అదృష్టం ఊరికే అందరినీ వరించదు. సరైన కాలంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో బుల్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారిన పంట పడుతుంది. గత కొంత కాలంగా ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభాలు మూటగట్టుకుంటున్నారు మదుపరులు. అయితే ఈ ఏడాది జనవరి 1న టాటా గ్రూప్ కంపెనీ టీటీఎమ్ఎల్ అంటే టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ షేర్లు కొనుగోలు చేసినవారు ధనవంతులుగా మారిపోయారు. కేవలం ఏడాది కాలంలో ఈ షేర్ ధర సుమారు 1000 శాతం పెరిగింది.
అంతే కాదు ఇప్పుడు కూడా తన పరుగులు కొనసాగిస్తోంది. ఈ మల్టీబ్యాగర్ వరుసగా మూడో రోజు పెరిగింది. ఈ బూమ్ మధ్యలో 5 శాతం ఎగువ సర్క్యూట్ స్టాక్‌లో నిమగ్నమై ఉంది. ఈ స్టాక్ ఏడాదిలో 1000 శాతానికి పైగా రాబడులను ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. అయితే ప్రాఫిట్-బుకింగ్ ప్రస్తుత స్థాయి నుండి చూడవచ్చు. ఈ ఏడాది జనవరి 1న రూ.10,000 విలువ గల టిటీఎమ్ఎల్ స్టాక్స్ కొని ఉంటే.. ఇప్పుడు అదే స్టాక్ విలువ రూ.1,00,000 విలువగా మరి ఉండేది. జనవరి 1న రూ.7.85లుగా ఉన్న టిటీఎమ్ఎల్ స్టాక్స్ ధర నేడు రూ.80.05గా ఉంది.
గత నెలలో కంపెనీ స్మార్ట్ ఇంటర్నెట్ ఆధారిత సేవలను ప్రారంభించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. అలాగే, సంస్థ ఆదాయం నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో లోటు తగ్గుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో కంపెనీ నష్టం రూ.1410 కోట్ల నుంచి రూ.632 కోట్లకు తగ్గింది. ప్రమోటర్లు అత్యధిక వాటాను కలిగి ఉండటం కంపెనీకి మంచి విషయమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
(చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్‌టాప్స్ ఏవంటే..!)
Comments
Please login to add a commentAdd a comment