Vasudeva
-
వసుదేవుని యజ్ఞోత్సవం
-
వరదలతో అతలాకుతలమైన అస్సాంలో ...ఓ విచిత్రమైన ఘటన: వీడియో వైరల్
గౌహతి: అస్సాంలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారులన్ని జలమయమైపోయాయి. ఈ మేరకు మొత్తం 36 జిల్లాలకు గానూ సుమారు 32 జిల్లాలు ఈ వరదలకు ప్రభావితమయ్యాయి. పైగా వరదలు, కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 30 మంది మరణించారు. కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ద్వారా అస్సాం పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. బరాక్ వ్యాలీ ప్రాంతో రైలు, రోడ్డు మార్గం వరదల కారణంగా మరింత అధ్వాన్నంగా మారాయి. ఈ మేరకు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న విషాదకర ఘటనలను వీడియోతీస్తుంటే...ఒక ఆశ్చర్యకరమైన ఘటన వీడియోలో బంధింపబడింది. నడుములోతు నీటిలో ఒకవ్యక్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకుని వస్తున్నాడు. ఆ ఘటన చూస్తుంటే చిన్న కృష్ణుడిని ఎత్తుకుని యుమునా నదిని దాటిని వాసుదేవుడిలా అనిపించింది. పైగా ఆవ్యక్తి తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఆనందంగా నడుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Heartwarming picture from Silchar Floods! This video of a father crossing the waters with his newborn baby in Silchar reminds of Vasudeva crossing river Yamuna taking newborn Bhagwan Krishna over his head! Everyday is Father’s Day!@narendramodi @himantabiswa @drrajdeeproy pic.twitter.com/1PEfaiCxA5 — Sashanka Chakraborty 🇮🇳 (@SashankGuw) June 21, 2022 (చదవండి: ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!: సంక్షోభ సంకేతాలపై శివసేన స్పందన) -
వాసుదేవుడు
వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు. ‘వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం, దేవకీ పరమా నందం, కృష్ణం వందే జగద్గురుం’ అని కృష్ణాష్టకం. ఈ అర్థం ప్రకారం ద్వాపర యుగంలో దేవకీ పుత్రు డుగా అవతరించి యశోదానంద వర్ధనుడుగా వర్ధిల్లిన శ్రీకృష్ణుడే వాసుదేవుడు. సర్వమూ వాసుదేవుడే అని అనుభూతి పూర్వ కంగా, అపరోక్షంగా స్వానుభూతిపూర్వకంగా గ్రహిం చగలిగిన మహాత్ములే జ్ఞానులు, ఇలాంటివారు చాలా అరుదు అంటుంది భగవద్గీత. సర్వమూ వాసు దేవుడే అన్నప్పుడు ఆ వాసుదేవుడు అన్న మాటకు వసుదేవుడి కుమారుడు అని పరిమితమైన అర్థం చెప్పటంలో పూర్తి సామంజస్యం కనిపించదంటారు కొందరు. త్రికాలాతీతుడూ, గుణాతీతుడూ, సర్వ వ్యాపీ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమా త్మను ఒక్క అవతారానికే వర్తింపజేసి వసుదేవ సుతు డుగా మాత్రం పిలవటం ఎలా పొసగుతుంది అని వారి సందేహం. విష్ణు సహస్రనామంలో ‘వాసుదేవ’ అనే నామం మూడుసార్లు వస్తుంది. ఒకే నామాన్ని ఒకే అర్థంలో రెండు మూడుసార్లు వాడటం సంప్రదాయం కాదు. కనుక విష్ణు సహస్ర నామభాష్యం చెప్పిన ఆది శంకరా చార్యులు వాసుదేవ నామానికి మూడు రకాల వివరణలు చెప్పారు. సర్వ జగత్తును ‘వసనం’ లేక ‘వాసనం’, లేక, ఆచ్ఛాదనం చేసి ఆక్రమించి ఉండేవాడు ‘వాసుడు’ . ‘దివ్’ అనే ధాతువుకు క్రీడించటం, విజయేచ్ఛ కలిగి ఉండటం, నియంత్రిం చటం, ప్రకాశించటం అని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసే వాడిని ‘దేవుడు’ అంటారు. ‘వాసుడు’ అయిన ‘దేవుడు’ వాసుదేవుడు. అంటే, చరాచర విశ్వాన్ని సూర్యకిరణాల ద్వారా సూర్యుడు కప్పినట్టు సర్వత్రా ఆక్రమించి, వ్యాపించి ఉండేవాడు అని. రెండవ చోట, వాసుదేవ నామానికి వసుదేవుడి పుత్రుడు అనే అర్థం చెప్పారు. మూడవ చోట, మాయ చేత జగత్తును ఆచ్ఛాదన చేసి ఆవరించి ఉండేవాడు అని అర్థం చెప్పుకోవచ్చన్నారు. భాగవతంలో పౌండ్రక వాసుదేవుడనే విచిత్ర మైన పాత్ర కనిపిస్తుంది. ఈయన కరూశ దేశానికి రాజు. గొప్ప అజ్ఞాని. రంగస్థలం మీద నటుడిలా శ్రీకృష్ణుడి వేషభాషలనూ, చిహ్నాలనూ అనుకరించే వాడు. పీతాంబరం కట్టి , గరుడ ధ్వజం ఎత్తించుకొని, శంఖ-చక్ర- ఖడ్గ- గదా- శార్గ-శ్రీవత్స- కౌస్తుభ- వనమాలాది చిహ్నాలను అనుకరించేవాడు. మూర్ఖు లైన తన ఆశ్రీతులు చేసే ముఖ స్తుతులు నమ్మి, ఆయన శ్రీకృష్ణుడికి తన దూత ద్వారా ఒక హెచ్చరిక పంపుతాడు, ‘అసలైన వాసుదేవుడిని నేను. నువ్వు నా పేరూ చిహ్నాలూ ధరించి తిరుగుతున్నావు. వెంటనే నువ్వు వాటిని వదిలి నా శరణు వేడుకో. లేదంటే నాతో యుద్ధానికి సిద్ధపడు!’ అని. వసుదేవ పుత్రుడు ఆ పౌండ్రక వాసుదేవుడిని యుద్ధంలో వధిస్తాడు. వైర భావంతోైనైనా కృష్ణుడిని నిరంతరం స్మరిస్తూ అను కరిస్తూ జీవించిన కారణంగానూ, కృష్ణుడి చేతనే స్వయంగా హతుడైన కారణంగానూ పౌండ్రక వాసు దేవుడు, అన్ని బంధాలూ వదిలించుకొని ఆ వాసు దేవుడిలోనే లీనమయ్యాడు. - ఎం. మారుతి శాస్త్రి -
కొత్తగా రెక్కలొచ్చెనా...
ప్రేమ, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా..’. వాసుదేవ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. అర్జున్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని వీరశంకర్ ఆవిష్కరించి తొలి ప్రతిని దేవి ప్రసాద్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని లైన్ ప్రొడ్యూసర్ కాండ్రేగుల ఆదినారాయణ చెప్పారు. ఇంకా ఈ చిత్రం యూనిట్‌తోపాటు ధవళసత్యం, తమ్మారెడ్డి భరద్వాజ్, నట్టికుమార్, కాదంబరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండానే అధికారం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందోనని రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారన్నారు. ఎమర్జెన్సీ తరువాత కేంద్రంలో జనతా ప్రభుత్వం, 1983లో రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఎలాంటి ప్రభంజనం సృష్టించారో, 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం అలాగే వస్తుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త వాసుదేవ ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే వై.శ్రీనివాసరెడ్డి, పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, పొత్తుల రాజకీయాలతో కేంద్రంలో ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మరోసారి పార్లమెంట్లో ఈ పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీని, మోడీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రానున్న మూడు నెలల్లో కార్యకర్తలు బీజేపీ విధానాలను గ్రామగ్రామానికి, నగరంలో ఇంటింటికీ చేరవేయాలని కోరారు. రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.