గౌహతి: అస్సాంలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారులన్ని జలమయమైపోయాయి. ఈ మేరకు మొత్తం 36 జిల్లాలకు గానూ సుమారు 32 జిల్లాలు ఈ వరదలకు ప్రభావితమయ్యాయి. పైగా వరదలు, కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 30 మంది మరణించారు.
కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ద్వారా అస్సాం పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. బరాక్ వ్యాలీ ప్రాంతో రైలు, రోడ్డు మార్గం వరదల కారణంగా మరింత అధ్వాన్నంగా మారాయి. ఈ మేరకు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న విషాదకర ఘటనలను వీడియోతీస్తుంటే...ఒక ఆశ్చర్యకరమైన ఘటన వీడియోలో బంధింపబడింది.
నడుములోతు నీటిలో ఒకవ్యక్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకుని వస్తున్నాడు. ఆ ఘటన చూస్తుంటే చిన్న కృష్ణుడిని ఎత్తుకుని యుమునా నదిని దాటిని వాసుదేవుడిలా అనిపించింది. పైగా ఆవ్యక్తి తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఆనందంగా నడుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Heartwarming picture from Silchar Floods!
— Sashanka Chakraborty 🇮🇳 (@SashankGuw) June 21, 2022
This video of a father crossing the waters with his newborn baby in Silchar reminds of Vasudeva crossing river Yamuna taking newborn Bhagwan Krishna over his head!
Everyday is Father’s Day!@narendramodi @himantabiswa @drrajdeeproy pic.twitter.com/1PEfaiCxA5
(చదవండి: ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!: సంక్షోభ సంకేతాలపై శివసేన స్పందన)
Comments
Please login to add a commentAdd a comment