
సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో సి. కార్తీక వర్ష (నాసర్ స్కూల్), కె. నందిని (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో జూనియర్ బాలికల విభాగంలో టైటిల్‌పోరుకు అర్హత సాధించిన వీరిద్దరూ మహిళల కేటగిరీలో సెమీఫైనల్లో అడుగుపెట్టారు. సోమవారం జూనియర్ బాలికల సెమీస్ మ్యాచ్‌ల్లో కార్తీక వర్ష 25–8, 25–0తో సి. దీప్తిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో నందిని 25–6, 25–4తో కె. నవిత (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై గెలుపొంది కార్తీక వర్షతో ఫైనల్‌పోరుకు సిద్ధమైంది.
మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నందిని 22–14, 21–9తో లక్ష్మి (ఐబీఎమ్)పై, కార్తీక వర్ష 25–0, 25–3తో రమశ్రీ (పోస్టల్)పై, జయశ్రీ 25–0, 25–6 తో పద్మజపై, అపూర్వ (ఎల్‌ఐసీ) 25–0, 25–1తో మాధవిపై గెలుపొందారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జయశ్రీతో వర్ష, అపూర్వతో నందిని తలపడతారు. పురుషుల విభాగంలో శ్రీనివాస్ (ఐఓసీఎల్), నరేశ్ (ఏసీసీఏ), హకీమ్ (బీఎస్‌ఎన్‌ఎల్), ఆదిత్య సెమీస్‌లో అడుగుపెట్టారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రీనివాస్ 25–9, 13–3తో మొహమ్మద్ అహ్మద్‌పై, నరేశ్ 17–11, 25–2, 16–13తో అనిల్ కుమార్‌పై, హకీమ్ 22–9, 25–0తో వసీమ్‌పై, ఆదిత్య 25–0, 17–20, 25–19తో నవీన్‌పై గెలిచి ముందంజ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment