సాక్షి, న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో మూత పడబోతున్న టాటా టెలిసర్వీసుల వైర్‌లెస్ వ్యాపారాలను ఎవరు కొనబోతున్నారు? నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఎవరి చేతిలోకి వెళ్లబోతుంది? అంటే టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ వీటిని సొంతం చేసుకోబోతుందని తెలిసింది. ఈ విషయంపై ఇరు కంపెనీలు అధికారిక ప్రటకన వెలువరించాయి. టాటా టెలీసర్వీసెస్, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్‌లో విలీనమవుతుందని కంపెనీలు ప్రకటించాయి. భారతీ ఎంటర్‌ప్రైజ్ అధినేత సునిల్ మిట్టల్‌తో నాలుగు నెలల పాటు చర్చలు జరిపిన టాటా గ్రూప్, తమ వైర్‌లెస్ మొబైల్ వ్యాపారాలను ఎయిర్‌టెల్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది.
ఈ డీల్‌లో భాగంగా టాటాకు చెందిన రూ.10వేల కోట్ల స్పెక్ట్రమ్ బాధ్యతను కూడా భారతీ తీసుకోబోతుంది. టాటా టెలి దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో 800, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండుల్లో 180 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం భారతీ బోర్డు సమావేశమైందని, ఈ ప్రతిపాదనను అంగీకరించింది. భారతీ బోర్డు అంగీకారం అనంతరం ఈ విషయంపై ప్రకటన వెలువరించాయి.
Comments
Please login to add a commentAdd a comment