బుల్లితెర నటి, యాంకర్ సమీరా పండంటి మగబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని ఆమెఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ 4న తమ కుటుంబంలోకి ఓ మగబిడ్డ వచ్చాడని సమీరా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పంచుకుంది. తనకు తోడుగా నిలిచిన అభిమానులకు, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీ చేసిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా బుల్లితెర నటుడు ప్రభాకర్ తో ఎన్నో సీరియల్స్ లో నటించింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో ఆమె నటించింది. ఆ తర్వాత నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది.ఈ తర్వాత ఈ యంకరమ్మ బుల్లితెరకు దూరమైంది.
Comments
Please login to add a commentAdd a comment