కళ్యాణి, యమునా పాథక్‌ను అడ్డుకుంటున్న పోలీసులు
సోమాజిగూడ: ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై ముఖ్యమంత్రి స్పందించేవరకు తన పోరాటం ఆగదని సామాజిక కార్యకర్త నడింపల్లి యమునా పాథక్ అన్నారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ గురువారం ఆమె ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్త్రీలపై నిత్యం అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం కనీసం స్పందిండం లేదన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేవరకు తాను నిరాహార దీక్ష చేపడతానన్నారు. పోలీసులు నన్ను అరెస్టు చేసినా వరంగల్ వెళ్లి అక్కడే నిరాహారదీక్ష చేట్టనున్నట్లు ఆమె ప్రకటించారు.
నిందితులను శిక్షించడంలోప్రభుత్వాలు విఫలం
హిమాయత్‌నగర్: అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని శ్వాస ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కళ్యాణి గొర్రె పేర్కొన్నారు. రంగల్‌లో 9 నెలల పసికందుపై ఓ కామాంధుడు అత్యాచారం చేయడం దారుణమన్నారు. రోజు రోజుకూ పసికందులు, బాలికలు, అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటేనే అత్యాచారాలు తగ్గుముఖం పడతాయన్నారు. సోషల్‌మీడియా సైట్లలో సానుభూతి తెలిపితే ప్రయోజంన లేదని, నిందితులకు శిక్షపడేవరకు ఒత్తిడి తీసుకురావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment