ఆగని అస్సాం వరద మరో 17 మంది మృతి | Rail, road links in Northeast India badly hit by floods and landslides | Sakshi
Sakshi News home page

ఆగని అస్సాం వరద మరో 17 మంది మృతి

Published Mon, Jun 20 2022 6:33 AM | Last Updated on Mon, Jun 20 2022 6:33 AM

Rail, road links in Northeast India badly hit by floods and landslides - Sakshi

గువాహటి: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో చాలా చోట్ల రవాణా స్తంభించింది. ఆదివారం మరో ఎనిమిది మంది మరణించారు. దీంతో కొండచరియలు పడిన ఘటనల్లో సంభవించిన తొమ్మిది మరణాలతో కలుపుకుంటే గత 36 రోజుల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

32 జిల్లాల్లో 37 లక్షల మంది ప్రజానీకంపై వరద ప్రభావం కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లోని దాదాపు లక్షన్నర మందికిపైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ఆదివారం కామ్‌రూప్‌ జిల్లాలో పర్యటించి తగిన సాయం చేస్తామని స్థానికులకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధైర్యం చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement