెరలేపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నష్టాల ఊబిలో ఉన్న టాటా టెలీని కొనుగోలు చేయడానికి ఎయిర్ టెల్ కొంత వ్యాపార తెలివితేటలు కూడా వాడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టాటాలతో డీల్ కుదుర్చుకోవడానికి ప్రధాన కారణం మార్కెట్ రెవెన్యూ షేరులో ఆధిపత్య స్థానాన్ని అలానే కొనసాగించాలని కోరుకోవడమేనని తెలిపారు. వొడాఫోన్, ఐడియా డీల్ ఎయిర్ టెల్ కు పెనుముప్పుగా ఉందని, కానీ వారికి కచ్చితంగా సునిల్ మిట్టర్ కౌంటర్ ఇస్తారని ఓ టాప్ ఇండస్ట్రి విశ్లేషకుడు చెప్పారు. ఆకర్షణీయమైన ధరలతో ఇలాంటి డీల్స్ ను కుదుర్చుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా టెలి సుమారు రూ.9500 కోట్ల రెవెన్యూలను కలిగి ఉంది. -
600 మందిపై వేటువేసిన టాటా
రిలయన్స్ జియో ఎంట్రీ ఇటు కస్టమర్లకు ప్రయోజనాలు ఏమో కానీ, ఉద్యోగుల, కంపెనీల పొట్టను కొడుతోంది. టెలికాం ఇండస్ట్రీలో భారీ నష్టాలతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు. తాజాగా టాటా టెలిసర్వీసెస్ కంపెనీ 500 నుంచి 600 మంది ఉద్యోగులను తీసేసినట్టు తెలిసింది. టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక, ఉద్యోగులపై వేటు వేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. సేల్స్, ఇతర సంబంధిత విభాగాల్లో పనిచేసే 500-600 మందిపై లేఆఫ్ ప్రభావం పడనుందని ఇద్దరు కంపెనీకి చెందిన వ్యక్తులు చెప్పారు. ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకెజ్ కూడా కంపెనీ ఆఫర్ చేసిందని తెలిపారు. ఒక్కో ఏడాది సర్వీసుకు నెల వేతనాన్ని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే దీనిపై టాటా టెలిసర్వీసెస్ ఇంకా స్పందించలేదు. టెలికాం ఇండస్ట్రీకి ఇది చాలా ఛాలెంజింగ్ సమయమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ జియో ఎంట్రీతో నెలకొన్న తీవ్రమైన టారిఫ్ వార్ తోనే టెలికాం ఇండస్ట్రీ ఈ ఉద్యోగాల కోతను భరించాల్సి వస్తుందన్నారు. జియో సంచలన ఆఫర్లు ఉద్యోగుల పొట్టను కొడతాయని ఇప్పటికే చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన జియో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఇండస్ట్రీ రుణం దాదాపు 4.6 లక్షల కోట్లకు ఎగిసింది. టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ, దేశవ్యాప్తంగా 19 టెలికాం సర్కిళ్లలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జీఎస్ఎం, సీడీఎమ్ఏ, 3జీ ప్లాట్ ఫామ్స్ పై టాటా టెలిసర్వీసెస్ వైర్ లెస్, వైర్ లైన్ నెట్ వర్క్స్ ను తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అంచనాల ప్రకారం 2017 ఫిబ్రవరి 28కి కంపెనీ మొబైల్ సబ్ స్క్రైబర్ బేస్ 51.2 మిలియన్ పెరిగింది. దీంతో మొత్తంగా కంపెనీ మొబైల్ సబ్ స్క్రైబర్ బేస్ 1.16 బిలియన్ కంటే ఎక్కువగానే ఉంది. -
దిగ్గజ కంపెనీలకు షాకిచ్చిన ఆస్కి
ముంబై:ప్రకటనల వాచ్ డాగ్ ఆస్కి(ఏఎస్పీఐ) దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), హిమాలయా, టాటా టెలిసర్వీసెస్, సహా 134 సంస్థల ప్రకటనలను ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పు బట్టింది. ఇలాంటి ప్రకటనల్లో నిజాయితీ లేదనీ భారతీయ ప్రమాణాల మండలి తేల్చి చెప్పింది. ఇవి వాస్తవదూరంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీటిలో 44 ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగానికి చెందినవి. వీటితోపాటు 24 ఆహార-పానీయాలు, 8 వ్యక్తిగత సంరక్షణ విభాగాలవి. ఈ కంపెనీలు చెందిన యాడ్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆస్కికి చెందిన వినియోగదారుల ఫిర్యాదుల మండలి (సీసీసీ) ఆక్షేపించింది. గ్లాక్సోస్మిత్ క్లైన్ కన్జూమర్ హెల్త్‌కేర్, జిలెట్, హిందుస్థాన్ యునిలీవర్ సహా 183 సంస్థల ప్రకటలపై ఫిర్యాదులు రాగా, 134 ప్రకటనలపై ఫిర్యాదులను ఆస్కి సమర్థించింది. ముఖ్యంగా డొకోమో సర్వీసులకు చెందిన ప్రకటనలు 68 రూపాయల రీచార్జ్ పై 30 పైసలు నిమిషానికి ఎస్టీడీ, లోక్ కాల్స్ ప్రకటన హిందుస్థాన్ యూనీలీవర్ డియోడరెంట్, జిల్లెట్ వెక్టార్ ప్రకటనలను ఆస్కి తప్పు బట్టింది. కాగా ఆస్కి ప్రకటనపై స్పందించిన ఎంఅండ్ ఎం ప్రతినిధి సదరు ప్రకటన లోకల్ ఏజెన్సీ తయారు చేసిందనీ, తక్షణమే ఆ యాడ్ నిలిపివేయాల్సిందిగా ఆదేశాల్చినట్టు తెలిపింది.దీనిపై ఎయిర్ టెల్ ప్రతినిధి స్పందించారు. ఆస్కి నిర్ధారణలను అంగీకరించమని వ్యాఖ్యానించారు. అటు హిమాలయా కూడా ఆస్కి ఆక్షేపణలను ఖండిస్తూ స్పందించింది -
టాటా సన్స్‌పై డొకొమో దావా
న్యూఢిల్లీ/టోక్యో: జపాన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎన్టీటీ డొకొమో టాటా సన్స్‌ను ఆర్బిట్రేషన్ కోర్టుకు లాగింది. టాటా టెలిసర్వీసెస్‌తో తాము ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో వాటా కొనుగోలు విషయంలో టాటా సన్స్ విఫలమైందనేది ఎన్టీటీ డొకొమో వాదన. ఈ నెల 3న లండన్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో టాటా సన్స్‌కు వ్యతిరేకంగా డొకొమో ఈ దావా దాఖలు చేసింది. వివరాలివీ... టాటా డొకొమోతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో తమకున్న 26.5 శాతం (రూ.7,250 కోట్ల విలువ) వాటాను విక్రయించడం ద్వారా ఆ జేవీ నుంచి వైదొలగనున్నామని ఎన్టీటీ డొకొమో గత ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. ఆ జేవీలో భాగస్వామిగా ఉన్న టాటా సన్స్ ఆ వాటాను కొనుగోలు చేస్తుందని పేర్కొంది. అయితే ఇరువైపులా తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా ఈ డీల్ సాకారం కాలేదు. ఈ డీల్ విషయమై టాటా సన్స్‌తో పదే పదే సంప్రదింపులకు ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ టాటా సన్స్ విఫలమైందని డొకొమో తన పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ డీల్ సాకారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశామని టాటా సన్స్ ప్రతినిధి చెప్పారు. -
టెలిఫోన్ యూజర్లు @ 94.64 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూలై చివరినాటికి 94.64 కోట్లకు పెరిగిందని ట్రాయ్ బుధవారం తెలిపింది. జూలైలో 34.5 లక్షల మంది కొత్తగా టెలిఫోన్ వినియోగదారులయ్యారని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పేర్కొంది. ఇతర వివరాలు.... ఈ ఏడాది జూన్ చివరి నాటికి 94.29 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూలై నాటికి 0.37 శాతం వృద్ధితో 94.64 కోట్లకు చేరింది. పట్టణ వినియోగదారుల సంఖ్య 55.97 కోట్ల నుంచి 56.24 కోట్లకు, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 38.31 కోట్ల నుంచి 38.39కోట్లకు చేరింది. టెలిఫోన్ సాంద్రత 75.80 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది. మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 91.49 కోట్ల నుంచి 0.42 శాతం వృద్ధితో 91.87 కోట్లకు చేరింది. మొత్తం వెర్లైస్ టెలి డెన్సిటీ 73.78 శాతానికి పెరిగింది. మొత్తం వెర్లైస్ వినియోగదారుల మార్కెట్లో ప్రైవేట్ రంగం వాటా 90 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ల వాటా 10 శాతంగా ఉంది. జూలైలో మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కోసం 28.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 6.88 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో 7.08 కోట్లకు పెరిగింది. -
టాటా టెలీకి డొకోమో గుడ్‌బై
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో కలసి నెలకొల్పిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టు టాటా టెలీ సర్వీసెస్ (టీటీఎస్ఎల్) నుంచి నిష్ర్కమించాలని యోచిస్తున్నట్లు జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2009, 2011 సంవత్సరాల్లో 261 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసిన 26.5 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా వైర్లెస్ మొబైల్ సేవలను అందిస్తున్న టీటీఎస్ఎల్ నష్టాల్లో కొనసాగుతోంది. ఎన్టీటీ డొకోమో వాటా కొనుగోలుకు వొడాఫోన్ ఆసక్తితో ఉన్నట్లు వదంతులు విన్పించాయి కానీ ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి వొడాఫోన్ నిరాకరించింది. టాటా టెలిపై అజమాయిషీని కొనసాగించేందుకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్.. డొకోమో వాటాను కొనే అవకాశముంది. ఒప్పందంలో విక్రయ షరతు... గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంచనా లక్ష్యాలను సాధించలేకపోయిన పక్షంలో తమ వాటాను విక్రయించుకోవచ్చని 2009లో జాయింట్ వెంచర్ ఒప్పందంలో పేర్కొన్నట్లు డొకోమో తెలిపింది. వాటా అమ్మకం ధర కొనుగోలు రేటులో 50 శాతం (రూ.7,250 కోట్లు) లేదా సముచిత మార్కెట్ ధర, ఏది ఎక్కువైతే అది ఉంటుందని వివరించింది. టీటీఎస్ఎల్లో వాటా (124.90 కోట్ల షేర్లు) విక్రయ ప్రతిపాదనను తమ డెరైక్టర్ల బోర్డు ఆమోదించినట్లు తెలిపింది. మున్ముందు ఏం జరుగుతుందో ఊహించలేమని టీటీఎస్ఎల్ మరో ప్రకటనలో పేర్కొంది. టాటా సన్స్‌కు తమ బాధ్యతలు తెలుసనీ, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కంపెనీ వ్యవహరిస్తుందనీ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగంగా టీటీఎస్ఎల్ కొనసాగుతుందని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఐదో వంతు తగ్గిన చందాదారులు ... లాభాల మార్జిన్ అధికంగా ఉండే 3జీ సేవలను ప్రవేశపెట్టడంతో జాప్యం కారణంగానే టీటీఎస్ఎల్ పనితీరు పేలవంగా ఉందని డొకోమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోరు కాటో టోక్యోలో వ్యాఖ్యానించారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే టీటీఎస్ఎల్ చందాదారుల సంఖ్య 20 శాతం తగ్గిపోయి 6.31 కోట్లకు చేరిందని టెలికమ్ రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
నల్లధనంపై పోరుకు కొత్త యంత్రాంగం
పారిస్/లండన్/బాసెల్: పన్ను ఎగవేతలు, విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్న నల్లధనంపై పోరాటానికి పటిష్టమైన యంత్రాంగం ఇక అమల్లోకి రానుంది. అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) ఈ సరికొత్త ప్రమాణాలను గురువారం ఆవిష్కరించింది. ఈ నెల 22-23 తేదీల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనున్న సమావేశంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల ఆమోదముద్ర కోసం అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఓఈసీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ విధానాలను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలు పాటిస్తుండటం గమనార్హం. పన్నుల విషయంలో వివిధ దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఇచ్చిపుచ్చుకునే యంత్రాంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలను రూపొందించాల్సిందిగా ఓఈసీడీని జీ20 కూటమి గతేడాది ఆహ్వానించింది. అంతర్జాతీయంగా మరింత పారదర్శక పన్ను విధానాల కోసం దీన్ని ప్రతిపాదించారు. కాగా, ఆటోమేటిక్ సమాచార మార్పిడి అంశంపై భారత్ రెండేళ్ల క్రితమే సంతకాలు చేసింది. ఇందులో తాజాగా అమలు చేయనున్న కొత్త ప్రమాణాలను కూడా భారత్‌తో సహా 42 దేశాలు అనుసరించనున్నాయి. బ్యాంకులు ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని వార్షిక ప్రాతిపదికన ఆటోమేటిక్‌గా సభ్యదేశాలన్నీ ఇచ్చిపుచ్చుకునేలా ఈ కొత్త ప్రమాణాలతో వీలవుతుందని ఓఈసీడీ వెల్లడించింది. ఎలాంటి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి... విబిన్నమైన బ్యాంకు ఖాతాలు, పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి ఆర్థిక సంస్థలు నివేదించాల్సిన వివరాలతో పాటు అవి అనుసరించాల్సిన ఉమ్మడి పరిశీలన(డ్యూ డెలిజెన్స్) విధివిధానాలను ఈ కొత్త యంత్రాంగంలో పొందుపరిచినట్లు వివరించింది. ఇవి కొత్త ఒరవడి సృష్టించగలిగే(గేమ్ చేంజర్) విధానాలని ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అభివర్ణించారు. కాగా, ఈ కొత్త ప్రమాణాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, భారీ ఖర్చుతో కూడుకున్నవని స్విట్జర్లాండ్ బ్యాంకులు వ్యాఖ్యానించాయి. అయితే, పన్నుల ఎగవేతదార్లకు చెక్చెప్పేందుకు ఉద్దేశించిన ఈ యంత్రాంగాన్ని తాము ఆహ్వానిస్తున్నామని అక్కడి బ్యాంకింగ్ అసోసియేషన్(ఎస్బీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయులు నల్లధనాన్ని దాచుకోవడానికి స్విట్జర్లాండ్ సహా కొన్ని దేశాల బ్యాంకులు స్వర్గధామంగా మారాయంటూ దేశంలో రాజకీయంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్ల ధనం అంశాన్ని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా చేసుకోనున్నాయి కూడా. -
టెలికంకు ‘టాటా’..!
ముంబై: విదేశాల్లో భారీ టేకోవర్లతో దూసుకెళ్లిన టాటా గ్రూప్... స్వదేశంలో మాత్రం కీలకమైన టెలికం రంగం నుంచి వైదొలగనుందా? మార్కెట్ వర్గాలు, మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సైరస్ మిస్త్రీ... గ్రూప్‌లో భారీ వ్యూహాత్మక మార్పులకు తెరతీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేరుతో టాటా గ్రూప్ మెజారిటీ వాటాదారుగా టెలికం సేవలను అందిస్తోంది. అయితే, ఈ రెండు కంపెనీల్లో తమకున్న వాటాను బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని ఒక బిజినెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన సంప్రతింపులు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని కూడా వెల్లడించింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌దాకా అనేక ఉత్పత్తులు, సేవలకు సంబంధించి 100కు పైగా కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి. డీల్ సంక్టిష్టమే... టాటా గ్రూప్ టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్‌కు విక్రయించడం అంత సులువేమీ కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్ రెండింటిలోనూ బోర్డు నిర్ణయాలను శాసించేస్థాయిలో అనేక మంది వాటాదార్లు ఉన్నారు. దీంతో డీల్ పూర్తవ్వాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. టాటా టెలీలో జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమోకు 26% వాటా ఉంది. 2008లో సుమారు 2.1 బిలియన్ డాలర్లకు ఈ వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క, అంతర్జాతీయస్థాయిలో మొబైల్ డేటా సేవలందిస్తున్న టాటా కమ్యూనికేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 26% వాటా ఉండటం గమనార్హం. ప్రభుత్వం రంగంలోని వీఎస్‌ఎన్‌ఎల్‌ను డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా టాటా గ్రూప్ చేజిక్కించుకుని టాటా కమ్యూనికేషన్స్‌గా పేరు మార్చడం తెలిసిందే. కాగా, ముందుగాా ఈ 26 శాతం ప్రభుత్వ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసి... ఆతర్వాత మొత్తం కంపెనీ(మెజారిటీ వాటా)ని వొడాఫోన్‌కు విక్రయించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం, టాటా గ్రూప్ మధ్య సంప్రతింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... టాటా కమ్యూనికేషన్స్‌కు ఆఫ్రికాలో ఉన్న టెలికం సంస్థ నియోటెల్‌లో మెజారిటీ వాటాను వొడాఫోన్‌కు చెందిన వొడాకామ్‌కు విక్రయించే ప్రయత్నాల్లో ఉందని వార్తలొస్తున్నాయి. కాగా, ఇవన్నీ ఊహాగానాలంటూ టాటా సన్స్ ప్రతినిధి కొట్టిపారేశారు. వొడాఫోన్ ప్రతినిధి కూడా ‘నో కామెంట్’ అనడం గమనార్హం. షేరు ధరలు ఇలా... ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్‌లో భాగమైన టాటా టెలీ(మహారాష్ట్ర) లిమిటెడ్(టీటీఎంఎల్) స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది. ముంబై, గోవా సర్కిళ్లలో ఇది మొబైల్ సేవలందిస్తోంది. బుధవారం బీఎస్ఈలో ఈ షేరు ధర 2.49 శాతం లాభపడి రూ.7.40 వద్ద స్థిరపడింది. ఇక టాటా కమ్యూనికేషన్స్ షేరు కూడా 2.26% పెరిగి రూ.281 వద్ద స్థిరపడింది.