క్వార్టర్ ఫైనల్లో శ్రీనివాస్ | k srinivas entered quarter final in state raniking carrom tounrnament | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో శ్రీనివాస్

Published Tue, Jul 19 2016 3:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

k srinivas entered quarter final in state raniking carrom tounrnament

సాక్షి, హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్‌లో జాతీయ చాంపియన్ కె. శ్రీనివాస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ కార్యాలయంలో సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో శ్రీనివాస్ 25-0, 25-2తో ఎస్.సాయిపై అలవోక విజయం సాధించాడు.

 

మిగతా మ్యాచ్‌ల్లో అనిల్ కుమార్ 25-0, 25-5తో శశి కుమార్‌పై, ఉస్మాన్ 25-15, 10-13, 25-18తో అంజి రెడ్డిపై, రవీందర్ గౌడ్ 25-0, 25-8తో అంజద్‌పై, అహ్మద్ 20-5, 19-5తో అశ్విన్ కుమార్‌పై, వసీమ్ 25-15, 25-20తో కృష్ణపై, షారుక్ ఖాన్ 19-20, 21-20, 24-23తో జహీర్ అహ్మద్‌పై, సూర్యప్రకాశ్ 25-0, 25-0తో సయీద్‌పై, హకీమ్ 25-12, 25-6తో షాబాజ్‌పై, నయ్యర్ 25-0, 25-0తో గంగదాస్‌పై, ప్రసాద్ 15-25, 25-15, 18-15తో మొయిజ్‌పై విజయం సాధించారు. మహిళల తొలిరౌండ్లో నందిని 25-0, 25-10తో సునీతపై, స్రవంతి 18-10, 12-23, 25-6తో శ్రీవిద్యపై, సాయిలక్ష్మి 19-18, 25-0తో సునీతపై, అపూర్వ 25-0, 25-0తో ప్రేరణపై, ప్రసన్న లక్ష్మి 25-12, 25-10తో శ్రీచందనపై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement