న్యూఢిల్లీ : మార్కెట్‌లోకి నూతనంగా ప్రవేశించిన రిలయన్స్ జియోతో పాటు మరో నాలుగు టెలికాం కంపెనీలు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టాయి. ఈ టెలికాం కంపెనీలు రూ.14,800 కోట్లకు పైగా రెవెన్యూలను తక్కువ చేసి చూపించాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,578 కోట్లు గండికొట్టిందని ఆడిట్ సంస్థ కాగ్ మంగళవారం వెల్లడించింది. నేడు పార్లమెంట్‌కు సమర్పించిన రిపోర్టులో కాగ్ ఈ విషయాలను తెలిపింది. రూ.1,015.17 కోట్ల లైసెన్సు ఫీజులను ప్రభుత్వానికి తక్కువ చెల్లించాయని కాగ్ తెలిపింది.
రూ.511.53 కోట్లు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ రూపంలో, రూ.1,052.13 కోట్లు చెల్లింపులు ఆలస్యంగా చేసినందుకు గాను వర్తించే వడ్డీలు ప్రభుత్వానికి గండికొట్టాయని పేర్కొంది. టాటా టెలిసర్వీసుల నుంచి రూ.1,893.6 కోట్లు, టెలినార్ నుంచి రూ.603.75 కోట్లు, వీడియోకాన్ నుంచి రూ.48.08 కోట్లు, క్వాడ్రాంట్ నుంచి రూ.26.62 కోట్లు, జియో నుంచి రూ.6.78 కోట్లు... లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, వడ్డీ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు తక్కువగా వచ్చాయని కాగ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment