న్యూఢిల్లీ : టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన 21 ఏళ్ల ఫోన్ సర్వీసు వెంచర్ టాటా టెలిసర్వీసస్‌కు ఇక స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. వైర్‌లెస్ వ్యాపారాలను మూసివేయనున్నట్టు టాటా గ్రూప్ శుక్రవారం ప్రభుత్వానికి తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులను కలిసిన టాటా గ్రూప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్, టాటా టెలిసర్వీసస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనాథ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయంపై చర్చలు జరిపినట్టు తెలిసింది. ప్రస్తుతం తాము కలిగి ఉన్న స్పెక్ట్రమ్ హోల్డింగ్స్‌ను విక్రయించాలని భావిస్తున్నట్టు చెప్పారు. టాటా టెలిసర్వీసస్ టాటా గ్రూప్ టెలికాం యూనిట్.
వైర్‌లెస్ వ్యాపారాలను మూసివేయాలని వారు భావిస్తున్నారని, ఈ ప్రక్రియను నెలలోగా ప్రారంభించనున్నట్టు ఈ విషయం తెలిసిన సంబంధిత వర్గాలు చెప్పాయి. ఒక్కసారి ఈ ప్రక్రియను వారు ప్రారంభిస్తే 60 రోజుల్లో మొత్తం పూర్తిచేస్తారని పేర్కొన్నాయి. గంటన్నరకు పైగా డీఓటీ అధికారులతో టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశమయ్యారు. ఇతర డిపార్ట్‌మెంట్లకు కూడా ఇదే విషయంపై సమాచారం అందించనున్నట్టు పేర్కొన్నారు. టాటా టెలిసర్వీసస్‌కు మొత్తం భారత్‌లో 19 సర్కిళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 149 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి అతిపెద్ద ఒక టాటా గ్రూప్ మూతపడటం ఇదే మొదటిసారి. 1996లో ల్యాండ్‌లైన్ కార్యకలాపాలతో టాటా టెలిసర్వీసస్‌ను టాటా గ్రూప్ ఏర్పాటుచేసింది. దీని సీడీఎంఏ ఆపరేషన్లను 2002లో, జీఎస్‌ఎం సర్వీసులను 2008లో ప్రారంభించారు. ఎన్‌టీటీ డొకోమో నుంచి రూ.14వేల పెట్టుబడులను ఇది పొందింది.
Comments
Please login to add a commentAdd a comment