టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లోకి టాటా టెలిసర్వీసెస్ కస్టమర్లను మార్చే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. టాటా గ్రూప్ కన్జ్యూమర్ మొబైల్ బిజినెస్‌లను భారతీ ఎయిర్‌టెల్ టేక్‌వర్ చేసుకున్న నేపథ్యంలో ఇరు కంపెనీ ఈ ప్రక్రియను మొదలుపెట్టాయి. తొలుత యూపీ(వెస్ట్), బిహార్, పశ్చిమబెంగాల్ సర్కిల్‌లోని కస్టమర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఇరు కంపెనీ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వచ్చే వారాల్లో టాటా టెలి సర్వీసెస్‌కు చెందిన అన్ని సర్కిల్‌లోని మొబైల్ కస్టమర్లందర్నీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి మారుస్తామని పేర్కొన్నాయి.
ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) అరేంజ్‌మెంట్ కింద నేటి నుంచి టాటా టెలిసర్వీసెస్ కస్టమర్లను ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లోకి బదలాయిస్తున్నామని తెలిపాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా కస్టమర్లను ఎయిర్‌టెల్ సర్వీసులోకి మారుస్తున్నామని చెప్పాయి. ఇటీవలే టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ కన్జ్యూమర్ మొబైల్ బిజినెస్‌లను టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్‌లను ఎయిర్‌టెల్ తనలో విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. రెగ్యులేటరీ ఆమోదం ద్వారా ఈ టేకోవర్ ప్రక్రియ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment