ఏజీ ఆఫీస్ జట్టుకు టైటిల్ | ag office team achieves carrom championship | Sakshi
Sakshi News home page

ఏజీ ఆఫీస్ జట్టుకు టైటిల్

Published Mon, Aug 8 2016 11:56 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ag office team achieves carrom championship

సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఇన్‌స్టిట్యూట్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో ఏజీ ఆఫీస్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఏజీ ఆఫీస్ 3-0తో ఆర్‌బీఐ జట్టును ఓడించింది. ఏజీ ఆఫీస్ తరఫున తొలి సింగిల్స్ గేమ్‌లో అనిల్ కుమార్ 25-0, 25-9తో గణేషన్‌పై, రెండో సింగిల్స్‌లో దినేశ్ బాబు 12-22, 22-19, 25-9తో సూర్యప్రకాశ్‌పై గెలువగా... డబుల్స్ గేమ్‌లో అంబురాజ్- సామ్టే జోడి 16-18, 24-3, 25-13తో రఘునాథ్- వీఎస్‌కే నాయుడు జంటపై గెలిచింది. ఈ టోర్నీలో బీఎస్‌ఎన్‌ఎల్ జట్టు 2-1తో పోస్టల్ జట్టుపై గెలిచి మూడోస్థానంలో నిలిచింది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement