టెలిఫోన్ యూజర్లు @ 94.64 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూలై చివరినాటికి 94.64 కోట్లకు పెరిగిందని ట్రాయ్ బుధవారం తెలిపింది. జూలైలో 34.5 లక్షల మంది కొత్తగా టెలిఫోన్ వినియోగదారులయ్యారని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పేర్కొంది.
ఇతర వివరాలు....
ఈ ఏడాది జూన్ చివరి నాటికి 94.29 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూలై నాటికి 0.37 శాతం వృద్ధితో 94.64 కోట్లకు చేరింది.
పట్టణ వినియోగదారుల సంఖ్య 55.97 కోట్ల నుంచి 56.24 కోట్లకు, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 38.31 కోట్ల నుంచి 38.39కోట్లకు చేరింది.
టెలిఫోన్ సాంద్రత 75.80 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది.
మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 91.49 కోట్ల నుంచి 0.42 శాతం వృద్ధితో 91.87 కోట్లకు చేరింది. మొత్తం వెర్లైస్ టెలి డెన్సిటీ 73.78 శాతానికి పెరిగింది.
మొత్తం వెర్లైస్ వినియోగదారుల మార్కెట్లో ప్రైవేట్ రంగం వాటా 90 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ల వాటా 10 శాతంగా ఉంది.
జూలైలో మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కోసం 28.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 6.88 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో 7.08 కోట్లకు పెరిగింది.