ముంబై : టాటా గ్రూప్ తన 21 ఏళ్ల ఫోన్ సర్వీసు వెంచర్ టాటా టెలిసర్వీసస్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పబోతుంది. ఈ వైర్‌లెస్ సర్వీసులను మూసివేస్తున్న క్రమంలో టాటా సర్వీసెస్‌కు చెందిన ఉద్యోగులను టాటా గ్రూప్ ఇంటికి పంపేస్తోంది. ఈ మూసివేత ప్రక్రియలో భాగంగా దాదాపు 5వేల మంది ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల నోటీసు కూడా ఇస్తోంది. ఎవరైతే ముందస్తుగా కంపెనీని వీడి వెళ్లాలనుకుంటారో వారికి సెవరెన్స్ ప్యాకేజస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. పెద్ద వారికి వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్)ను, కొంతమంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీలకు టాటా గ్రూప్ బదిలీ చేస్తోంది.
నష్టాల్లో కూరుకుపోయిన తమ టెలికాం కంపెనీని త్వరలోనే మూసివేయబోతున్నాని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్ చెప్పారు. టాటా గ్రూప్ ఎల్లవేళలా తమ ఉద్యోగులను కాపాడుతుందని, కానీ ఈసారి కొద్ది మందిని మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీల్లోకి పంపుతున్నామని ఓ సీనియర్ అధికారి చెప్పారు. టాటా టెలిసర్వీసు కంపెనీ ఉద్యోగులతో ఇతర టాటా కంపెనీలపై భారం మోపడం అన్యాయమంటూ ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలకు తగ్గ వారిని మాత్రమే బదిలీ చేస్తున్నామని తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు వచ్చే నెలల్లో వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నామని టాటా గ్రూప్ సీనియర్ అధికారి చెప్పారు. మెజార్టీ ఉద్యోగులకు టాటా గ్రూప్‌కు చెందిన ఈ టెలికాం యూనిట్ మూడు నుంచి ఆరు నెలల నోటీసును ఇది ఆఫర్ చేసింది. ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వారు సెవరెన్స్ ప్యాకేజీని అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ వార్షిక రిపోర్టు ప్రకారం 2017 మార్చి వరకు టాటా టెలిసర్వీసులో 5,101 మంది ఉద్యోగులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment