తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి | Janaki Kalaganaledhu Serial Fame Priyanka Jain Remarried To Her Parents | Sakshi
Sakshi News home page

Priyanka Jain: అందుకే మళ్లీ పెళ్లి చేశాం : నటి ప్రియాంక

Published Fri, Aug 27 2021 11:22 AM | Last Updated on Fri, Aug 27 2021 12:01 PM

Janaki Kalaganaledhu Serial Fame Priyanka Jain Remarried To Her Parents - Sakshi

'మౌనరాగం' సీరియల్‌తో అమ్ములుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ప్రియాంక జైన్‌. ఈ సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందిన  ఈ భామ ప్రస్తుతం  'జానకి కలగనలేదు' సీరియల్‌లో మెయిన్‌ లీడ్‌ పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్‌ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంకకు బాగానే ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్‌చేస్తూ ఎప్పకటిప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లిదండ్రుల 24వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చింది.

'ఈరోజు మా అమ్మానాన్నల పెళ్లిరోజు. అప్పట్లో వారు ఇంట్లో తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఈ రోజు మళ్లీ పెళ్లి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల క్షేమాన్ని, సంతోషాన్నే కోరుకుంటారు. కానీ పిల్లలుగా  ఈసారి మేం వాళ్లకు మర్చిపోలేని సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. 24వ వివాహ వార్షికోత్సవాన్ని మరింత స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేయాలనుకున్నాం. అందుకే వాళ్లకు మళ్లీ పెళ్లి చేశాం' అని పేర్కొంది. ఇక ఈ వీడియోలో హల్దీ, మెహందీ సహా అన్ని కార్యక్రమాలను ప్రియాంక దగ్గరుండి సెలబ్రేట్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


చదవండి : హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు
అప్పుడే విలన్‌ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement