
‘‘ప్రతీ ఒక్కటీ రాసిపెట్టిందే’’ అంటున్నారు నటి యమున. ఇంకా ‘సాక్షి’ టీవీతో ఆమె చెప్పిన విశేషాలు ఈ విధంగా.. తొలిసారి బాలచందర్‌గారి సినిమాలో చేశాను. ఆ సినిమా తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలు ఇస్తామన్నారు. హీరోయిన్‌గానే చేస్తానన్నాను. నా నటన చూసి ‘మౌన పోరాటం’లో ఆఫర్ ఇచ్చారు. ఇబ్బంది అనిపించినా ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా చేశాను.
⇒ కోపమొచ్చినా, సంతోషమొచ్చినా చూపిం చేస్తాను. ఏదీ మనసులో పెట్టుకోను. ఆ తత్వమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఇచ్చింది.
⇒ చిరంజీవితో ‘కొదమ సింహం’, మోహన్‌బాబుతో ‘అల్లుడుగారు’, బాలకృష్ణతో ఓ సినిమా, రాజశేఖర్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌లతో.. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యా. స్టార్ హీరోయిన్ కాలేదనే బాధ ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉన్నందుకు హ్యాపీ.
⇒ ఎవరెవరినో నా భర్త అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. నేను ఒక్కర్నే పెళ్లి చేసుకున్నా (నవ్వుతూ). కావాలంటే నన్ను అడగండి.. ఫ్యామిలీ ఫొటోస్ పంపిస్తా. నా భర్త పేరు జయంత్‌కుమార్. ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
Comments
Please login to add a commentAdd a comment