exclusive interview to sakshi
-
ఆర్జీవీ డెన్ వారి కోసమే!
‘‘చిత్ర పరిశ్రమకి రావాలని ఎంతోమందికి ఉంటుంది. వారిలో చాలామంది ప్రతిభావంతులుంటారు. కానీ, వారికి ఇండస్ట్రీకి ఎలా రావాలి? ఎవర్ని సంప్రదించాలి? ఎవరు అవకాశం ఇస్తారు? అనేది తెలియదు. ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకే ‘ఆర్జీవీ డెన్’ని ఏర్పాటు చేశాను. ఈ డెన్ ప్రతిభావంతులను తీర్చిదిద్దే క్రియేటివ్ హబ్ అవుతుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్తవారికి అవకాశాలు ఇచ్చేందుకు ‘ఆర్జీవీ డెన్’ అనే కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు. ► గతంలో ముంబైలో ‘ఆర్జీవీ కంపెనీ’ని ప్రారంభించారు. ఇప్పుడేమో హైదరాబాద్‌లో ‘ఆర్జీవీ డెన్’ ఏర్పాటు చేశారు. ఈ డెన్ గురించి... వర్మ: కొత్తవారికి ఓ ప్లాట్‌ఫామ్ ఇవ్వాలనే ‘ఆర్జీవీ డెన్’ ఆరంభించాను. నేనేంటో, నా మనస్తత్వం ఏంటో చూపించడానికి కూడా ‘ఆర్జీవీ డెన్’ ఉపయోగపడుతుంది. ఈ కార్యాలయానికి వచ్చి, చూశాక నాతో పని చేయాలనుకునేవారు వస్తారు.. వద్దనుకునే వాళ్లు పారిపోతారు (నవ్వుతూ). ఇప్పటి వరకూ నేను చేయని జోనర్స్లో దాదాపు పది సినిమాలు కొత్తవారి ద్వారా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను. ► ఇలా కెరీర్ గురించి పక్కా ప్రణాళికలు వేసుకుంటున్న మీరు వ్యక్తిగతంగా బంధాలకు దూరంగా ఉన్నారెందుకు? కుటుంబం, దేవుడు, సమాజం.. ఈ మూడింటికీ నేను విలువ ఇవ్వను. కానీ, మనుషులకు విలువ ఇస్తాను. మా అమ్మ, నా కూతురు అంటే నాకు ద్వేషం లేదు. ఓ మనిషిగా వాళ్లను గౌరవిస్తాను. కానీ, ఆ బంధాల్లోనే ఉండిపోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్రేమిస్తాను. కానీ, ఎదుటి వాళ్లు నన్ను ప్రేమిస్తే నాకు బరువుగా ఉంటుంది. ► రాజకీయాలంటే ఇష్టం లేదని పలు సందర్భాల్లో మీరు అన్నారు. కానీ, ఆ నేపథ్యంలో సినిమాలు తీస్తుంటారు? నా కెరీర్లో రాజకీయ నేపథ్యంలో మూడు సినిమాలే తీశాను. గతంలో ‘సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలు తీశా. ఇప్పుడు ‘వ్యూహం’ చిత్రం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఎలక్షన్ సీజన్లోనే సేల్ అవుతాయి. ‘వ్యూహం’ తర్వాత మరో ఐదేళ్ల పాటు రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయను. ► ‘వ్యూహం’ కథేంటి? ఎంతవరకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి వ్యక్తిత్వం అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మాట ఇస్తే దానికోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటారాయన. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జగన్‌గారిని తొక్కేయాలని కొందరు కుట్రలు పన్నారు. జగన్‌గారి జీవితంలో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ‘వ్యూహం’ తొలి భాగంలో చూపిస్తాను. ఈ చిత్రానికి తొలుత ‘కుట్ర’ అని టైటిల్ అనుకున్నా.. అయితే చీప్‌గా ఉంటుందని ‘వ్యూహం’గా మార్చాను. షూటింగ్ 30 శాతం పూర్తయింది.సెప్టెంబరులో రిలీజ్ అవుతుంది. ► ‘వ్యూహం’ రెండో భాగం కూడా ఉందన్నారు? 2015 నుంచి 2023 అక్టోబర్ వరకు జగన్‌గారి జీవితంలోని అంశాల నేపథ్యంలో ‘వ్యూహం 2’ ఉంటుంది. జగన్‌గారు ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటారు? ఆయన వ్యక్తిత్వం ఏంటి? వంటి అంశాలు చూపించబోతున్నాను. 2024 ఫిబ్రవరిలో ‘వ్యూహం 2’ చిత్రాన్ని విడుదల చేస్తాం. ► వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీపై వచ్చే ట్రోల్స్ గురించి ఏమంటారు? నన్ను ట్రోల్స్ చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ఏదైనా ఓ ట్వీట్ చేసినా, మాట్లాడినా కొందరు విపరీతమైన ట్రోల్స్ చేస్తుంటారు. దాని ద్వారా గంటల కొద్దీ వారి విలువైన సమయం వృథా అవుతుంది.. అందులోనే నాకు ఆనందం ఉంది. ► మీరు సివిల్ ఇంజినీర్ కదా? డైరెక్టర్ అయ్యాక ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాననిపించిందా? అలా ఎప్పుడూ అనిపించలేదు. ఇండస్ట్రీలో నేను సంతృప్తిగానే ఉన్నాను. ► మీ జీవితంలో ఏ విషయంలో అయినా పశ్చాత్తాపం? లేదు. నేను ఏది చేసినా ఆ తర్వాత ఇలా చేశానేంటి? అని పశ్చాత్తాపపడలేదు. ► దేవుడంటే నమ్మకం లేదంటారు? అనుకోకుండా దేవుడు ప్రత్యక్షమై వరమిస్తే ఏం కోరుకుంటారు? దేవుడు ప్రత్యక్షమైతే ముందుగా భయపడతాను.. (నవ్వుతూ). ఎందుకంటే సడన్‌గా వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి, ‘నేను వెంకటేశ్వర స్వామిని.. నీకు ఏ వరం కావాలో కోరుకో’ అంటే నమ్ముతామా? నేను, మీరు, ఎవరైనా అంతే.. భయపడతాం. ► రాజకీయాలపై మీకు ఆసక్తి లేకపోయినా ‘ఒకే ఒక్కడు’ సినిమాలోలా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఏం చేస్తారు? మొదటిది.. ఇప్పుడున్న విద్యా వ్యవస్థను మార్చుతాను. రెండోది.. నా ఆలోచనలన్నింటినీ సమాజంపై రుద్దుతాను. మూడోది.. ప్రస్తుతం ఉన్న సొసైటీని డిస్ట్రబ్ చేస్తాను (నవ్వుతూ). -
ఆ వీడియోపై రష్మీ షాకింగ్ కామెంట్స్, అది ప్రాంక్ కాదు.. నిజమే!
యాంకర్ రష్మీ ఫోన్ ఎత్తదు, మూవీ ప్రమోషన్లకు రాదంటూ ఇటీవల నటుడు నందు ఆమెపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది చివరకు ప్రాంక్ వీడియో అని తేలింది. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోను తీసినట్లు చివరిలో నందు పేర్కొన్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్ రష్మి, నందులు సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌కు రష్మి రాదని, కాల్స్ కూడా ఎత్తదు అంటూ ప్రాంక్ వీడియో తీశారు కదా.. అది ముందుగానే ప్లాన్ చేసుకుని తీశారా? లేదా అప్పటికప్పుడు తీశారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు దీనికి రష్మి స్పందిస్తూ అది నిజమే కానీ దానికి ప్రాంక్ వీడియో అని పేరు పెట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ వీడియోలో రష్మీ ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. అది తాను నిజంగానే అన్నానని చెప్పింది. ‘ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండేళ్ల తర్వాత విడుదల చేస్తున్నారు. నేను టీవీకి పని చేస్తాను. అప్పటికే నేను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. రెండు రోజులు బిజీ షెడ్యూల్ ఉంది. నాకు ఒక 2 లేదా 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అయిన వారు వినకుండా ప్రమోషన్స్ ఉన్నాయి రా అంటూ పదే పదే కాల్, మెసేజ్‌లు చేస్తున్నారు. అందుకే చిరాకు వచ్చి కాల్స్‌కి సమాధానం ఇవ్వలేదు. దీంతో నేను చేస్తున్న షూటింగ్ స్పాట్‌కే వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా అనేశాను’ అని తెలిపింది. కాగా ప్రమోషన్స్ ఎందుకు రావని నందే ప్రశ్నించగా.. అక్కడ నాకు రకరకాల ప్రశ్నలు ఎదురువుతాయిని, వాటికి తాను సమాధానాలు చెప్పలేనని.. అందుకే నేను ప్రమోషన్స్ కు రానంటూ రష్మీ ప్రాంక్ వీడియోలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
సీరియల్స్‌లో బిజీ ఆర్టిస్టుగా శ్రావణి.. అలా అవకాశం
శ్రీకాకుళం (టెక్కలి): కార్తీకదీపం సీరియల్లో తులసిగా..గీతాగోవిందంలో జయమ్మగా..గుప్పెడంత మనసులో ధరణిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.. సుమారు 14 టీవీ సీరియల్స్, మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి వెబ్ సిరీస్‌లో నటిగా, అమమ్మగారిల్లు, పేపర్‌బాయ్ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వర్ధమాన టీవీ సీరియల్ నటి తాండ్ర శ్రావణి అలియాస్ సీతామహాలక్ష్మి ఇటీవల టెక్కలి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఈమె స్వస్థలం కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామం. టెక్కలిలోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మారుమూల ప్రాంతానికి చెందిన తనను టీవీ సీరియల్స్ అభిమానులు ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నారని చెప్పారు.2వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లామన్నారు. 2011లో హైదరాబాద్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారోంభోత్సవంలో భాగంగా తనకు నటిగా అవకాశం వచ్చిందన్నారు. మొదట తమిళంలో కడాసి బెంచ్ అనే సీరియల్లో నటించినట్లు తెలిపారు. తర్వాత మొగలిరేకులు, ఒకరికొకరు, అభిషేకం , కార్తీకదీపం, గోరింటాకు, గీతాగోవిందం, గుప్పెడంత మనసు, ఆడదే ఆధారం, పౌర్ణమి, అగ్నిపూలు తదితర సీరియల్స్‌లో అనేక పాత్రలు పోషించినట్లు వివరించారు. వీటితో పాటు మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు హైదరాబాద్‌లో అనాథ పిల్లలకు అండగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి
సాక్షి, పార్వతీపురం: పదవి వచ్చిందని ఏనాడూ విర్రవీగలేదు.. పదవి లేదనే నిరాశా లేదు.. నిరంతరం ప్రజాసేవే లక్ష్యం.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కర్తవ్యమని కురుపాం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. చిన్నమేరంగి గ్రామంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ‘సాక్షి’తో ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలోని సంక్షేమ పాలన, గిరిజన శాఖ మంత్రిగా ఆమె సాధించిన విజయాలు ఆమె మాటల్లోనే... సాక్షి: రాష్ట్రంలో మహిళా సంక్షేమం ఎలా ఉంది ? పుష్పశ్రీవాణి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సంక్షేమం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాలకు సీఎం జగన్మోహన్రెడ్డి సున్నావడ్డీ పథకం కింద మూడో విడత వడ్డీ నగదును జమచేయించారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, దిశ చట్టంతో మహిళా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత ఆయనదే. సాక్షి : గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మీరు సాధించిన ఫలితాలు ? పుష్పశ్రీవాణి : మన్యం జిల్లాకు గిరిజన ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయించాను. రూ.105 కోట్లు మంజూరయ్యాయి. పాడేరులో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాం. 1.60 లక్షల మంది గిరిజనులకు పోడు వ్యవసాయ సాగు పట్టాలు అందించాం. డీబీటీ, నాన్ డీబీటీ విధానం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపంలో రాష్ట్రంలోని గిరిజనులకు రూ.931 కోట్లు నిధులు వెచ్చించాం. సంక్షేమ పథకాలతో 49 లక్షలు మంది గిరిజనులు లబ్ధిపొందారు. సాక్షి : రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉంటాయి ? పుష్పశ్రీవాణి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయం. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలన్నీ శాతశాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కింది. ప్రజా సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పథకాలతో ప్రజలను ఆదుకున్నారు. టీడీపీ నేత చంద్రబా బు నాయుడిపై ప్రజలకు నమ్మకం లేదు. ఆయన మాయమాటలకు మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారన్నది అందరికీ తెలిసిన నిజం. అందు కే.. గతంలో వచ్చిన 23 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈ దఫా వచ్చే పరిస్థితి లేదు. సాక్షి : పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక? పుష్పశ్రీవాణి : క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిని తెలియజేస్తాం. సచివా లయాలు ఏర్పాటు, ఉద్యోగ కల్పన, వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు, కోవిడ్ నియంత్రణ సమయంలో ప్రజలకు అందించిన సేవలు, ఠంచన్‌గా అందిస్తున్న పింఛన్, ఇళ్ల స్థలాలు మంజూరు వంటివి ప్రజలకు వివరిస్తాం. అర్హులకు సంక్షేమ పథకాలను అందించిన ఘనతను గుర్తుచేస్తాం. గతంలో కంటే ఎక్కువ మందిని వైఎస్సార్సీపీ కుటుంబీకులుగా చేర్చుతాం. 2024 ఎన్నికల్లో ఎదురులేని విజయాన్ని అందుకుంటాం. సాక్షి : పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక కావడం ఎలా అనిపిస్తోంది? పుష్పశ్రీవాణి: అధికారంలో ఉన్న పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందడం అంటే ఆషామాషీ కాదు. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మొన్నటివరకూ రాష్ట్ర మంత్రిగా సేవలు అందించాను. ఇప్పుడు పా ర్టీ అధ్యక్షరాలిగా పార్టీకి సేవచేసే అదృష్టం రావడం సంతోషదాయకం. సీఎం నమ్మకంతో కట్టబెట్టిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. -
శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత
-
అందుకే నాకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్!
-
అందుకే నాకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్!
‘‘ప్రతీ ఒక్కటీ రాసిపెట్టిందే’’ అంటున్నారు నటి యమున. ఇంకా ‘సాక్షి’ టీవీతో ఆమె చెప్పిన విశేషాలు ఈ విధంగా.. తొలిసారి బాలచందర్‌గారి సినిమాలో చేశాను. ఆ సినిమా తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలు ఇస్తామన్నారు. హీరోయిన్‌గానే చేస్తానన్నాను. నా నటన చూసి ‘మౌన పోరాటం’లో ఆఫర్ ఇచ్చారు. ఇబ్బంది అనిపించినా ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా చేశాను. ⇒ కోపమొచ్చినా, సంతోషమొచ్చినా చూపిం చేస్తాను. ఏదీ మనసులో పెట్టుకోను. ఆ తత్వమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఇచ్చింది. ⇒ చిరంజీవితో ‘కొదమ సింహం’, మోహన్‌బాబుతో ‘అల్లుడుగారు’, బాలకృష్ణతో ఓ సినిమా, రాజశేఖర్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌లతో.. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యా. స్టార్ హీరోయిన్ కాలేదనే బాధ ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉన్నందుకు హ్యాపీ. ⇒ ఎవరెవరినో నా భర్త అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. నేను ఒక్కర్నే పెళ్లి చేసుకున్నా (నవ్వుతూ). కావాలంటే నన్ను అడగండి.. ఫ్యామిలీ ఫొటోస్ పంపిస్తా. నా భర్త పేరు జయంత్‌కుమార్. ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి. -
శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత
టాలీవుడ్ క్యుటెస్ట్ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇద్దరూ సహా నటీనటులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో నటిస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి వీరిద్దరి మధ్య కొంతకాలానికి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. 2009 మార్చీలో 1న పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ మ్యాచింగ్ దుస్తులు ధరించిన మ్యారీడ్ దోస్తుల్లా ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా ఈ ‘బ్రైట్ కపుల్’ సాక్షితో టీవీ పంచుకున్న ముచ్చట్లివి.. శివబాలాజీ: నాకు కోపం ఎక్కువని మధు నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్లింట్లో ఇష్టం లేదు. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మధుమిత: పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నా కూడా పెళ్లయిన కొత్తలో ప్రతీ చిన్న విషయానికీ గొడవ పడేవాళ్లం. అయితే ఆ తర్వాత ఎలా ఉండాలో తెలుసుకున్నాం. శివబాలాజీ: తను పప్పుచారు నుంచి పాయా దాకా అన్నీ అద్భుతంగా వండుతుంది. మధుమిత: ఇంటర్లో అన్నయ్య నుంచి వంటలు నేర్చుకున్నాను. నా దగ్గర నుంచీ తనకు నచ్చినవన్నీ తను (శివ) కూడా నేర్చుకున్నారు. శివబాలాజీ: పెళ్లయ్యాక సినిమాలు మానేయాలని మధు ఫ్యామిలీ డిసైడ్ అయింది. అయితే ఆలోచించమని నచ్చజెప్పా. అప్పుడు ఓకే అన్నప్పటికీ పెళ్లి తర్వాత పాత్రల విషయంలో పర్టిక్యులర్ అయిపోయింది. మధుమిత: కరోనా టైమ్‌లో 3 నెలల పాటు ఫార్మ్‌లో గడిపేశాం. శివబాలాజీ: నాకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, నీళ్ల మధ్యలో ఇల్లు అంటే ఇష్టం. మధు వాళ్ల ఫ్యామిలీకి కూడా అదే హాబీ. మధుమిత: అందరూ సేఫ్‌గా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. -
‘బంగారం’ లాంటి బర్నింగ్‌స్టార్
కొలిమి భగ భగలో మండితేనే కదా బంగారం.. ఆభరణం అయ్యేది. వేలమంది పోటీలో ‘ఒక్కఛాన్స్’ తనకు దక్కుతుందా? అనే అనుమానాల నడుమే బర్నింగ్ స్టార్‌గా తయారయ్యాడు నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో, మరోవైపు సాయాలతో తెలుగు ప్రజల అభిమానం అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇంతకీ సంపూలో నటనకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఏంటో తెలుసా? ‘ఉపేంద్ర’ సినిమా. త్వరలో బజార్ రౌడీ సినిమాతో సంపూ ఆడియొన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా సాక్షి.కామ్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. -
సింగర్ చిన్మయి శ్రీపాద - మహిళా దినోత్సవం ప్రత్యేక ఇంటర్వ్యూ
-
ఆ లేఖ రాయటం తప్పు కాదు...
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు ప్రజల్లోకి వెళితేనే చర్యలకు వీలుంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంలో కానీ, ఆ లేఖను బయటపెట్టడంలో కానీ ఎలాంటి తప్పూ లేదని చెప్పారాయన. అభిశంసన లాంటి అవసరం వస్తే... ఆరోపణల గురించి తెలిస్తేనే కదా పార్లమెంటు సభ్యులు ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల గొంతు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత నిలబడదని స్పష్టంచేశారు. తాజా వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా విచారణ జరుపుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారాయన. అమరావతి ల్యాండ్ స్కామ్ ఎఫ్ఐఆర్పై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటాన్ని తప్పుపట్టిన ప్రశాంత్ భూషణ్... పలు అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యాంశాలివీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయటం తప్పంటారా? నేనైతే తప్పనుకోవటం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి, వచ్చే ఏప్రిల్‌లో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న వారిపై చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ప్రధాన న్యాయమూర్తి తగిన వారు కనుక వారికే లేఖ రాయాలి. ఇంతటి తీవ్రమైన ఆరోపణలొచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి తప్పకుండా విచారణ జరపాలి. అత్యంత నిజాయితీ పరులుగా పేరున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక స్వతంత్ర కమిటీ వేసి విశ్వసనీయమైన విచారణ జరిపించాలి.. ఈ లేఖను ఏపీ ప్రభుత్వం బహిరంగం చేసింది కదా! ఇది తప్పంటారా? అసలు న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ఆరోపణలొచ్చినప్పుడు వాటిని రహస్యంగా ఉంచాలా? అలాంటిదేమీ లేదు. ఆరోపణలొచ్చింది న్యాయమూర్తులపై కదా అని వేరేగా చూడకూడదు. వేరేవాళ్లపై ఆరోపణలొచ్చినప్పుడు ఎలా చూస్తామో.. దీన్నీ అలాగే చూడాలన్నది నా అభిప్రాయం. ప్రజలకు దాన్ని తెలియకుండా ఉంచాలనటానికి ఎలాంటి కారణమూ లేదు. రహస్యంగా ఉంచాలనుకోవడమంటే.. తొక్కి పట్టడమే. ఒకవేళ దాన్ని రహస్యంగా ఉంచితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ, పార్లమెంటు సభ్యులు గానీ దానిపై ఏమీ చేయలేరు. అంటే లేఖలోని విషయాలు బయటకు రాకపోతే చర్యలు తీసుకోలేరా? దీనిపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవచ్చు. ఒకటి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరపడం. రెండోది అభిశంసన. మరి అభిశంసన విషయానికొస్తే దాన్లో పార్లమెంటు సభ్యుల పాత్ర ఉంటుంది. విషయం ప్రజల్లోకి రానప్పుడు పార్లమెంటు సభ్యులు కూడా అభిశంసన తీర్మానంపై సంతకం చేసేందుకు ముందుకు రారు. తాము ఏదో చేయాలనే అభిప్రాయానికి రానిపక్షంలో.. కాబోయే సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి ఇబ్బంది తెచ్చిపెట్టాలని ఎవరూ అనుకోరు కదా!. కొందరైతే ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడాన్ని కోర్టు ధిక్కరణగా వ్యాఖ్యానిస్తున్నారు. అత్యున్నతస్థాయి వ్యక్తులపై ఆరోపణలొస్తే అసలెలా పరిష్కరించాలి? ఆరోపణలు చేయటమంటే కోర్టును అపకీర్తి పాలు చేయడమనే వ్యాఖ్యలు కొందరు చేస్తుంటారు. ఇది పురాతన చట్టం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాగే ఉంది. వలస పాలన నాటి సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తగిన కారణాలైతే ఏమీ లేవు. చక్రవర్తుల కాలంలోనైతే న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారు. న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న వారి విశ్వసనీయతను కాపాడలేం. న్యాయవ్యవస్థలోని అవినీతి లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. అమరావతి భూకుంభకోణంలో ఎఫ్ఐఆర్ను మీడియా రిపోర్ట్ చేయకుండా ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం, దర్యాప్తు నిలిపివేయటంపై ఏమంటారు? ఎఫ్ఐఆర్ను రిపోర్ట్చేయకుండా మీడియాపై గ్యాగ్ ఆర్డర్ జారీచేయడం హైకోర్టు పనికాదు. ఇలాంటి చర్యలన్నీ భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. సమాచారం తెలుసుకునే ప్రజల హక్కుకు వ్యతిరేకం. ఏం జరుగుతోందో తెలుసుకునే అవసరం ప్రజలకుంది. అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తు జరగాలా... వద్దా? తప్పనిసరిగా జరగాలి. అవినీతి, లేదా ఇతరత్రా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తే తప్పకుండా దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన ప్రకారం అమరావతి భూకుంభకోణంలో దర్యాప్తు జరపాలి. అలా చేయొద్దనటానికి కారణమేమీ లేదు. దర్యాప్తు నిలిపివేయాల్సిన అవసరమూ లేదు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలంటారు? న్యాయ వ్యవస్థపై ఫిర్యాదులకు జ్యుడీషియల్ కంప్లయింట్ కమిషన్ అవసరం. న్యాయమూర్తులపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న అంశాన్ని స్పష్టం చేయాలి. కమిషన్‌లో కనీసం ఐదుగురు సభ్యులుండాలి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు గానీ, ఇతరులు గానీ ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ నుంచి, ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా ఉండాలి. ఎంపిక విషయంలో కూడా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పెత్తనం ఉండకుండా చూడాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులపై స్వతంత్ర విచారణ జరిగేలా ఉండాలి. విచారణ అనంతరం తొలగింపు లేదా ఏ ఇతర సిఫారసులైనా పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి. ఏపీ హైకోర్టు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి విజ్ఞాపనకు ఎలాంటి పరిష్కారం ఉండాలని భావిస్తున్నారు? ప్రధాన న్యాయమూర్తి దాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. సుప్రీం కోర్టు ప్రవర్తన నియమావళి ప్రకారం సిట్టింగ్ న్యాయమూర్తులతోనే విచారణ జరిపించాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి సీనియర్. ఆయనకంటే జూనియర్ న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తే.. వారు స్వతంత్రంగా విచారణ జరపలేరేమోనన్నదే నా అభిప్రాయం. అందుకని ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించడం అవసరం. -
సమన్వయంతో పోరాడుతున్నాం
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ ముందుండి పని చేస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించటాన్ని పోలీసు శాఖ సవాల్‌గా తీసుకుని పని చేస్తోందని చెప్పారు. గురువారం రాత్రి ‘సాక్షి’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రెడ్ జోన్లలో పోలీస్ సిబ్బంది 11 ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో అద్భుతంగా పని చేస్తున్నారు. పోలీసుల సేవలను ప్రజలు గుర్తించి అభినందిస్తుండటం మా బాధ్యతను మరింత పెంచుతోంది. ► వూహాన్ నుంచి వైద్య విద్యార్థులు, ఇటలీ నుంచి మరో విద్యార్థి రావడంతో తొలిసారిగా రాష్ట్రంలో కరోనాను గుర్తించాం. వెంటనే అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చిన 22,266 మంది జాబితాను సేకరించి క్వారంటైన్లో ఉంచాం. ► గుంటూరులో ఓ పాజిటివ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తే ఢిల్లీ లింక్ బయటపడింది. గుంటూరు, కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లడంతో ఆ రెండు జిల్లాల్లో కేసులు పెరిగాయి. ► హోం క్వారంటైన్ యాప్‌ను వినియోగించి మంచి ఫలితాలు సాధించాం. డ్రోన్లను కూడా వాడుతున్నాం. టెక్నాలజీ ద్వారా Üవాళ్లను అధిగమిస్తున్నాం. ► రాష్ట్రంలో 181 రెడ్జోన్లలో రాకపోకలు లేకుండా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నాం. ► రాష్ట్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. ► సోషల్ మీడియా ద్వారా పుకార్లు, వదంతులు వ్యాప్తి చేయకుండా పోస్టింగ్‌లు, కామెంట్ల్లపై నిఘా పెట్టాం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారిపై 139 కేసులు నమోదు చేశాం. ► 289 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చాం. ► క్వారంటైన్ సెంటర్లలో వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందిపై ఎవరైనా వేధింపులు, దాడులకు పాల్పడితే బెయిల్ కూడా రాదు. ఏడేళ్ల జైలు విధించేలా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ► లాక్‌డౌన్‌ను సదవకాశంగా భావించి కుటుంబంతో అందరూ ఆనందంగా గడపాలి. ఇంటి పనుల్లో సాయం చేయడంతోపాటు ఈ సమయాన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలి. నా ఫిట్‌నెస్‌కు కారణం క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, భగవంతుడి దయ. -
పరీక్షలు పెంచడమే మార్గం
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కరోనా నియంత్రణ జరగాలంటే ఆ వైరస్ సోకిందా లేదా అనే నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడమే మార్గమని యూకేకు చెందిన ఆక్లామ్ విశ్వవిద్యాలయ స్టడీ యూనిట్ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ పొట్లూరి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కనీసం 10 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరగాల్సి ఉందని, ఆ తర్వాతే దీనిపై ఓ నిర్ధారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్పుడే సామాజిక, ఆర్థిక మాంద్యాలను తగ్గించుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణపై 50 దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసిన ఆక్లామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడు కూడా అయిన రాహుల్ పొట్లూరి భారతదేశంలో కరోనా నియంత్రణ మార్గాలపై మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ అంశంపై రాహుల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే... సంబంధాలను అధ్యయనం చేశాం ప్రపంచంలోని పలుదేశాల్లో కరోనా కేసుల సంఖ్య, అక్కడ జరుగుతోన్న పరీక్షల సంఖ్య మధ్య ఉన్న సంబంధాన్ని విస్తృతంగా అధ్యయనం చేశాం. కరోనా కేసులు, మరణాల నిష్పత్తి చాలా వైవిధ్యంగా ఉందని మా పరిశోధనలో తేలింది. ఏ దేశాల్లో అయితే జనాభా ఆధారంగా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉందో అక్కడ మరణాల రేటు తక్కువగా ఉంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లే పాజిటివ్ కేసులను నిర్ధారించి వారికి చికిత్స అందించి మరణించకుండా చర్యలు తీసుకునే వీలు కలిగింది. మరణాల సంఖ్యను నియంత్రించడంలో బాగా కృషి చేసింది దక్షిణ కొరియానే. కనీసం ఒక శాతం పరీక్షలు చేయాలి వివిధ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిని పరిశీలించిన తర్వాత ఏ దేశంలోనైనా ఆ దేశ జనాభాలో 1 శాతం మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా అయితే మన దేశంలో కనీసం కోటిన్నర మందికి ఈ పరీక్షలు జరపాలి. కానీ సాధ్యాసాధ్యాల దృష్ట్యా మనదేశంలో పది లక్షల మందికైనా పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరీక్షలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా ఆరోగ్య ప్రణాళికలను అమలు చేయడమే కాకుండా హాట్స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ నిరోధానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమనుకంటే క్వారంటైన్ లేదా ఐసోలేషన్ గడువును కూడా పెంచుకోవచ్చు. వ్యాక్సినేషన్ లేదు కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ లేనందువల్ల పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడమే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి మరణించే ప్రమాదాన్ని తప్పించుకోవాలన్నా గణనీయంగా పరీక్షలు నిర్వహించడమే ఉత్తమ మార్గం. అందుకే మా పరిశోధన బృందం ప్రపంచంలో ఈ విధానం అమలు చేయాలని సిఫారసు చేస్తోంది. -
లాక్‌డౌనే అసలు మందు!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌కు నిర్దిష్టంగా మందు లేదు. మనిషి సాంఘిక జీవి కాబట్టి సామాజిక దూరం అని చెప్పడం కంటే భౌతికంగా మాత్రమే ఎడంగా ఉంటూ.. సామాజికంగా దగ్గరగా ఉండాలి. ఇందుకు మొబైల్స్ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మొబైల్స్ మీద వైరస్ చాలా ఎక్కువ సేపు ఉంటుంది. కాబట్టి మొబైల్ హైజీన్, మొబైల్ శానిటైజేషన్ పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం లాక్‌డౌన్‌ను తప్పక పాటిస్తే.. వ్యాధి తీవ్రత తగ్గడమే కాదు.. మనం త్వరగా ఈ కష్టకాలం నుంచి బయటపడతామంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా గురించి పలు అంశాలు చెప్పారు. వివరాలివీ.. సాక్షి: ఈ ప్రపంచంలోని జీవరాశి మొత్తం బరువు కంటే.. ఈ లోకంలో ఉన్న వైరస్ల బరువే ఎక్కువంటారు. అంత ఎక్కువ మొత్తంలో వైరస్లు ఉన్నదే వాస్తవమైతే, ఆ వైరస్లన్నింటితో ముప్పు లేదెందుకు? ఈ వైరస్‌తోనే ఇంత ముప్పు ఎందుకు? డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి: పరిణామక్రమంలో ఈ ప్రపంచంలోకి మొదటే వైరస్లు వచ్చాయి. దాదాపు 500 మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి వైరస్లు ఉన్నాయి. మనం భూమ్మీదికి చాలా లేట్‌గా వచ్చాం. చాలా ముందు నుంచి ఉండటం వల్ల ఈ భూమికి నిజమైన యజమానులు వైరస్‌లే అనుకోవచ్చు. అయితే అవి తమంతట తాము మనుగడ సాగించలేవు కాబట్టి ఒంటెలు, గబ్బిలాలు.. ఇలాంటి చాలా వాటిని ఆశ్రయించి మనుగడ సాగిస్తూ వచ్చాయి. చాలా అటవీ జంతువుల్లో వైరస్లు ఎప్పుడూ ఉంటాయి. అవి తమ హద్దులు (బ్యారియర్స్) దాటకుండా బతికేస్తూ ఉంటాయి. వాటి వాటి జన్యువులను బట్టి ఏ జంతువుకు పరిమితమైన వైరస్లు ఆ జంతువులోనే ఉండిపోతాయి. కొన్నికొన్ని మ్యుటేషన్స్ వల్ల అవి జన్యుస్వరూపం మార్చుకోవడం వల్ల మనుషులకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఉత్పాతాన్ని చూస్తున్నాం. కానీ పరిణామక్రమంలో చాలా చాలా వైరస్ల ఆర్‌ఎన్‌ఏలూ, డీఎన్ఏలూ మన జీన్స్‌లోకి వచ్చి.. వాటిలోకి పూర్తిగా ఇంకిపోవడం వల్ల పరిణామంలో చాలా సానుకూల ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు వస్తున్న వైరస్ కూడా నేరుగా మానవులకు రాలేదు. మొదట గబ్బిలాలు, అక్కణ్నుంచి మరికొన్ని జంతువుల్లోకి వెళ్లి.. అలా మానవులకు వచ్చాయి. నిజానికి మనిషి తన పరిధులను అతిక్రమించి అటవీ జంతువుల ప్రపంచంలోకి వెళ్లడం వల్లనే.. ప్రస్తుతం ఉన్న వైరస్ మానవులకు సోకేలా మార్పు చెంది, మనుషుల్లో వ్యాధికి కారణమవుతోంది. విటమిన్–సి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరిగి వైరస్ ప్రభావం లేకుండా చేసే అవకాశాలున్నాయంటున్నారు. చాలామందికి నిమ్మ, నారింజ, కమలాల వంటి సిట్రస్ ఫ్రూట్స్, మరికొందరికి పుచ్చకాయ వంటివి తినగానే జలుబు చేస్తుంది. అలాంటివారి సంగతేమిటి? నిమ్మ, నారింజ, కమలాల వంటి సిట్రస్ ఫ్రూట్స్ వల్ల జలుబు చేయడం, దగ్గు రావడం జరుగుతుందని చాలామంది అంటుంటారు గానీ సైంటిఫిక్‌గా దానికి తగిన తార్కాణాలు లేవు. అయితే కొంతమందికి వారి వ్యక్తిగత శారీరక స్వభావం బట్టి ఇలా జరుగుతున్నప్పుడు మందులు దుకాణాల్లో దొరికే విటమిన్–సి టాబ్లెట్స్ రోజుకొకటి వాడుకోవచ్చు. చాలామంది ఇది శ్వాస సమస్యలనే కలగజేస్తుందంటున్నారు. కానీ కొందరిలో నీళ్ల విరేచనాలు, రుచులు, వాసనలు తెలియకపోవడం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయట కదా? జ్వరం, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి ప్రధాన లక్షణాలతో పాటు.. రుచులు, వాసనలు తెలియకపోవడం ఉంటాయి. 20 నుంచి 30 శాతం మందిలో నీళ్ల విరేచనాలు (డయేరియా), వికారం (నాజియా), వాంతుల వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరో 20 శాతం మందిలో రుచులు, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు చేసినప్పుడు వాసనలు తెలియకపోవడం మామూలే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ వైరస్ ప్రత్యేకత ఏమిటంటే.. జలుబు లేనప్పటికీ ఇది సోకినప్పుడు మనకు వాసనలు తెలియకుండా పోతాయి. చైనా, ఇటలీ, అమెరికాలలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.. కానీ ఇండియాలో తక్కువగానే ఉందంటున్నారు. కారణాలేంటి? మొదట ఈ వైరస్ చైనాలో వచ్చినప్పుడు ‘ఎస్’, ‘ఎల్’అనే తరహాలను చూశాం. కానీ ఇప్పుడు ‘ఎస్’వేరియెంట్, ‘ఎల్’వేరియెంట్ అనే భావనలు పూర్తిగా పోయాయి. అనేక కొత్త అంశాలు తెలియవచ్చాయి. మన దేశంలో, ఇటలీలో, యూఎస్ఏలో, చైనాలో కనిపించిన వైరస్ల తాలూకు జీన్స్ చాలా నిశితంగా అధ్యయనం చేస్తున్నాం. కరోనా వైరస్‌కు పైన ముళ్లు ముళ్లులా అంటే స్పైక్స్లా ఉండటం బొమ్మల్లో చూశారు కదా. ఇటలీలో కనుగొన్న కరోనా వైరస్‌లోని జీనోమ్‌లో మూడు మ్యూటేషన్ల ద్వారా మార్పులు వచ్చినట్లు కనుగొన్నారు. దాంతో అక్కడి ‘కరోనా’లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక భారత్‌లో వచ్చిన కరోనా వైరస్ రకంలో వచ్చి న ఒక మ్యూటేషన్ కారణంగా ఈ స్పైక్ ప్రోటీన్‌లో మార్పు వచ్చి అది సరిగా కణానికి అతుక్కోకపోవడాన్ని చూస్తున్నాం. దీని వల్లనే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉందా తెలియడం లేదు. దీనిపై అధ్యయనం జరగాలి. ఈ వైరస్ తనలాంటి ఎన్నో కాపీలను ప్రొడ్యూస్ చేసుకుంటుందట కదా నిజమేనా? ఈ వైరస్ చాలా తెలివైనది. అదో త్రీడీ మెషీన్ వంటి జిరాక్స్ మెషీన్ సహాయంతో ఎన్నెన్నో కాపీలను పుట్టించినట్లుగా తన కాపీలను (అం టే తనలాంటి వైరస్‌లను) పుట్టించుకుంటుంది. ఇందుకు మన కణాలను ఉపయోగించుకుంటుంది. ‘స్పీషిస్ బ్యారియర్’అంటే ఏమిటో చెప్పండి. ఆ బ్యారియర్ లేకపోవడం వల్లనే ఇది మన మానవుల్లో విపరీతంగా విస్తరిస్తోందట కదా? ప్రతి జీవిలోనూ చాలా వైరస్లు ఎప్పుడూ నివసిస్తుంటాయి. మన కడుపులో ఈ క్షణంలోనూ ఎన్నెన్నో వైరస్లు ఉంటాయి. అవన్నీ మనలోనే ఉన్నా.. మనకు నిరపాయకరంగా ఉంటాయి. మనకు నిరపాయకరమైన ఈ వైరస్లు ఇతర జీవుల్లోకి వెళ్లినప్పుడు వాటికి అపాయకరం కావచ్చు. ఇలా ఒక ప్రజాతికి (స్పీషి స్కు) నిరపాయకరంగా ఉండటాన్ని స్పీషిస్ బ్యారియర్ అంటారు. అయితే ఇది వేరే స్పీషీస్‌కు చేరినప్పుడు అది వాటికి అపాయక రం కావచ్చు. ఇలా ఇతర జీవుల్లో నిరపాయకరంగా ఉన్న వైరస్.. మ్యుటేషన్లకు గురై మనకు రావ డం వల్ల అపాయకరం గా పరిణమించిందనే అభిప్రాయం కొంతమంది నిపుణుల్లో ఉంది. అయితే ఇది చాలా రోజులు మనలోనే ఉండిపోయిందనుకోండి. కాలక్రమంలో ఇది కూడా మనపట్ల నిరపాయకరం గా మారిపోవచ్చు. అప్పుడు ఇది మనకే పరిమితమైపోతుంది. ఇలా మనకు పరిమితం కావడాన్ని మళ్లీ స్పీషిస్ బ్యారియర్గా చెప్పవచ్చు. కొన్ని ఆఫీసుల్లో కామన్ బాత్రూమ్ల వల్ల ఇది విస్తరించే ప్రమాదం ఉందా? మూత్రవిసర్జన ప్రాంతాలతో ఎలాంటి ప్రమాదం లేదన్నది స్పష్టమే అయినా.. మలం ద్వారా వైరస్ వ్యాపిస్తుందనేది కొందరి అభిప్రాయంగా ఉన్నప్పటికీ దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. వాస్తవానికి బాత్రూమ్ల కంటే వాటి డోర్ నాబ్స్, గొళ్లేల వంటివి చాలా ప్రమాదం. అలాంటివి తాకినప్పుడు చేతులను చక్కగా కడుక్కోవడం అవసరం. శానిటైజర్లతో ఈ బాత్రూమ్ డోర్ నాబ్స్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే, వెస్ట్రన్ కమోడ్ విషయంలో దాన్ని ఉపయోగించాక ఫ్లష్ చేసిన తర్వాత, దాని పైన ఉండే మూత వేసి పెట్టాలి. ఒకరు బాత్రూమ్ వెళ్లి వచ్చాక.. వెంటనే మరొకరు వెళ్లడం కంటే... ఇలా మరొకరు వెళ్లాల్సి వచ్చినప్పుడు కాస్తంత వ్యవధి తర్వాతే వెళ్లడం మంచిది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో కంటే గుండెజబ్బులు, డయాబెటిస్ ఉన్నవారే ఎక్కువగా బలయ్యారు. కారణమేంటి? గుండె సమస్యలు ఉన్నవారికి చికిత్సగా ఏసీఈ–2 రిసెప్టార్స్‌ను ఇస్తుంటాం. దాంతో వారిలో ఏసీఈ–2 రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే... ఈ ఏసీఈ–2 రిసెప్టార్స్ అనేది తాళం చెవి రంధ్రాలు అనుకుంటే, వైరస్‌కు ఉండే స్పైక్స్ తాళం చెవులుగా చెప్పుకోవచ్చు. గుండెజబ్బులున్న వారిలో తాళం చెవి రంధ్రాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల స్పైక్స్ దూరిపోడానికి అవకాశాలెక్కువ. దానివల్ల వైరస్ గుండెజబ్బులున్నవారి కణాల్లోకి దూరిపోవడం మిగతావారికంటే సులువు. అందుకే వారిలో ముప్పూ ఎక్కువే. మరణాలూ ఎక్కువే. ఇక డయాబెటిస్ ఉన్నవారి శరీరాల్లో రోగనిరోధక శక్తి తక్కువ. అందుకే గుండెజబ్బులూ, డయాబెటిస్ ఉన్నవారిలో ముప్పు ఎక్కువ. ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలున్నవారిలోనూ ముప్పు ఎక్కువే. మాంసాహారం మానేయడం వల్ల వైరస్ తీవ్రత తగ్గుతుందా? చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మనం ఆరోగ్యంగా ఉండటం వల్ల వైరస్ అంత తేలిగ్గా సోకదు. కాబట్టి మాంసాహారం తినేవారు నిరభ్యంతరంగా తినవచ్చు. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బు, ఒకే దువ్వెన వాడటం సురక్షితమేనా? ఆ ఇంట్లో ఉండేవారు అందరూ ఆరోగ్యవంతులైతే ఈ దువ్వెనలూ వంటి వాటిని వాడుకోవచ్చు. వాటి కంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్ శానిటేషన్ చాలా ప్రధానం. మన ఫోన్ ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. మన ఫోన్‌ను ఎవరైనా వాడినా వెంటనే దూదిని కాస్తంత శానిటైజన్లో ముంచి దాన్ని శుభ్రం చేసి వాడాలి. ప్లాస్టిక్, స్టీల్ మీద వైరస్ దాదాపు 36 నుంచి 48 గంటలకు పైగా జీవించి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. హెర్డ్ ఇమ్యూనిటీ’అంటే ఏమిటి? అది వస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదా? మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి. అప్పుడు ఆ జనాభా అంతటికీ ఇమ్యూనిటీ వచ్చిందని అనుకోవడాన్నే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’అంటారు. ఇలా ఒక ప్రాంతంలోని సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు.. మళ్లీ వైరస్ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మైల్డ్‌గా ఉండే వైరస్ల విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ అన్నది సేఫ్ అని అనుకోవచ్చు. మరణాలు చాలా ఎక్కువగా ఉండే వైరస్ విషయంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’రావడాన్ని సురక్షితమైన అంశంగా భావించడానికి వీలుండదు. కరోనా విషయంలోనూ తదుపరి సీజన్‌కల్లా మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని అనుకోవచ్చు. దానివల్ల మనకు కలిగే రక్షణా ఎక్కువే అయినా.. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్మడం కంటే జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? లాక్డౌన్ వంటి చర్యలు చాలా అవసరం. అవి వైరస్ వ్యాప్తిని అరికడతాయి. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను, వాళ్లు పడుతున్న కష్టాలను గుర్తించి, ప్రజలంతా సహకరించాలి. లాక్‌డౌన్‌ను పాటించాలి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అతిగా ఆందోళన పడితే, ఆ ఒత్తిడి ప్రభావం దేహంపై పడి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మొదటికే ముప్పు వస్తుంది. అందువల్ల అనవసరంగా ఆందోళన పడకండి. అలాగని అప్రమత్తత వీడి నిర్లక్ష్యంగానూ ఉండకండి. ఈ రెండిటి మధ్య విభజన రేఖ ఎక్కడ గీయాలో తెలుసుకుని విజ్ఞతతో మెలగండి. వార్తాపత్రికలతో వైరస్ వ్యాపిస్తుందనే అనుమానాల్లో నిజమెంత? న్యూస్‌పేపర్ వల్ల వైరస్ వ్యాపిస్తుందని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ దీనిపై అమెరికాలో జరిగిన అధ్యయనంలో న్యూస్పేపర్లపై ఒక గంట సేపటి కంటే వైరస్ ఉండే అవకాశం లేదని తెలిసింది. ఇక ‘సాక్షి’వంటి పెద్దపెద్ద సంస్థలన్నీ శానిటైజ్ చేసే ఇస్తున్నారు. దానివల్ల ప్రమాదమే లేదు. ఇక అంతగా అనుమానం ఉందనుకోండి. మీకు పేపర్ వేసిన గంట తర్వాత తీసి, దాన్ని హాయిగా చదువుకోవచ్చు. ఒకవైపు మందులు లేవంటున్నారు. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్‌తో ఫలితం కనిపిస్తుందంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్? ఈ వ్యాధికి యాంటీవైరల్ డ్రగ్స్ ఇంతవరకు కనుక్కోలేదు. ఇంకా రీసెర్చ్ కొనసాగుతూ ఉంది. రెండు మూడు ట్రయల్స్ జరిగాయి. ఒకటి జపాన్ నుంచి వచ్చిన మందు అవిగాన్ అని ఉంది. దాన్ని చైనాలో వాడారు. ఒక ట్రయల్ ఫ్రాన్స్‌లో జరిగింది. అందులో రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్ కాంబినేషన్‌గా వాడారు. ఇది 22 మంది రోగుల మీద జరిగింది. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి. ఇంత చిన్న సమూహం మీద జరిగిన ట్రయల్‌ను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారనే విమర్శలున్నాయి.ఇప్పుడు చైనాలో, యూఎస్ఏలో దీనిమీదే అధ్యయనం జరుగుతోంది. దీని ఫలితాలు మే కల్లా వస్తాయి. ఇప్పుడు ఐసీఎమ్ఆర్, డబ్ల్యూహెచ్ఓ వాళ్లు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్లను ప్రొఫిలాక్టిక్ చికిత్సగా అంటే.. జబ్బు రాకుండా ఉండేం దుకు ముందుజాగ్రత్త చర్యగా వాడుకోవచ్చ ని చెప్పాయి. అవి కూడా రెండు వర్గాలకు మాత్రమే. మొదటిది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికీ, రెండోది కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. ఆ కుటుంబ సభ్యులకు జబ్బు రాకుం డా నివారణ కోసం.. ఇలా ఈ ఇరువర్గాలకు మందు ఇవ్వవచ్చని సిఫార్సు చేశారు. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ 200 ఎంజీ మోతాదులో వారంలో రెండు సార్లు ఇవ్వవచ్చని సూచించారు. ఇక విటమిన్–సి, విటమిన్–డి, జింక్ వంటి పోషకాలు దీని నివారణలో చాలా ప్రధాన భూమిక పోషిస్తాయి. డాక్టర్లు ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్గా తీసుకుంటున్నారంటున్నారు కదా.. అలాంటప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరికీ వాటిని ఇవ్వడం ద్వారా వైరస్‌ను అరికట్టలేమా? ఆ మందుల వల్ల కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గుండెజబ్బులు ఉన్న వారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో వికారం, వాంతులు వంటివి ఉండవచ్చు. పూర్తిగా 100 శాతం సురక్షితం అని నిరూపణ కాలేదు కాబట్టి అందరికీ ఇవ్వలేం. మనలాంటి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లోని ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వైరస్ తీవ్రత అంత ఎక్కువగా ఉండదంటున్నారు నిజమేనా? ఒకవేళ వేసవిలో తగ్గినా.. మళ్లీ వర్షాకాలం, శీతాకాలంలో విజృంభించే అవకాశం ఉంది కదా? దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటాక ఈ వైరస్ బతికి ఉండటం లేదని ల్యాబ్ ఫలితాలు చెబుతున్నా.. వాటిని బయట ఉన్న వాతావరణ పరిస్థితులకు అన్వయించలేం. బయట 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. మన గది ఉష్ణోగ్రత సాధారణంగా 25 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండవచ్చు. మనం గదుల్లో ఉన్నప్పుడే ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువ కదా. అలాగే చలికాలంలో మళ్లీ వచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువే. అయితే అప్పటికే చాలామందిలో ఈ వ్యాధి వచ్చి తగ్గిపోయినందువల్ల వారిలోని యాంటీబాడీస్ వల్ల ఇమ్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఇంతటి తీవ్రత ఉండకపోవచ్చు. ఇక ఆపై ఏడాది వచ్చే చలికాలానికి అసలు సమస్యే ఉండకపోవచ్చు. ఎందుకంటే... దాదాపు 16 నెలల వ్యవధిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 70, 80 ఏళ్ల కంటే పెద్దవాళ్లలోనే రిస్క్ అంటున్నారు కదా.. వాళ్ల పట్ల ఏవైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? వయసు విషయానికి వస్తే రెండు అంశాలున్నాయి. మొదటిది బయలాజికల్ ఏజ్, రెండోది ఫిజికల్ ఏజ్. బయలాజికల్ ఏజ్ అంటే కాలం గడుస్తున్న కొద్దీ పెరిగిపోయే వయసు. ఇక ఫిజికల్ ఏజ్ అంటే.. ఉదాహరణకు మనకు 65 ఏళ్ల వయసనుకుందాం. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్మోకింగ్ లాంటి దురలవాట్లు లేకపోవడం, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఏ 50.. 52 ఏళ్ల వ్యక్తిలా ఉన్నామనుకోండి. ఇలాంటివారిలో ముప్పు తక్కువ. అదే ఎలాంటి వ్యాయామం లేకుండా, స్మోకింగ్ లాంటివి చేసేవారు, మద్యం అలవాటు ఉన్నవారు, ఏ గుండెజబ్బులో, కేన్సరో ఉన్నవారైతే వారికి బయలాజికల్ వయసు తక్కువే అయినా ఫిజికల్‌గా సరిగా లేకపోతే.. వాళ్లకు ముప్పు ఎక్కువ. ఇలాంటివారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల చాలా ప్రాణాలు కాపాడవచ్చు. ఈ జబ్బు వస్తే చాలావరకు చచ్చిపోతారు అనే అభిప్రాయం ఉంది. అది సరికాదు. జబ్బు వచ్చిన వారిలో 90 శాతం మంది కోలుకుంటారు. -
అర్జున్ గ్రామర్ నివేదితకి అర్థమైంది..
గ్రామర్... కష్టమైన సబ్జెక్ట్. అర్థం అయితే చాలా ఈజీ. ప్రెజెంట్లో ఉన్నా ఫ్యూచర్ కూడా అర్థమవుతుంది. పెళ్లి... ఇదో సెపరేట్ గ్రామర్. భర్తది ఒక గ్రామర్... భార్యది ఒక గ్రామర్. ఒకరి గ్రామర్ మరొకరికి అర్థమైతే ఫ్యూచర్ అర్థవంతంగా ఉంటుంది. అర్జున్ గ్రామర్ నివేదితకి అర్థమైంది.. నివేదిత గ్రామర్ అర్జున్‌కి అర్థమైంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే వివాహ బంధానికి అర్థమే లేదంటున్నారు ఇద్దరూ. ►మీ పెళ్లయి 32 ఏళ్లయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నేళ్ల జీవితం ఎలా అనిపిస్తోంది? అర్జున్: మా ఫ్రెండ్స్ ‘25 ఏళ్లకే పెళ్లి చేసుకున్నావేంటి? కొన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు’ అనేవాళ్లు. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ‘తొందరగా పెళ్లి చేసుకుని ఎంత మంచి పని చేశానా’ అనిపిస్తోంది. సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాను. ఒంటరిగా ఉండి సాధించవచ్చు అనుకుంటారు. కానీ కలసి సాధించడంలో కిక్ వేరే ఉంటుంది. పెళ్లి చేసుకున్నవాళ్లకే అది తెలుస్తుంది. నా లైఫ్‌లో జరిగిన బెస్ట్ విషయాల్లో నివేదితతో పెళ్లి ఒకటి. నివేదిత: నా లైఫ్‌లో జరిగిన మంచి విషయం అర్జున్‌గారిని పెళ్లి చేసుకోవడమే. ఆయనతో 32 ఏళ్ల లైఫ్ చాలా చాలా బాగుంది. అర్జున్: మా ఇద్దరమ్మాయిలు (ఐశ్వర్య, అంజనా) ‘నాన్నా.. మాకు ఫ్రెండ్‌లా కనిపిస్తున్నారు’ అంటారు. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీ. నివేదిత: నన్ను కూడా ఫ్రెండ్ అనే అంటారు. ►మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం... ఆ లవ్‌స్టోరీ గురించి చెబుతారా? అర్జున్: తను కన్నడ నటి. ‘రూపతార’ అనే కన్నడ సినిమా మ్యాగజీన్లో తన ఫొటో చూశాను. ‘ఈ అమ్మాయి బావుంది’ అనుకున్నాను. అప్పుడు ‘డాక్టర్గారి అబ్బాయి’ అని తెలుగు సినిమా కమిట్ అయ్యాను. పీయన్ రామచంద్రరావుగారు డైరెక్టర్. ఆ సినిమాకి నివేదితను రికమండ్ చేశాను. వెంటనే ఓకే అన్నారు. నివేదిత నాన్నగారు (రాజేష్) కన్నడంలో పెద్ద స్టార్. అదే టైమ్‌లో మా నాన్నగారు (శక్తి ప్రసాద్) విలన్. వాళ్ల నాన్నగారు, మా నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు 86లోనే చనిపోయారు. ఇక ‘డాక్టర్గారి అబ్బాయి’ సినిమా చేస్తుండగా నివేదితకు, నాకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సినిమా క్లైమాక్స్‌లో నాకు, కోట శ్రీనివాసరావుగారికి మధ్య వెటర్నరీలో వాడే పెద్ద సిరంజీలతో ఫైట్ ఉంటుంది. టైమింగ్ మిస్ అయి, ఆ సిరంజి నా చేతికి గుచ్చుకుని చేయి మొత్తం చీలిపోయింది. దగర్లో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లాం. కుట్లు వేశారు. పక్కనే ఈ అమ్మాయి ఉంది. కళ్ల నిండా నీళ్లు. ఆ రోజే నాకు ఫీలింగ్ స్టార్టయింది. ►ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అర్జున్: ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఆ సినిమా సెట్లో అడిగా. ఓకే అంది. ►పెళ్లప్పుడు మీకు 25 ఏళ్లు. మరి ఆమెకి? అర్జున్: తనకి 17. అదేం మాకు సమస్య కాదు కానీ ఎక్కడ మిస్ కొట్టిందంటే.. ఆ వయసులో తనకు మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉండేది. నా సినిమాల ప్రివ్యూలను ఇద్దరం కలిసి చూసేవాళ్లం. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది. ఏడుస్తున్నది తనే. ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే చెప్పలేదు. ఇంటికి వచ్చాక చెప్పింది. సినిమాలో నేను హీరోయిన్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవడం తను తట్టుకోలేకపోయింది. ‘నువ్వు కూడా యాక్టరే కదా.. ఇదంతా ప్రొఫెషన్లో భాగమే’ అన్నాను. వెంటనే కన్విన్స్ కాలేదు. మెల్లిగా అర్థం చేసుకుంది. నివేదిత: 17 ఏళ్ల వయసు అమ్మాయిలు అలానే ఉంటారేమో. మాది సినిమా బ్యాగ్రౌండ్ అయినా భర్త వేరే స్త్రీతో నటన కోసం అయినా సరే క్లోజ్‌గా ఉండటాన్ని భరించలేకపోయాను (నవ్వుతూ). అర్జున్: మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఎంత బిజీగా ఉన్నా మన కుటుంబానికి, భార్యకు టైమ్ ఇవ్వాలి. ‘ఇంత ఇమ్మెచ్యుర్డ్గా ఆలోచిస్తుందేంటి’ అని కోపం తెచ్చుకోకుండా అర్థమయ్యేలా చెప్పా. అర్థం చేసుకోవడానికి టైమ్ తీసుకుంది. తర్వాత సెట్టయింది. ఆ 17 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు నేను ఎలా ఉండాలో చెబుతుంది (నవ్వుతూ). కోపం తెచ్చుకోవద్దు అని పాజిటివ్నెస్ తీసుకొస్తుంది. ఈ ఇంటర్వూ్యలో చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే... మీ ఫ్యామిలీకి టైమ్ ఇవ్వండి. నేను ఇచ్చాను కాబట్టే ఈరోజు నేను చాలా హ్యాపీ పర్సన్. నివేదిత: నా పెళ్లి సమయానికి చిన్న పిల్లని కాబట్టి కొన్ని విషయాలు అర్థం అయ్యేవి కావు. మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. ►ఈ 32 ఏళ్లలో మీ ఇద్దరిలో వచ్చిన మార్పేంటి? నివేదిత: చాలా మార్పులు వచ్చాయి. గొడవలు పడ్డాం. సర్దుకుపోయాం. ఇన్నేళ్లల్లో మా గొడవల్ని మేం ఎప్పుడూ మరుసటి రోజు వరకూ కొనసాగించలేదు. ఏదైనా ఆ రోజు వరకే. మా ‘మంత్ర’ ఒకటే.. ఏ గొడవ జరిగినా ‘ఫర్గెట్ అండ్ ఫర్గివ్’. ►ఇంటి పనుల్లో మీవారు హెల్ప్ చేస్తారా? నివేదిత: చేస్తారు. ఎవ్వరూ లేకపోతే గిన్నెలు క్లీన్ చేయడంలో కూడా సహాయం చేస్తుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం ఆయనకు ఇష్టం. ఇద్దరమ్మాయిల రూమ్స్‌ని నీట్‌గా సర్దిపెడుతుంటారు. ►వంట చేయడం వచ్చా? అర్జున్: కాఫీ పెడతాను. ఆమ్లెట్ వేసుకోగలుగుతాను. పులిహోర బాగానే చేయగలుగుతాను. నివేదిత: పులిహోర తన ఫేవరెట్. వంటమనిషి రాకపోతే వంట ప్రయత్నిస్తారు. ఆయన పెట్టే కాఫీ నాకు చాలా ఇష్టం. ►మీ భార్యలో మీకు నచ్చిన విషయాలు? అర్జున్: ఒక్కొక్కరిదీ ఒక్కోలాంటి మనస్తత్వం, వ్యక్తిత్తం. నా భార్యలో నేను చూసింది పాజిటివిటీ. అబద్ధం చెప్పదు. నాకు ఇప్పుడు ఇద్దరు అమ్మలున్నారు. ఒకరు నా తల్లి, రెండోది నా భార్య. ►అర్జున్గారిలో మీకు నచ్చేవి? నివేదిత: కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ►మీ అమ్మాయి ఐశ్వర్యను హీరోయిన్ని చేయడానికి కారణం? అర్జున్: 35ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంతకన్నా మంచి ఇండస్ట్రీ నాకు తెలిసి లేదు. బయట నుంచి చూసేవాళ్లు చెడు ఉదాహరణలు చెబుతుంటారు. మంచీ చెడు ఎక్కడైనా ఉంటాయి. నా ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. మా అమ్మాయిని కూడా పరిచయం చేయడం గర్వంగా ఉంది. తనకూ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. మా ఐశ్వర్యను కన్నడం, తమిళంలో హీరోయిన్గా పరిచయం చేశాను. తెలుగులో పరిచయం చేయాలనుకుంటున్నాను. 1984 నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మా అమ్మాయి కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నాను. రెండో అమ్మాయి అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసింది. వాళ్ల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. వాళ్ల నాన్నగా అండగా నిలబడతాను. నాన్నలందరికీ నా విన్నపం ఏంటంటే మీ పిల్లల కోసం మీరు ఆరోగ్యంగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల ఉన్నవాళ్లు. ఆడపిల్లలకు తండ్రి సంరక్షణ కావాలి. ►వర్కింగ్ ఉమెన్ మీద మీ అభిప్రాయం? అర్జున్: ‘ఉమెన్హుడ్’ని నేను చాలా గౌరవిస్తాను. అమ్మ అయినా భార్య అయినా అక్క అయినా, చెల్లయినా.. వర్కింగ్ ఉమెన్ అంటే చాలా గౌరవం. మా ఇంట్లో పని చేసేవాళ్లను ‘ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు. మీ ఇంట్లో వంట చేసి మా ఇంటికి వస్తారా?’ అని అడుగుతాను. వాళ్లు చెప్పింది వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వాళ్ల కష్టం ముందు మాది పెద్ద కష్టం కాదనిపిస్తుంది. ఇంట్లో పనిచేసి, బయట పనిచేసి ఫ్యామిలీని పెంచి పెద్ద చేయడం చిన్న విషయం కాదు. వాళ్లందరికీ నా సెల్యూట్. ►మీ ఇద్దరిలో ఎవరు డామినేటింగ్? అర్జున్: నా భార్యని అడిగితే నేనే డామినేటింగ్ అంటుందేమో. ఎవరి దృష్టిలో వాళ్లు కరెక్ట్ అనుకుంటాం. నా మనసుకి ఏది అనిపిస్తే అది చెబుతాను. ఉన్నదే చెబుతున్నాం అని మనం అనుకుంటాం. కానీ చెప్పింది వినాలన్నప్పుడు ‘తను డామినేటింగ్’ అనుకోవచ్చు. డామినేటింగ్కి కరెక్ట్ గ్రామర్ తెలియదు నాకు. అయితే చాలాసార్లు తను చెప్పింది వింటాను. కానీ చెప్పే విషయంలో చిన్న లాజిక్ ఉండాలనుకుంటాను. అది లేకపోతే మా అమ్మ చెప్పినా నా భార్య చెప్పినా వినను. నాక్కూడా కరెక్ట్ అనిపించాలి. నివేదిత: విన్నారు కదా.. లాజికల్‌గా చెప్పాలంటారు. మేం కూడా చెప్పడానికి ట్రై చేస్తాం (నవ్వుతూ). అయితే కొన్నిసార్లు కొన్ని ఇష్యూల్లో నేనే స్టాండ్ తీసుకుంటాను. ►మ్యారీడ్ లైఫ్ గురించి మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. మరి.. వైవాహిక జీవితం ఇలా ఉంటే బాగుంటుంది? అని చెబుతూ ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నారా? అర్జున్: మా అమ్మాయితో నేను తీయబోతున్న సినిమాలో చాలా టిప్స్ చెప్పబోతున్నాను. జనరల్‌గా చెప్పాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే. ఎక్కడో పుట్టి ఎక్కడో ^è దువుకొని ఒకటవుతాం. మనస్తత్వాలు వేరయినా ఒకే ఇంట్లో ఉంటాం. విబేధాలు వస్తాయి. కొంచెం ఓపిక పడదాం, అడ్జస్ట్ అవుదాం అని అనుకోగలిగితే అంతా సవ్యంగా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నా అంగీకరిస్తాను అని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈగో, పొసెసివ్‌నెస్ ఉంటాయి. అప్పుడు మనల్ని అపరిమితంగా ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. నేను హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండేది నటనే అయినా తను భరించలేకపోయింది. అది నా మీద తనకున్న ప్రేమ అని అర్థం చేసుకున్నాను. నివేదిత: ఒకరికి ఒకరు స్పేస్ ఇవ్వాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. నమ్మకం, అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈగో అనేది దాంపత్యంలో అస్సలు వర్కౌట్ అవ్వదు. నా వరకూ నేను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను. ఈ ఇంట్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. అర్జున్: పెళ్లయ్యాక తన కుటుంబం, నా కుటుంబం అని ఉండకూడదు. మాకు ఆ భేదం లేదు. మా అమ్మగారు వాళ్ల అమ్మగారు ఇద్దరూ నాకు సమానమే. తనకూ అంతే. అత్తింటిని పుట్టిల్లు అని అమ్మాయి అనుకోవాలి. అబ్బాయి కూడా అలానే అనుకోవాలి. మేం అలానే అనుకున్నాం. నివేదిత: అది చాలా ఇంపార్టెంట్. అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు ఓ కారణం భర్త ఇంటివాళ్లను భార్య తనవాళ్లు అనుకోకపోవడం, భార్య కుటుంబాన్ని తన కుటుంబంలా భర్త అనుకోకపోవడమే. మా ఇద్దరికీ ఆ ప్రాబ్లమ్ లేదు. మాకు అందరూ సమానమే. – డి.జి. భవాని ►ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి. ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులుగా భయంగా ఉంటుందా? అర్జున్: అందరి తల్లిదండ్రులకు ఉన్నట్టే నాకూ భయం ఉంటుంది. మంచీ చెడూ అన్ని చోట్లా ఉన్నాయి. ఆడపిల్లలకు ప్రతిదీ చెబుతూ పెంచాలి. సెక్స్ అంటే వివరంగా చెప్పాలి. అందులో మంచి చెడ్డలు వివరించాలి. అప్పుడు అదేంటో తెలుసుకోవాలనే కంగారు ఉండదు. జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులకు ఇది కూడా ఓ బాధ్యతే. ప్రస్తుతం ఈ పాయింట్‌తోనే ఓ సినిమా చేస్తున్నాను. ఆడపిల్లలు ఆత్మరక్షణ నేర్చుకోవాలి. కరాటే నేర్చుకోవాలి. పెప్పర్ స్ప్రే ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. మనల్ని కాపాడటానికి ఎవరో వస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. నివేదిత: తల్లిదండ్రులు ఫ్రెండ్స్‌లా ఉన్నప్పుడే వాళ్లతో ఏదైనా మాట్లాడగలం. పేరెంట్స్‌కి పిల్లలు భయపడాలని కాదు. గౌరవం ఉండాలి. భయం కన్నా గౌరవం ఉన్నచోట తప్పులు చేయరని నా ఫీలింగ్. అందుకే మా పిల్లల్ని భయపెట్టం. స్నేహితుల్లా ఉంటాం. పిరికిగా ఉండకూడదని చెబుతుంటాం. ►ట్రిప్స్‌కి వెళ్తుంటారా? నివేదిత: చాలా ట్రిప్స్‌కి వెళ్లాం. తన షూటింగ్స్‌కి బ్రేక్ ఉన్నా, పిల్లలకి సెలవులొచ్చినా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం. ఆయన ఫారిన్లో షూటింగ్ చేసినప్పుడల్లా ఆయనతో కలిసి వెళ్లాం. ఈ మధ్య వెళ్లిన హాలిడే అంటే.. మాల్డీవ్స్. ఇప్పుడైతే ట్రావెల్ చేసే ఆలోచన లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి బాలేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. అందరూ వాటిని ఫాలో అవ్వాలి. పరిస్థితులన్నీ కుదుటపడే వరకూ జాగ్రత్తగా ఉందాం. అర్జున్: అవును.. వీలైనంతవరకూ ఇంట్లోనే ఉందాం. సమాజం మేలు కోసం మన వంతు సహాయం చేయాలి. ►అర్జున్‌గారు నటించిన చిత్రాల్లో ‘జెంటిల్‌మేన్’ ఒకటి. రియల్ లైఫ్‌లో ఆయన..? నివేదిత: నిజజీవితంలో వెరీ వెరీ జెంటిల్‌మేన్. మా పెళ్లైన కొత్తలో నా అభిప్రాయాలను ఎంత గౌరవించారో ఇప్పుడూ అంతే గౌరవిస్తున్నారు. స్వేచ్ఛ ఇస్తారు. నాకు కావల్సినవి వెంటనే సమకూరాయో లేదో చూసుకుంటారు. భర్తల్లో తక్కువమందికి ఈ క్వాలిటీ ఉంటుంది. స్త్రీల క్షేమం కోసం తన పరిధి దాటి సహాయం చేయడానికి వెనకాడరు. ►మరి మీ ఆవిడ గురించి? అర్జున్: షీ ఈజ్ బెస్ట్. బ్యూటిఫుల్, డ్యూటిఫుల్, రెస్పాన్సిబుల్ పర్సన్. నా జీవితంలో నేను కలిసిన ఏకైక నిజాయితీ గల వ్యక్తి. కుమార్తెలు అంజనా, ఐశ్వర్యలతో అర్జున్, నివేదిత -
ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత
అబ్బాయిది సౌత్. అమ్మాయిది నార్త్. మనసులు కలిశాయి. మనసులు కలిస్తే.. సౌత్, నార్త్ కలుస్తాయా?! ‘నో’ అన్నారు నమ్రత పేరెంట్స్. ఇటువైపు కూడా సేమ్ టు సేమ్.. ‘నో’! ఒక్క సినిమాతో ఒకటై పోయినవాళ్లు.. ఏడడుగులు వేయడానికి నాలుగేళ్లు ఆగారు. పదిహేనేళ్లయింది పెళ్లయి. ఆ పెళ్లి కళ ఇంకా అలాగే ఉంది. మహేశ్‌లో అదే సిగ్గు. నమ్రతలో అదే నవ్వు. భార్యాభర్తల్ని ఇంటర్వ్యూ చేసినట్లు లేదు. ఇద్దరు ప్రేమికులతో ముచ్చటించినట్లు అనిపించింది. మీ ఇద్దరూ కలిసి చేసింది కేవలం ఒక్క సినిమాయే (వంశీ). ఆ సినిమా చేసిన కొన్ని నెలల పరిచయంతోనే ‘లైఫ్ పార్ట్నర్గా తనే పర్ఫెక్ట్’ అనే నమ్మకం ఎలా కలిగింది? నమ్రత: ‘వంశీ’ సినిమా కోసం 52 రోజులు అవుట్డోర్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ పూర్తయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లే టైమ్ వచ్చింది. అప్పుడు ఒకరిని ఒకరం మిస్ అవుతాం అని అర్థమయిపోయింది. దూరం అవుతామనే ఆలోచనే భరించలేనిదిగా అనిపించింది. ఆ ఫీలింగ్ నుంచే పెళ్లి ఆలోచన వచ్చింది. అది కాకుండా మహేశ్ ప్రవర్తన చూసి నా జీవితాన్ని పంచుకోవడానికి తనే పర్ఫెక్ట్ అనిపించింది. మహేశ్: ఆ సినిమా కోసం ట్రావెల్ చేసిన ఆ కొన్ని రోజుల్లో నమ్రత బెస్ట్ బెటరాఫ్ అవుతుందని నాకూ అనిపించింది. ‘వంశీ’లో... ‘వంశీ’ ఫ్లాప్ సినిమా. కానీ మీ ఇద్దరినీ కలిపిన సినిమా? నమ్రత: అవును. మా ఇద్దరి కెరీర్లో నిరుత్సాహపరిచిన సినిమా అది. అయినప్పటికీ ‘వంశీ’ సినిమాకి మేం ఎప్పటికీ ధన్యవాదాలు చెబుతూనే ఉంటాం. మా ఇద్దరినీ కలిపిన ఆ సినిమా మాకెంతో ప్రత్యేకం. మీరు నార్త్.. మహేశ్‌గారు సౌత్. మరి ఇద్దరి ఇంట్లో మీ పెళ్లిని సులువుగా అంగీకరించారా? నమ్రత: నేను తనకి పర్ఫెక్ట్ భార్యని అవుతానని వాళ్ల ఫ్యామిలీని కన్విన్స్ చేయాలనుకున్నారు మహేశ్. అయితే వాళ్లు ఓకే చెప్పడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ నాలుగేళ్లు నేను ఓపికగా వెయిట్ చేశా. చేసుకుంటే మహేశ్నే లేకపోతే లేదు అని ఫిక్స్ అయ్యాను. మరి మీ పేరెంట్స్ ఈజీగానే ఒప్పుకున్నారా? నమ్రత: మా అమ్మానాన్న కూడా వెంటనే ఒప్పుకోలేదు. అయితే మహేశ్‌ని కలిసిన తర్వాత వాళ్లు ఫుల్ హ్యాపీ. మా పెళ్లికి అంగీకరించారు. మహేశ్‌గారు నటించిన ‘మురారి’లో పెళ్లి సీన్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. రియల్ లైఫ్‌లో మీది సింపుల్ వెడ్డింగ్.. అలా గ్రాండ్‌గా చేసుకుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? నమ్రత: మా పెళ్లి జరిగిన విధానం నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్‌గా జరిగినా మాకు బాగా సన్నిహితులైనవారి సమక్షంలో కూల్‌గా జరిగింది. అందుకే గ్రాండ్‌గా చేసుకుని ఉండాల్సింది అనే ఆలోచనే ఎప్పుడూ లేదు. ఈ నెల 10న మీ పెళ్లి రోజుని ఎలా జరుపుకున్నారు? నమ్రత: ఇంట్లోనే జరుపుకున్నాం. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్‌కి పంపి, ఎవరి వర్కౌట్స్ వాళ్లు చేసుకుని సాయంత్రం పిల్లలు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూశాం. పిల్లలిద్దరూ మా కోసం స్వయంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశారు. అది చాలా స్పెషల్‌గా, టచింగ్‌గా అనిపించింది. సాయంత్రం కుటుంబమంతా డిన్నర్‌కి వెళ్లాం, త్వరగానే తిరిగొచ్చాం. నెక్ట్స్ డే మా అబ్బాయి గౌతమ్, పాప సితార స్కూల్‌కి వెళ్లాలి కదా. మహేశ్: పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం బాగుంటుంది. అందుకే మ్యారేజ్ సెలబ్రేషన్ అంటే పిల్లలతో కలిసి బయటికెళ్లడమే. మీ పెళ్లయి పదిహేనేళ్లు పూర్తయ్యాయి.. నమ్రత: ఈ పదిహేనేళ్లల్లో మా ప్రేమ ఇంకా పెరిగింది. ప్రేమికులుగా ఉన్నప్పుడు, పెళ్లయిన కొత్తలో ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉంటున్నాం. ఈ పదిహేనేళ్ల జర్నీ సరదాగా, సంతోషంగా సాగిపోయింది. ఫ్యామిలీ లైఫ్ విషయంలో ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. మహేశ్: అలా అని అన్నీ హ్యాపీ మూమెంట్సే ఉన్నాయని చెప్పడం లేదు. వీటితోపాటు కొన్ని ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉన్నాయి. ఆనందాన్ని ఎలా పంచుకున్నామో బాధలను కూడా అలానే పంచుకుంటూ వస్తున్నాం. ఓవరాల్‌గా మాది బ్యూటిఫుల్ జర్నీ. పదిహేనేళ్ల వైవాహిక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుండిపోయే జ్ఞాపకాల గురించి? నమ్రత: చాలా ఉన్నాయి. పెళ్లయిన కొత్తల్లో మేం ఒక ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. ఆ రోజులు బెస్ట్. ఆ తర్వాత గౌతమ్ పుట్టడం ఓ మంచి అనుభూతి. ‘ఖలేజా’ ముందు మహేశ్ మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో మేం స్పెండ్ చేసిన టైమ్ బెస్ట్. పెళ్లయినప్పుడు ఉన్న ఫ్లాట్ నుంచి మేం కొత్తగా కట్టించుకున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడం ఓ మంచి మెమొరీ. ఆ తర్వాత సితార పుట్టడం ఇంకో మంచి అనుభూతి. యాక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా మహేశ్ మారడం.. ఇవన్నీ నాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్స్. మహేశ్: నిజానికి మా పెళ్లి తర్వాత తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి కుదరలేదు. ఆ మూడేళ్ల బ్రేక్ మా మంచికే. మా అబ్బాయి గౌతమ్‌తో ఎక్కువగా ఉండగలిగాను. ఆ బ్రేక్ నాకు రిఫ్రెషింగ్లా అనిపించింది. మీ మామయ్య కృష్ణగారి గురించి చెప్పండి? నమ్రత: మహేశ్ లైఫ్‌లో మామయ్యగారు స్ట్రాంగ్ ఫోర్స్. మా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఆయన ఓ బలం. మా అందరికీ ఆయనే స్ఫూర్తి. వాళ్ల కుటుంబంలోకి నన్నో కూతురిలా ఆహ్వానించారు. మామయ్యగారు నాకు తండ్రిలానే అనిపిస్తారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లను బాగా ముద్దు చేస్తారు. పిల్లలతో ఉన్నప్పుడు ఆయన కూడా పిల్లాడైపోతారు. మా అందర్నీ ముందుకు నడిపించేది మామయ్యగారే. ఆయన్నుంచి నేర్చుకున్న విషయాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్ అత్తగారు ఇందిర గారితో మీ అనుబంధం.. నమ్రత: ఇందిరమ్మగారు చిన్న పిల్లలాంటివారు. మా ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల ఆవిడే (నవ్వు). ఏ విషయాన్ని అయినా చిన్నపిల్లలానే డీల్ చేస్తారు. అందర్నీ చాలా ప్రేమగా చూస్తారు. పిల్లలతో, మహేశ్‌తో, నాతో భలే ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు నా మీద జోక్స్ చేస్తుంటారు. మామయ్యగారిలానే అత్తయ్యగారు కూడా నన్ను కూతురిలా చూసుకుంటారు. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అత్తయ్యవాళ్లు నన్ను చూసుకున్న విధానాన్ని మరచిపోలేను. నమ్రతగారిలో మీకు నచ్చిన లక్షణాలేంటి? మహేశ్: తన సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సందర్భంలో అయినా తను తనలానే ఉంటుంది. ముఖ్యంగా తనలో నెగటివ్ ఆలోచనలు ఉండవు. అది చాలా చాలా పాజిటివ్ విషయం. చాలా కైండ్ పర్సన్. అలాగే అవసరమైనప్పుడు చాలా స్ట్రిక్ట్ కూడా. నమ్రత చాలా నిజాయితీ గల మనిషి. మరి మహేశ్గారిలో మీకు నచ్చే విషయాలు? నమ్రత: ఆయనలో అమాయకత్వం ఉంది. అలాగని అమాయకుడు కాదు. సున్నిత మనస్కుడు. ఫ్యామిలీని తను ప్రేమించే విధానం సూపర్బ్. తనది స్వచ్ఛమైన మనసు. ఆయన స్వభావం చాలా మంచిది. ఇంకా మహేశ్‌లో నచ్చే విషయాలు చాలా చాలా ఉన్నాయి. పెళ్లి చేసుకుని సినిమాలు మానేశారు. ఆ విషయంలో ఏదైనా అసంతృప్తి ఉందా? కమ్‌బ్యాక్ లాంటిది ఏమైనా ఊహించొచ్చా? నమ్రత: పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్నది నా సొంత నిర్ణయమే. ఆ నిర్ణయం సరైనది కాదు అని ఒక్క నిమిషం కూడా అనిపించలేదు. మహేశ్ నాకు మంచి జీవితాన్నిచ్చారు. ఇంతకు మించి నాకేం కావాలి? మహేశ్, పిల్లలు నా ప్రపంచం. వీళ్లు కాకుండా నాకు వేరే ఏ ఆనందాలూ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఈ జీవితం కాకుండా నాకు వేరే జీవితం కూడా అవసరం లేదు. ఒక భార్యగా, తల్లిగా నమ్రత ఎలా ఉంటారు? మహేశ్: మదర్‌గా నమ్రత అమేజింగ్. వంక పెట్టే పనిలేదు. ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులూ తనకి ఇచ్చేయొచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు స్ట్రిక్ట్‌గా ఉండాలి కదా. తను స్ట్రిక్ట్ మదర్. ఇక భార్యగా నమ్రత గురించి చెప్పాలంటే.. చాలా చాలా గొప్ప భార్య. తను లేకపోతే నేను లేను. నా బెస్ట్ ఫ్రెండ్, నా సపోర్ట్ సిస్టమ్ అన్నీ తనే. నా జీవితాన్ని చాలా సులువుగా మార్చడం తనకి మాత్రమే తెలుసు. నమ్రతగారిని మీ అమ్మగారితో పోల్చమంటే... మహేశ్: ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన స్త్రీలు ఉంటారు. నా జీవితంలో మా అమ్మ, నా భార్య ముఖ్యమైన స్త్రీలు. వాళ్లు నా సర్వస్వం. అలాగే నా పిల్లలు కూడా. నాకు తెలిసి మా అమ్మగారిలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. కచ్చితంగా ఉండరు. నా భార్య విషయంలో కూడా ఇదే చెబుతాను. నమ్రతలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. నా జీవితంలో వీళ్ల స్థానాల్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అంత ముఖ్యమైన వాళ్లు నాకు. తండ్రిగా మహేశ్ ఎలా ఉంటారు? నమ్రత: కొడుకుగా, భర్తగా, తండ్రిగా మహేశ్ ది బెస్ట్. ఎటువంటి సందర్భాల్లో అయినా మాకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఇస్తారు కూడా. మహేశ్‌గారు డామినేటింగ్‌గా ఉండరనే అనుకుంటున్నాం. మీ ఇంట్లో డామినేషన్ ఎవరిది? నమ్రత: మా ఇద్దరిలో ఎవరో ఒకరు డామినేటింగ్‌గా ఉంటారని చెప్పలేం... సమానంగానే ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో తనే గెలుస్తారు (నవ్వుతూ). మహేశ్ నుంచి మీరందుకున్న బెస్ట్ గిఫ్ట్? నమ్రత: రొటీన్‌గా అనిపించొచ్చు కానీ మహేశ్ నుంచి నేనందుకున్న బెస్ట్ గిఫ్ట్ నా పిల్లలు. మహేశ్: నా బలం నా ఇల్లు. ఇంట్లో ఆనందం దొరికితే ఇక దానికి మించిన గిఫ్ట్ ఉండదు. ఆ విధంగా ఐయామ్ హ్యాపీ. పిల్లలు ఏది అడిగితే అది కొనిస్తారా? ఎవర్ని అడుగుతారు? నమ్రత: పిల్లలకి ఏం కావాలన్నా మహేశ్ దగ్గరకు వెళ్తారు. ఎందుకంటే నో అనరు కాబట్టి. నేను మాత్రం అది నిజంగా అవసరం అయితేనే ఓకే అంటాను. లేదంటే నో... నో... అంతే. సో.. నేనే స్ట్రిక్ట్. పిల్లలు భవిష్యతులో ఇలా స్థిరపడితే బాగుంటుంది అని డిస్కస్ చేస్తుంటారా? పెద్దయ్యాక గౌతమ్, సితార ఏం కావాలనుకుంటున్నారు? మహేశ్: ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం కావాలనుకుంటున్నారో అది వాళ్ల ఇష్టం. మేం డిసైడ్ చేయదలచుకోలేదు. అయితే వాళ్లు ఏం చేసినా హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాం. మహేశ్‌కి చాలా సిగ్గు. హీరోయిన్స్‌తో కూడా సరిగ్గా మాట్లాడరు అని ఓ సందర్భంలో అన్నారు. ఆ స్వభావమే భార్యగా మిమ్మల్ని సెక్యూర్‌గా ఉంచిందా? నమ్రత: అలా ఏం కాదు. తన కో–స్టార్ట్స్‌తో చాలా కంఫర్ట్‌బుల్‌గానే ఉంటారు. మహేశ్ చుట్టూ ఎవరున్నా... ఎంతమంది ఉన్నా నేను భయపడటానికి వీలు లేనంత భరోసా ఇచ్చారు. తన ప్రవర్తనతో నమ్మకం కలిగిస్తారు. ఆ ధైర్యం కలిగించడం చాలా మఖ్యం. వంట విషయంలో మహేష్‌గారు ఏమైనా సహాయం చేస్తుంటారా? నమ్రత: మహేశ్‌కి వంట రాదు. నాక్కూడా అనుకోండి (నవ్వుతూ). సో.. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేయడం లాంటివి ఏమీ జరగలేదు. మంచి వంట మనిషి ఉన్నారు. సక్సెస్ఫుల్ మ్యారేజ్‌కి మీరిచ్చే టిప్స్? మహేశ్: హ్యాపీ మ్యారేజ్ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. ప్రతీ భార్యాభర్త ఈక్వేషన్ ఒకలా ఉండదు. ఒక్కో కపుల్‌ది ఒక్కోలా ఉంటుంది. టిప్స్ అని చెప్పలేను కానీ సక్సెస్ఫుల్ రిలేషన్‌కి నమ్మకం, బలమైన స్నేహం ముఖ్యం. మా రిలేషన్లో అదే ఫాలో అవుతాం. నమ్రత: ఒకరి మీద ఒకరికి నమ్మకం, స్నేహం, కుటుంబ బంధాల మీద మా రిలేషన్షిప్ ఆధారపడి ఉంది. మా పిల్లలు కూడా కుటుంబ బంధాలు, విలువలు బాగా నమ్మాలని, పాటించాలని, సాధారణమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అభిమానుల గురించి కూడా చెప్పాలని ఉంది. మా కుటుంబం మీద చాలా మంది అభిమానుల ఆశీస్సులు ఉండటం మా అదృష్టం. మామయ్యగారు, మహేశ్‌గారి అభిమానులు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. మార్కుల విషయంలో మీ ఇద్దరూ లిబరల్గానే ఉంటారా? నమ్రత: ఇంట్లో ఉంటాను కాబట్టి పిల్లల స్టడీస్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాది. అయితే మహేశ్‌కి కూడా చాలా ఇంట్రస్ట్. స్కూల్లో ఏం చేస్తున్నారు? ఎలా చదువుకుంటున్నారు? అనేవి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకుంటారు. మహేశ్: మార్కుల గురించి ఇద్దరం పెద్దగా పట్టించుకోం. బాగా మార్కులు రావాలని పిల్లలను ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని మా ఫీలింగ్. అయితే బాగా చదువుకోవాలని, వీలైనంత హార్డ్‌వర్క్ చేయాలని చెబుతాం. – డి.జి. భవాని -
ఎవరి సత్తా ఏంటో గల్లీలో తేలుతది
తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలు కావాలన్న గిరిజనుల ఆశలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు దక్కుతుంది. వికేంద్రీకరణ ద్వారానే పాలనా ఫలితాలు సామాన్యుల వరకు చేరతాయనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది. గతంలో కలెక్టర్ల దగ్గరకు ప్రజలు, అధికారులు వెళ్లాలంటే 60–100 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజల ముంగిట్లోకి అధికారులను తీసుకొచ్చాం. గతంలో కార్పొరేషన్లు అంటే హైదరాబాద్ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు వరంగల్‌కు రూ. 300 కోట్లు, ప్రతి కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ఇస్తున్నాం. కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు పెట్టి ఇస్తున్న కొత్త సంస్కృతిని తెచ్చింది... పట్టణ ప్రాంతాలను ప్రగతిబాట పట్టించింది టీఆర్ఎస్సే. మేమెవరికీ బీ–టీం కాదు.. తెలంగాణ ప్రజలకు ఏ–టీం. మాకు ఢిల్లీలో బాసులు లేరు. గల్లీలో జరిగే ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉంటారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. పాలనాదక్షుడైన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించే రాష్ట్ర ప్రజలు ఎప్పటిలాగే ఈసారి కూడా తమకు అండగా ఉండి ఘన విజయం చేకూరుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ బీ–ఫారాల కోసం అభ్యర్థులు పోటీ పడుతుంటే ప్రతిపక్షాల తరఫున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు దొరకలేదంటేనే ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ గింజుకున్నా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మొత్తుకున్నా గెలిచేది తామేనని వ్యాఖ్యానించారు. పట్టణాలను ప్రగతిబాట పట్టించింది... కార్పొరేషన్లకు బడ్జెట్ ద్వారా నిధులు తెచ్చే సంస్కృతిని తెచ్చింది కూడా టీఆర్ఎస్సేనన్నారు. గత ఐదున్నరేళ్లలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని, అధికార వికేంద్రీకరణ ద్వారా గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. ప్రణాళికాబద్ధమైన పురోగతి, పచ్చదనంతో కూడిన పట్టణాలు, పారిశుద్ధ్యం, పారదర్శక పౌర సేవలే లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు, ఆశీర్వాదం అందించాలని కేటీఆర్ కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో కేటీఆర్ ఏమన్నారంటే... క్షేత్రస్థాయికి అధికార వికేంద్రీకరణ... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 68 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు మాత్రమే ఉండేవి. కానీ రాష్ట్రం ఏర్పాటే పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసం జరిగింది కనుక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాం. కొత్త రాష్ట్రమే కాదు... కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. దశాబ్దాలుగా ప్రజలు ఆశించిన సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, మంచిర్యాల లాంటి ప్రాంతాలను జిల్లాలు చేశాం. మా తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలు కావాలన్న గిరిజనుల ఆశలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు దక్కుతుంది. వికేంద్రీకరణ ద్వారానే పాలనా ఫలితాలు సామాన్యుల వరకు చేరతాయనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది. అందుకే 68గా ఉన్న పురపాలికల సంఖ్యను 141కి పెంచాం. అధికారులను ప్రజల ముంగిటికి తెచ్చాం తెలంగాణ వచ్చాక తొలిసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలివి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏం జరిగిందన్నది పరిశీలిస్తే మేమెప్పుడూ నేల విడిచి సాము చేయలేదన్నది అర్థమవుతుంది. ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన, పౌర సేవలపైనే దృష్టి పెట్టి పనిచేశాం. జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ములుగు లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో జిల్లాల ఏర్పాటు తర్వాత గణనీయ అభివృద్ధి జరిగింది. ఇది మన కళ్ల ముందే ఉంది. మేమెప్పుడూ ఆకాశంలో విహరించలేదన్న దానికి మరో ఉదాహరణగా మరో విషయం చెప్పుకోవచ్చు. గతంలో కలెక్టర్ల దగ్గరకు ప్రజలు, అధికారులు వెళ్లాలంటే 60–100 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజల ముంగిట్లోకి అధికారులను తీసుకొచ్చాం. గతంలో కరెంటు కోతలు, 14 రోజులకోసారి మంచినీళ్లు వచ్చే ప్రాంతాలు కూడా ఉండేవి. గుక్కెడు నీళ్ల కోసం సామాన్యుడి గొంతెండిన రోజులు చూశాం. కానీ ఇప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. ప్రతిరోజూ లేదా మరుసటి రోజు నీళ్లు వస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఉత్తమ పాలనా భవన ప్రాంగణాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు వచ్చాయి. గతంలో ట్యాంక్‌బండ్ అంటే హైదరాబాద్ మాత్రమే ఉండేది. ఇప్పుడు నాగర్ కర్నూల్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట... ఇలా చెప్పుకుంటూ పోతే 90 పట్టణాల్లో మినీ ట్యాంక్బండ్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా రూ. 2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. గతంలో కార్పొరేషన్లు అంటే హైదరాబాద్ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు వరంగల్‌కు రూ. 300 కోట్లు, ప్రతి కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ఇస్తున్నాం. కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు పెట్టి ఇస్తున్న కొత్త సంస్కృతిని తెచ్చింది... పట్టణ ప్రాంతాలను ప్రగతిబాట పట్టించింది టీఆర్ఎస్సే. సమ ప్రేమ... సమ న్యాయం పరిపాలనలో మేమెప్పుడూ వివక్ష చూపించలేదు. వివక్ష, పక్షపాతం లేకుండా పనిచేశాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు అన్ని ప్రాంతాల్లో అమలు చేశాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత గింజుకున్నా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఎంత మొత్తుకున్నా ఎవరికి ఓట్లేస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు తెలుసు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు ఘన విజయాన్ని కట్టబెడతారన్న విశ్వాసం ఉంది. మా ప్రత్యర్థులకు పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేరు. 700 వార్డుల్లో బీజేపీ, 400 వార్డుల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదంటేనే ప్రజల మూడ్ అర్థం చేసుకోవచ్చు. నేను అహంకారంతో ఈ మాటలు చెప్పడం లేదు. కాంగ్రెస్, బీజేపీలు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులకు పొంతన లేదని చెబుతున్నా. క్షేత్రస్థాయిలో బలముంటేనే ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకొస్తారు. మా బీ–ఫారాల కోసం పోటీ పడుతూ ఇతర పార్టీల బీ–ఫారాలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే అర్థం ఏమిటి? మా పార్టీ తరఫున కూడా 95 శాతం రెబెల్స్ తగ్గిపోయారు. మేం చేసిన కృషి ఫలితం కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులపై పోటీలో ఉండే రెబెల్స్ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తాం. శ్వేతపత్రం ఇవ్వమనండి... రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా మాట్లాడుతున్నాయి. మేం అధికారంలోకి రాకముందు పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పదేళ్లలో ఎన్ని నిధులిచ్చారో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని శ్వేతపత్రం విడుదల చేయమనండి. మేం ఈ ఐదున్నరేళ్లలో ఎన్ని నిధులిచ్చామో చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇచ్చాం. గత ఐదేళ్లలో కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో ఎన్ని మున్సిపాలిటీలను ఉద్ధరించిందో బీజేపీ నేతలను చెప్పమని ప్రశ్నిస్తున్నా. ఎవరేం చేశారో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. టీఆర్ఎస్ కేంద్రంగానే ఎన్నికలు... ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కేంద్రంగానే జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు మాపై చేసే విమర్శలు చూస్తుంటే వారి ఆలోచనలన్నీ మా చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. మేమెవరికీ బీ–టీం కాదు.. తెలంగాణ ప్రజలకు ఏ–టీం. మాకు ఢిల్లీలో బాసులు లేరు. తెలంగాణ గల్లీలో జరిగే ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. మేం బీజేపీని చూసి భయపడుతున్నామని లక్ష్మణ్ అంటున్నారు. 104 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు రానందుకు, 700 మంది అభ్యర్థులు దొరకనందుకు మేం బీజేపీని చూసి భయపడుతున్నామా? అతిగా ఊహించుకోవడం మంచిది కాదు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో నాలుగు ఎంపీ సీట్లు వస్తేనే ఎగిరెగిరి పడుతున్నారు. మరి అక్కడే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదు? నేను గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా. 1980–90లలో నేను స్కూల్లో ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటో ఇప్పుడూ అదే పరిస్థితి. అందుకే మా ప్రత్యర్థి కాంగ్రెస్ అని చెబుతున్నా. బీజేపీని ఎక్కువ, తక్కువ చేయడం లేదు. అయితే కాంగ్రెస్ మాకు సుదూరంలో ఉంది. దాని వెనుక బీజేపీ ఉంది. అట్టహాసం వద్దని సీఎం చెప్పారు ఈ ఎన్నికలు మా పనితీరుకు నిదర్శనమని నేను చెబితే అలాంటప్పుడు ప్రచారానికి వెళ్లొద్దని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటలను ఆహ్వానిస్తున్నా. నేనెక్కడికీ ప్రచారానికి వెళ్లడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, నేతలే అంతా చూసుకుంటారు. సిరిసిల్ల, వేములవాడల్లో మాత్రమే నేను ప్రచారం చేస్తా. 50–60 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించినా నేను వెళ్లడం లేదు. ఆర్భాటం, అట్టహాసం వద్దని సీఎం స్వయంగా చెప్పారు. ఇంటింటి ప్రచారం చేయాలని, చేసిన పనిని చెప్పాలని సూచించారు. అదే చేస్తాం. అయినా మాకు విశ్వాసం ఉంది. కేసీఆర్ స్థిరమైన, దృఢమెన, దక్షుడైన నాయకుడని ప్రజలకు తెలుసు. ప్రణాళికాబద్ధమైన పురోగతి, పచ్చదనంతో కూడిన పట్టణాలు, పారిశుద్ధ్యం, పారదర్శక పౌర సేవలే లక్ష్యంగా పనిచేస్తున్న మాకు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నా. తెలంగాణ భవన్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పతంగి ఎగురవేస్తున్న కేటీఆర్ దుబారా తగ్గించాం... పురపాలక సంస్థలకు ఆర్థిక స్వావలంబన సమకూర్చడమే కాకుండా దుబారా ఖర్చు తగ్గించేందుకు విప్లవాత్మక మార్పులు చేశాం. ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లు, రాష్ట్రవ్యాప్తంగా 3.75 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి కరెంటు ఖర్చును 35–40 శాతం తగ్గించాం. మున్సిపాలిటీల ఆర్థిక పరపతి పెంచాం. విద్యుత్ ఆదాలో తెలంగాణ మున్సిపాలిటీలు టాప్ అని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖే చెప్పింది. చెరువులు, పార్కులు, రోడ్లు, కరెంటు, మంచినీరు, పారిశుద్ధ్యం విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతోందో కాంగ్రెస్, బీజేపీలు ఆలోచించుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని తీసుకెళ్లింది మేమే. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ఐటీ టవర్లు ఏర్పాటవుతున్నాయంటే అది టీఆర్ఎస్ సాధించిన విజయం కాదా? వికేంద్రీకరణ ఫలితం కాదా? సీఎం కేసీఆర్ కార్యదక్షత కాదా? పల్లె ప్రగతికి దీటుగా... నేను మున్సిపల్ మంత్రిగా చెబుతున్నా. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పల్లె ప్రగతికి దీటుగా ‘పట్టణ ప్రగతి’కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తాం. రాష్ట్రంలోని గ్రామాలకు నెలకు ఠంచనుగా రూ. 339 కోట్లు ఇస్తున్న విధంగానే పట్టణాలకు కూడా నిధులిస్తాం. కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తాం. సరిగ్గా విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటాం. విధుల నుంచి తొలగించే కార్యక్రమాన్ని టీఆర్ఎస్తోనే ప్రారంభిస్తాం. అధికారులు కూడా పారదర్శకంగా పనిచేయాలి. లేదంటే సర్వీసు నుంచి డిస్మిస్ చేసేంత వరకు వెళ్తాం. ఈ ఎన్నికల తర్వాత ఇక ఎన్నికలు లేవు. రానున్న నాలుగేళ్లు నా దృష్టంతా పరిపాలన.. పురపాలనపైనే. కెలికి కయ్యం పెట్టుకుంది చంద్రబాబే... తెలుగు రాష్ట్రాలనే కాదు... పొరుగు రాష్ట్రాలన్నింటితో మేం సఖ్యతగానే ఉంటున్నాం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఇక్కడా కాంగ్రెస్ పార్టీ అ«ధికారంలో ఉన్నా గోదావరి జలాల వినియోగంలో మనకు న్యాయం జరగలేదు. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా వారితో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం. వెయ్యి మెగావాట్ల విద్యుత్ తెచ్చుకున్నాం. లివ్.. లెట్ లివ్ విధానం మాది. అది కేసీఆర్ రాజనీతిజ్ఞత. చంద్రబాబుతో కూడా మేం సత్సంబంధాలనే కోరుకున్నాం. గిల్లికజ్జాలు పెట్టుకోవాలనుకోలేదు. అమరావతికి పిలిస్తే వెళ్లాం. తెలంగాణలో యాగానికి ఆహ్వానించాం. కానీ కెలికి కయ్యం పెట్టుకుంది చంద్రబాబే. ఓటుకు నోటుతో ఎమ్మెల్సీని కొనాలని రూ. 50 లక్షలిస్తూ దొరికిపోయాడు. కానీ తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా కలసి ఉండాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో కూడా అవే సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇది కొందరికి నచ్చడం లేదు. అది వారి ఖర్మ. మేం చేయగలిగిందేమీ లేదు. -
రౌడీషీటర్లలో మార్పునకు కౌన్సెలింగ్
సాక్షి, తిరుపతి : ‘‘నేరాల నియంత్రణకు నిరంతరం నిఘా ఉంచుతాం..తిరుమల–తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పంచాయితీలు చేసే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తాం..అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు..’’ అని అర్బన్Œ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ స్పష్టం చేశారు. తిరుపతితో పాటు తిరుమల భద్రత, ట్రాఫిక్, భూకబ్జాలు, ఎరచ్రందనం అక్రమ రవాణా అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే ... సాక్షి : తిరుమల, తిరుపతిలో నిఘాను ఎలా బలోపేతం చేస్తారు? ఎస్పీ : తిరుమల, తిరుపతిలో నిరంతరం నిఘా పటిష్టంగా ఉంచుతాం. ఇప్పటికే నగరంతోపాటు తిరుమలలో సీసీ కెమెరాల నిఘా ఉంది. నిరంతరం బ్లూకోల్ట్స్ రక్షక బృందాలు పట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. రాత్రి పూట అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచుతున్నాం. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశాం. సాక్షి :భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ : శ్రీవారి భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తాం. ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం వంటి వసతి గృహాలు, నగరంలోని చారిత్రాత్మక ఆలయాల వద్ద నిరంతరం పోలీసుల నిఘాతో పాటు పట్రోలింగ్ ఉంటుంది. సాక్షి :పెరిగిపోతున్న దొంగతనాలకు ఎలా అడ్డుకట్ట వేస్తారు? ఎస్పీ : గతంలో కంటే దొంగతనాలు బాగా తగ్గాయి. దొంగలపై నిరంతరం నిఘా ఉంచి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ప్రతి ఇంటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. సాక్షి :తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.. ఎస్పీ : ట్రాఫిక్ నియంత్రణకు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జనవరి ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అంతవరకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. సాక్షి : ఈ– చలానాలు సక్రమంగా కడుతున్నారా..? ఎస్పీ : నగరంలో ఇప్పటి వరకు రూ.1,37,229 చలానాలు నమోదు చేశాం. ఇందులో 45,922 వసూలయ్యాయి. మిగిలినవన్నీ ఇప్పటి వరకు వసూలు కాలేదు. వాటిపై దృష్టి సారిస్తున్నాం. ఇందులో పది కన్నా ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలు 51 ఉన్నట్టు గుర్తించాం. ఇందులో 22 వాహనాలు పూర్తిస్థాయిలో చలానాలు చెల్లించాయి. మరో 29 వాహనాలు చెల్లించాల్సి ఉంది. వీరు ఈనెల 25వ తేదీలోపు చెల్లించాలి. లేనిపక్షంలో వారి ఇంటికి వెళ్లి వాహనాలు సీజ్ చేస్తాం. సాక్షి : రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి? ఎస్పీ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. హైవేలలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేస్తాం. సాక్షి : ఎరచ్రందనం స్మగ్లర్లను ఎలా కట్టడి చేస్తారు? ఎస్పీ : ఇప్పటికే అర్బ¯న్ జిల్లాలో ఎరచ్రందనం అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిని మరింత పటిష్టం చేసి, స్మగ్లర్లను కట్టడి చేస్తాం. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. వారు పరివర్తన చెందేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అలాగే వీరి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాం. సాక్షి : మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు? ఎస్పీ :కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాలలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. నిరంతర మహిళా రక్షకులతో ఆకతాయిల భరతం పడతాం. సాక్షి : తిరుపతిలో భూ వివాదాల మాటేమిటి? ఎస్పీ : భూ వివాదాలకు కారకులైన వారిని గుర్తించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. -
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి
‘రాహుల్ సిప్లిగంజ్ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసింద’ని చెప్పింది బిగ్‌బాస్–3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ రెండున్నర నెలలు కుటుంబం, స్నేహితులను బాగా మిస్ అయ్యానని తెలిపింది. వైల్డ్‌కార్డు ఎంట్రీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ ఆనందంగా వెళ్తానని పేర్కొంది. ఒకవేళ హౌస్‌లో ఉండి ఉంటే తప్పకుండా విన్నర్ అయ్యేదాన్నని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంది. ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు.. పదకొండు వారాలు.. పరిచయం లేని ముఖాల మధ్య ఉండటం.. ఫోన్ లేదు.. పుస్తకాల్లేవ్.. టీవీ లేదు.. కుటుంబ సభ్యులను కలవడానికి వీల్లేదు.. బిగ్‌బాస్–3 హౌస్‌లో ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వమున్న ఆమె రెండున్నర నెలల పాటు తన హావభావాలు, అందచందాలు, మాటతీరు, ఆటపాటలతో వీక్షకులను కట్టిపడేసింది. బిగ్‌బాస్ టాప్–5లో నిలుస్తానని భావించింది. ఓట్లు రాకపోవడమో, మాటతీరో, ముక్కుసూటితనమో తెలియదు గానీ మూడు వారాల ముందే ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం మళ్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది బిగ్‌బాస్– 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం. ఆమె ఇటీవల హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో తన అనుభవాలు.. తోటి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్‌తో స్నేహం తదితర అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే.. - పురుమాండ్ల నరసింహారెడ్డి కుటుంబాన్ని మిస్సయ్యా.. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్వని అన్నారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తాను. మూడు వారాల్లో ముగిసే సమయంలో ఎంట్రీ వస్తే నేను వెళితే మిత్రులు హ్యాపీగా ఫీలవుతారు. టైటిల్ విన్నర్ అయ్యేదాన్నేమో.. అలాగే ఉండి ఉంటే టైటిల్ విన్నర్ అయ్యేదాన్నేమో. టాప్– 5లో మాత్రం ఉండేదాన్నని అనుకుంటున్నా. ఇదొక జీవితానుభవం. 11 వారాలు 23 ఏళ్ల వయసులో అంతమంది మైండ్‌సెట్‌తో కలిసి ఉండటం గొప్ప విషయమే. వరుణ్, వితిక నామినేట్ చేసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాను. నామినేట్ చేసినా సరే నాకు కోపం రాలేదు. ఇప్పటికీ వారిద్దరిపై స్నేహభావమే ఉంది. ఎలిమినేట్ అయ్యేదాకా ఆ ముగ్గురితో స్నేహం బలంగా ఉండేది. నా కోసం రాహుల్ త్యాగం చేయడం బాధ కలిగించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. రెండున్నర నెలల బిగ్‌బాస్ షోలో ఉండటం ఓ చాలెంజ్. బయటికి రాగానే ముందుగా డేట్.. ఆ రోజు ఏమిటని అడిగా. ఫోన్ చూడగానే పాస్వర్డ్ మరిచిపోయా. ఆ తర్వాత మెసేజ్‌లు చూశా. చాలా మెసేజ్‌లు వచ్చాయి. బయటికి రాగానే ముందుగా డేట్ అండ్ టైమ్ అడిగాను. నా బాడీ, మైండ్ చెక్ చేసుకున్నా. ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా సపోర్ట్ వచ్చింది. వరుణ్, వితిక, రాహుల్, నేను మంచి స్నేహితులం. బిగ్బాగ్ హౌస్‌లోకి వెళ్లాక మూడు వారాలు చాలా ఇబ్బందిపడ్డాను. రిజర్వ్‌గా ఉండేదాన్ని. మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మైండ్‌సెట్‌కు తగినట్లుగా ప్రవర్తించడం మొదలెట్టాను. అందరితో సన్నిహితంగా మెలిగాను. ఒక కుటుంబంగా భావించి అందరితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకున్నాను. అందులో ఈ ముగ్గురితో బాగా అనుబంధం ఏర్పడింది. అందులో పుస్తకాలు ఉండవు. ఫోన్లు ఉండవు. టీవీ ఉండదు. పత్రికలు ఉండవు. ఉండేదల్లా కథలు చెప్పుకోవడం, టాస్క్‌ల గురించి ఆలోచించడం. తప్పితే ఇంకో వ్యాపకం ఉండేది కాదు. చాలా ఎడిట్ చేసి గంట మాత్రమే ప్రసారం చేస్తారు. ఆ ముగ్గురు టాప్– 5లో ఉంటారు.. బిగ్‌బాస్– 3 టాప్– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్‌లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశాను. ప్రస్తుతం చదువు, సినిమాలే.. నేను తెనాలిలో పుట్టి పెరిగాను. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశాను. విల్లామేరీ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం చేశా. చదువులో ఉండగానే ‘ఉయ్యాల..జంపాల’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నా సినిమా జర్నీ మొదలైంది. అమెరికాలో మా అక్క వద్ద ఉన్నప్పుడే బిగ్‌బాస్ సీజన్– 2లో అవకాశం వచ్చినా కుదరలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్– 3లో అవకాశం వచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా చదువు, సినిమాలపైనే. పెళ్లి ఆలోచన లేదు. ఒకవేళ నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని ఒప్పించి చేసుకుంటా. వారు వద్దంటే ఊరుకుంటా. వారు చూసిన సంబంధం కూడా ఇష్టమే. అయితే పెళ్లికి మరో ఐదారేళ్ల సమయముంది. అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం సైకిల్, చిన్న విరామం సినిమాల్లో నటిస్తున్నాను. అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌తో ఓ సినిమా అవకాశం వచ్చింది. కథలు వింటున్నాను. ప్రస్తుతం యాక్టింగ్, చదువుపైనే దృష్టి కేంద్రీకరించా. -
సై సైరా... భయ్యా!
150 సినిమాల రిలీజులు చూశారు కాబట్టి మీకు రిలీజ్లు కొత్త కాదు. అయినా 151వ సినిమా ‘సైరా’ రిలీజ్ అంటే ఏమైనా టెన్షన్‌గా ఉందా? చిరంజీవి: నిజం చెప్పాలంటే ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకులు దీనిని ఎలా ఆదరిస్తారు? మనం అనుకున్నది కాకుండా ఊహించని విధంగా ఏదైనా స్పందిస్తారా? వంటి సంశయాలు ఎప్పుడూ ఉంటాయి. టెన్షన్ అనను కానీ ఆత్రుత, ఉద్వేగం వంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కొన్ని సినిమాలకు ‘ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. అలా ఈ సినిమాకు అనిపిస్తోంది. ఈ సినిమా కథ చాలా నమ్మకం కలిగించింది. ఆ నమ్మకమే ధైర్యంగా ఉండేలా చేసింది. గుర్రపు స్వారీలు మీకు అలవాటే. కత్తి యుద్ధాలు మొదటిసారి చేశారు కదా... ఎలా అనిపించింది? నేనెప్పుడూ కత్తి యుద్ధాలు చేసింది లేదు. భరతనాట్యం నేర్చుకోలేదు. కానీ చూసి, గమనించి చేసేవాణ్ణి. అలా బాగా డ్యాన్స్ చేయడం అలవాటైంది. కత్తి యుద్ధాలు, జానపద సినిమాలు చేసింది లేదు. మాస్టర్స్ చేసి, చూపించారు. అది చూసి నేర్చుకుని చేసేశాను. కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. ఒక్క ఫ్లాప్ కెరీర్‌ని నిర్ణయించే వృత్తి మీది. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మీరేమంటారు? ఈ వృత్తిలో ఎన్ని ప్లస్సులున్నాయో అన్ని మైనస్సులూ ఉన్నాయి. ఇదే కాదు ఏ ప్రొఫెషన్లో అయినా ప్లస్సు, మైనస్సు కచ్చితంగా ఉంటాయి. చాలెంజ్‌లను అధిగమిస్తూ విజయాలు సాధించగలిగితేనే నువ్వు ముందుకు వెళ్లగలుగుతావు. ఇక్కడ సక్సెస్ రావాలంటే మనల్ని ముందుకు నడిపించేది కథ. ఆ కథలో కూడా కీలకమైనది ‘ఎమోషన్’ అని అంటాను నేను. ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా తీయగలిగితే సినిమా మీద కచ్చితంగా ధైర్యంగా, నమ్మకంగా ఉండొచ్చు. నేను కథలు వినేప్పుడు కూడా కామెడీ సీన్లు ఎన్ని ఉన్నాయి? డ్యాన్స్‌లు చేయడానికి స్కోప్ ఉందా? అని ఆలోచించను.హృదయాలను కదిలించే ఉద్వేగం ఉందా? లేదా అని చూసుకుంటాను. కంట తడిపెట్టించే సీన్స్ కొన్నయినా ఉండాలి. లేకపోతే ఎందుకు చూడాలి? మీరిచ్చే హంగులు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. ప్రస్తుతం అందరికీ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. దాన్ని మించి నువ్వు మాకు ఏమి ఇస్తున్నావు? అనే ప్రేక్షకుడి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. ఆ సమాధానం మంచి కథ. ఇక ఎంతోమంది అభిమానులను ఇచ్చిన ఈ వృత్తికి ఎందుకు వచ్చాం అనే ఫీలింగా? నో చాన్స్. అది ఎప్పటికీ ఉండదు. డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నుంచి ఆడియన్స్‌ని డైవర్ట్ చేయాలంటే మంచి కథ ఉన్న సినిమాలు ఇవ్వాలన్నారు. డిజిటల్ ముందు సినిమా స్కేల్ ఏమైనా తగ్గిందంటారా? ఆ స్కేల్ ఇంకా పెరిగిందంటాను. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నాను. స్మార్ట్‌ఫోన్ రూపంలో మన చేతిలోనే ఇంత కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మించి మనం ఏం ఇవ్వగలం అనే ఆలోచనతో కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. నూతన దర్శకులు అలా ఆలోచించబట్టే కొత్త సబ్జెక్ట్‌లు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు, కేరాఫ్ కంచెరపాలెం’ అన్నీ సక్సెస్ అయ్యాయి. డిజిటల్ ఎప్పుడూ సినిమాకు పోటీ కాదు. అయితే ది బెస్ట్ దిశగా ఆలోచింపజేస్తుంది. బెస్ట్ సినిమాలు వచ్చేందుకు స్కోప్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి ఆర్టిస్ట్‌లను చూస్తే ఈర్ష్యగా ఏమైనా అనిపిస్తోందా? మీ టైమ్‌లో యాక్షన్‌లో రిస్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీతో కొంత మేనేజ్ చేసే అవకాశం ఉంది కదా? అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు. మీరన్నట్లు ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి. మాకున్నంత రిస్క్ ఉండకపోచ్చు. అయితే రిస్క్ ఉంది. ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి కష్టపడాల్సిందే. అంత కష్టపడి సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు అని టెన్షన్ ఉంటుంది. చిన్న చిన్న కంఫర్ట్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఈ మానసిక టెన్షన్ అనుభవించాల్సిందే. అది నేనయినా, మా అబ్బాయి రామ్‌చరణ్ అయినా.. ఎవరైనా. కష్టం కష్టమే. ఎవ్వరూ రిలాక్స్ అవుతూ సుఖంగా మాత్రం పని చేయడానికి కుదరదు. కొడుకు నిర్మాణంలో తండ్రి సినిమా చేయడం స్పెషల్‌గా ఉంటుంది. మీరు హీరోగా రామ్‌చరణ్ డబ్బులు పెట్టి ‘సైరా’ చేయడం గురించి... (నవ్వుతూ) ఇందులో తన డబ్బు వేరు.. నా డబ్బు వేరు అనే ఆలోచన మాకు లేదు. మేమందరం ఒకే రూఫ్ కింద ఉంటున్నాం. కాబట్టి మాకు ఆ తేడాలు లేవు. నాకోసం ఇలాంటి సినిమా నిర్మించాలనే తన తపనను కచ్చితంగా అభినందిస్తాను. ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు ‘నీకు రెండో సినిమాకే ఓ కాస్ట్యూమ్ డ్రామా చేసే అవకాశం వచ్చింది. నాకు ఆ అవకాశం రాలేదు’ అన్నాను. ‘డాడీకి అది తీరని కోరిక. ఇలాంటి సినిమా తీస్తే తన కోరిక నెరవేరుతుంది’ అని తన మనసులో ఉండిపోయింది. అందుకే ‘సైరా’ నిర్మించే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగాడు. తనకు తెలుసు ఆ కథ నా దగ్గరే ఉందని. పరుచూరి బ్రదర్స్‌తో మళ్లీ కూర్చొని ఆ కథను బయటకు తీసుకొచ్చాడు. ఆ విధంగా నాకు మిగిలిన కోరికను తను తీర్చాడని చెప్పగలను. ఇప్పటి నటీనటులకు మీకన్నా రిస్క్ తక్కువ అని మాట్లాడుకున్నాం. అయినప్పటికీ రిస్క్ అయితే ఉంది. మరి.. ఓ స్టార్ కొడుకుకి ఇంత కష్టం అవసరమా? అని చరణ్‌ని సినిమాల్లోకి పంపించేటప్పుడు అనుకోలేదా? చరణ్ సినిమాల్లోకి రావాలనే విషయాన్ని వాళ్ల అమ్మ ద్వారా నాకు తెలియజేశాడు. నన్ను ఆర్టిస్ట్‌గా ఎంతగా గమనిస్తున్నాడు, ఎంతగా ఇష్టపడుతున్నాడో నాకు అప్పటివరకు తెలియదు. డాడీలా నేనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నన్ను గమనించిన విషయం గ్రహించాను. తను వస్తాను అన్నప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. ‘నా కొడుకుగా నీకు అన్నీ కేక్ వాక్ అనుకుంటే కుదరదు. చాలా కష్టపడి పని చేయాలి. నీ కష్టాన్ని గుర్తిస్తారు. అంత ప్రేమను పొందాలంటే కష్టపడాలి. కష్టపడే విషయంలో చరణ్‌కి చెప్పేది లేదు. ఎంత కష్టపడతాడనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు కాలికి గాయం అయింది. అది జరిగిందనే విషయం వారం వరకూ నాకూ, వాళ్ల అమ్మకు తెలియదు. ఇంట్లో కుంటుతూ నడుస్తుంటే, ‘ఏమైంది రా కాలికి... చూపించు’ అంటే చూపించాడు. మానుతున్నట్టుగా ఉంది గాయం. ‘మందులు వేసుకుంటున్నాను. ఫర్వాలేదులే’ అన్నాడు. కష్టపడే విషయంలో ఒళ్లు దాచుకోడు ^è రణ్. ఒక స్టార్ కొడుకుని, గోల్డెన్‌స్పూన్‌తో పుట్టాను అనే ఫీలింగ్ ఎక్కడా ఉండదు తనలో. ఎవరైనా బాధల్లో ఉంటే సహాయం చేయడం, హాస్పిటల్లో చూపించడం చేస్తుంటాడు. ఇవన్నీ చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదు. దానికి ప్రాచుర్యం కూడా కోరుకోడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరూ ‘ఇంత బాగా చూసుకున్న నిర్మాత ఎవ్వరూ లేరు’ అంటున్నారు. సినిమాలో పని చేసిన ఎవరినైనా అడగండి ఇదే చెబుతారు. ‘ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి చేసుకున్నాం’ అని కృష్ణానగర్‌లో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని మా మేకప్‌మేన్ చెప్పాడు. అది ‘సైరా’ వల్లే. సినిమా షూటింగ్లో ప్రతి రోజూ సెట్లో కొన్ని వేలమంది ఉండేవాళ్లు. చాలా మందికి పని దొరికింది. వాళ్లందరి ఆశీస్సులు ఈ సినిమాకు కచ్చితంగా ఉంటాయి. దాదాపు 300 కోట్లతో చరణ్ ఈ సినిమా నిర్మించారు. తన వెనకాల తండ్రి ఉన్నారనే ధైర్య మేనా? ఆ ధైర్యమే (నవ్వుతూ). ఇప్పుడు చరణ్‌కి ఉన్నంత రిస్కీ నేచర్ నాకు ఉండదు. ఎందుకంటే మా నాన్న మధ్యతరగతి వ్యక్తి. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ప్రతీ అడుగు ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి వేస్తాను. అయితే చరణ్‌కి నచ్చితే వెనకాడడు. దూకేస్తాడు. ఎందుకంటే వాళ్ల నాన్న మెగాస్టార్ అనే భరోసా ఉండి ఉండొచ్చు. 300 కోట్లు పెట్టి సినిమా చేసి, పెట్టిన డబ్బులు తిరిగొస్తాయా లేదా? అని ఆలోచించలేదు. మంచి ప్రయత్నం చేశాం అని అనుకుంటున్నాడు. నాకేంటి అనే ధీమా. నేనంత ధీమాగా, ధైర్యంగా ఆలోచించలేను. చరణ్ ‘ధైర్యం’ మీరు. మరి మీ ‘ధైర్యం’ ఏంటి? మీరు యాక్టర్‌గా ఎదుగుతున్న క్రమంలో మీ మానసిక స్థితి ఎలా ఉండేది? నా ధైర్యం నేనే. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను? ఎంత సంపాదిస్తున్నాను? ఎంత బ్యాంక్ బాలెన్స్ ఉంది అని కాకుండా ఎంత సేపటికీ బెస్ట్ సినిమాలు ఏం వస్తున్నాయి అని ఆలోచించేవాణ్ణి. ఇక్కడ నిలదొక్కుకోవాలి, మన ం ‘ద బెస్ట్’ అనిపించుకోవాలి అనే తాపత్రయం ఎప్పుడూ ఉండేది. కొందరు పారితోషికం సరిగ్గా ఇచ్చేవారు.. కొందరు ఎగ్గొట్టేవారు. ఎప్పుడూ కూడా నాకు ఇంత కావాలని డిమాండ్ చేసింది లేదు. 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేస్తున్నంతవరకూ కూడా నిర్మాతలకు ఎంత మిగులుతుందని ఆలోచించి, దానికి తగినట్టుగా పారితోషికం తీసుకునేవాణ్ణి. డిమాండ్, కమాండ్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. దానివల్ల ‘మంచివాడిలా ఉన్నాడు. ఇతనితో సినిమా చేద్దాం’ అని నిర్మాతలు నా దగ్గరకు వస్తారనుకునేవాడిని. నిర్మాత బతకాలి. తనుంటేనే మనకు బ్రతుకు తెరువు ఉంటుందని ఆలోచించేవాణ్ణి. నాతో సినిమాలు చేసిన నిర్మాతలందరూ ‘మీతో సినిమా చేసిన తర్వాత మాకు ఇంత మిగులుతుందని భరోసా ఉంటుంది’ అన్న సందర్భాలున్నాయి. లైఫ్ మొత్తం ప్రతిదీ ఆచి తూచి చేసుకుంటూ వచ్చాను. టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు.. ఏమైపోతాం అనే భయాలు ఉండేవా? ‘ఏమైపోతాం’ అనే భయం ఎప్పుడూ లేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ‘చాన్స్ రావాలే కానీ ఇరగదీస్తాను’ అనే కాన్ఫిడెన్స్ ఉండేది. అవకాశం రావాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. మన క్యారెక్టర్ నచ్చాలి. ‘ఇతనితో సినిమా తీస్తే కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందయ్యా’ అనుకోవాలి. మన ప్రవర్తన కూడా మన ఫ్యూచర్ మీద ప్రభావం చూపించే వీలుంది. నా క్యారెక్టర్ని, వ్యక్తిగత ప్రవర్తనను, టాలెంట్‌ను బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాణ్ని. ఓకే... ‘సైరా’ చేయకముందు మీకు నచ్చిన దేశం కోసం పోరాడిన వీరుడు ఎవరు? ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత మీ అభిప్రాయం? మహాత్మా గాంధీ నా ఫేవరెట్ హీరో అని ఎప్పుడూ చెబుతుంటాను. మహాత్ముడు గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు అని చదువుకున్నాం. ఆ తర్వాత హీరోయిక్‌గా అనిపించింది భగత్‌సింగ్.. ఆజాద్ చంద్రశేఖర్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకున్నాక ఆయనలోని తెగువ, మొండితనం, ధైర్యం ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇంత గొప్ప వీరుడు మన తెలుగు ప్రాంతంలో ఉన్నారా? అని ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ఇప్పుడు నా వీరుల జాబితాలో ఈయన యాడ్ అయ్యారు. మీ మనవళ్లు, మనవరాళ్లతో ఇలాంటి వీరుల కథలు చెబుతారా? చెప్పాను. మా పెద్ద పాప సుస్మిత అయితే ‘సైరా’లో నాలాంటి కాస్ట్యూమ్స్ చిన్నవి తయారు చేయించి వాళ్ల పిల్లలకు వేసి ఫొటోలు తీసింది. వాళ్లు నాతోటి ఫోటోలు దిగారు. మా ప్రొడక్షన్ కంపెనీలో సీఎఫ్ఓగా పని చేసిన విద్య ఉంది. తను కూడా మా ఇంటి అమ్మాయే. విద్య కొడుకు ఆర్నవ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన ఒక ఇంగ్లీష్ బుక్ కొనేశాడు. దాని మీద నాతో ‘సైరా’ అని సంతకం చేయించుకున్నాడు. సినిమా విడుదలయ్యే ముందు నరసింహారెడ్డి గురించి మొత్తం తెలుసుకోవాలని ఆ బుక్ మొత్తం కంఠస్థ పట్టాడు కూడా. నా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ నన్ను ‘భయ్యా’ అంటారు. తాతయ్యా అని ఎవరూ పిలవరు. భయ్యా అని నేను పిలవమని చెప్పలేదు (నవ్వుతూ). వాళ్లే పిలుస్తుంటారు. భయ్యా చేస్తున్న సినిమా.. ఒక వారియర్ సినిమా.. సూపర్ మేన్ సినిమా అంట చూద్దాం అని వాళ్లంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘సైరా’కి వాడిన నగల విషయంలో సుస్మితకు సలహా ఇచ్చింది సురేఖగారే అని విన్నాం... అవును. నయనతార, తమన్నా వాళ్లకు సుస్మిత పాత కాలం నగలను డిజైన్ చేసింది. ఆమ్రపాలి, మంగత్రాయ్ వాళ్లతో కలిసి చేసింది. వాళ్ల గురించి చెప్పింది సురేఖే. ఆ నగల్లో తమన్నా, నయనతార కుందనపుబొమ్మలా ఉన్నారు. రెగ్యులర్ సినిమాల్లో కనిపించేలా ఈ సినిమాలో ఉండరు. మీరు సురేఖగారికి కొనిపెట్టిన నగల గురించి? నేను చాలా కొనిపెట్టాను. ఈ మధ్యన హాలీడేకు వెళ్లాం. మొన్న లాస్ట్ బర్త్‌డేకు ఐదు క్యారెట్ల డైమండ్ స్టడ్స్ ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే సురేఖ సింపుల్ ఉమన్. ఏదైనా కొనిపెడతానంటే నాకెందుకు? పిల్లలకు కొనిపెడదాం అంటుంది. మరి నువ్వూ అనుభవించాలి కదా అంటుంటాను. ఇక మా రోల్స్ రాయల్స్ కారు ఎక్కాలంటే నేను ఉండాల్సిందే. ‘మీరు పక్కన ఉన్నప్పుడు ఆ కారులో వెళితే గర్వంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఎక్కితే నాకు అస్సలు ఇష్టం ఉండదు’ అంటుంది. ఆ కారులో తను ఒక్కతే వెళ్లదు. అంత సింపుల్. నిజానికి ఇప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకున్నంత ఎక్కువగా అప్పట్లో మీ పిల్లలతో ఆడుకోలేకపోయారు. ఇప్పుడు మీ భార్య సురేఖగారి ఫీలింగ్ ఏంటి? కష్టపడి పైకి వచ్చే రోజుల్లో నిరంతరం షూటింగ్లో ఉండి, పిల్లలు ఎలా ఎదిగారో కూడా తెలియలేదు. ఈ మధ్య నేను మా గ్రాండ్ చిల్డ్రన్‌తో ఆడుకుంటున్నాను. నేల మీద వాళ్లతో దొర్లుతున్నాను. అలా వాళ్లతో ఆడుకుంటుంటే పక్కనే సురేఖ నన్ను అలా గమనిస్తూ ఉంది. ఏంటి అని కళ్లతోనే అడిగాను. ‘ఏం లేదు.. మన పిల్లలతో మీరు ఎప్పుడు ఇలా ఆడుకున్నారా? అని గుర్తు తెచ్చుకుంటున్నాను. నాకు అస్సలు గుర్తు కూడా రావడం లేదు’ అంది. అదేంటి ‘ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు కలసి సరదాగా గడిపేవాళ్లం కదా’ అన్నాను. ‘అది సంవత్సరానికి ఒక్కసారో రెండుసార్లోనే కదా. పండగలకు కూడా మీరు ఉండేవారు కాదు’ అని చెప్పింది. నాకే కాదు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉండే ప్రతి ఒక్కరికీ ఇది కామన్. బ్రతుకుతెరువు కోసం కష్టపడే రోజుల్లో పిల్లల ఆలనా పాలనా చూసుకునే తీరిక కూడా ఉండదు. వాళ్లు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్లు అయ్యారో కూడా కళ్లారా చూసుకునే వీలుండదు. నాకు ముగ్గురు పిల్లలుంటే నేను ఇంటికి రాగానే సుస్మిత, చరణ్ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు. వాళ్లను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవాణ్ని. ఆ తర్వాత మేడపైకి వెళ్లిపోతుంటే సురేఖ ‘ఏవండీ.. ఒక్క నిమిషం మీకు మూడో పాప కూడా ఉంది గుర్తుందా?’ అనేది. ‘సారీ.. సారీ’ అంటూ తన గదిలోకి వెళ్లి శ్రీజను చూసేవాణ్ని. అప్పుడు శ్రీజ నెలల పిల్ల. ఇంకా నడక రాలేదు. దగ్గరకి వచ్చిన ఇద్దరి పిల్లలను ముద్డాడి, మూడో బిడ్డ గురించి మరచిపోయేవాణ్ణి. అంతలా పని చేశాను. అంత పని చేయకపోతే 33 సంవత్సరాల నా సినీ కెరీర్లో 150 సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. రోజుకి 2–3 షిఫ్ట్‌లు చేసేవాణ్ణి. 33 ఏళ్లు నాన్‌స్టాప్‌గా పని చేశాక వచ్చిన ఆ గ్యాప్ అనేది మీ ఫ్యాన్స్‌కు చాలా బాధగా ఉండి ఉంటుంది. మీకెలా అనిపించేది? బాస్ సినిమాలు రావడం లేదనే ఫీలింగ్ వాళ్లకు ఉండి ఉండొచ్చు కానీ ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సబబే. నేను చేసిన సర్వీస్ నాకు తృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఉన్న కాంగ్రెస్ పార్టీయే లేకుండా పోవడం? ఎటు వెళ్లాలి? అని అగమ్యగోచరంలో ఉండటం సినిమా ఇండస్ట్రీ నన్ను వెల్కమ్ చెప్పడంతో మళ్లీ వచ్చేశాను. నన్ను ఎంతగా ప్రేమించారు అని చెప్పడానికి ‘ఖైదీ నంబర్ 150’యే నిదర్శనం. రాజకీయాలు చూశాను, సినిమా పరిశ్రమ చూశాను కానీ సినిమా పరిశ్రమలో ఉండే తృప్తిగానీ, నేను పొందిన ఆనందం కానీ రాజకీయాల్లో నాకు రాలేదు. సినిమా పరిశ్రమ చాలా గొప్పది అనే ఫీలింగ్ నాకు ఉంది. నీ సంతోషం కోసం నువ్వు సినిమాలు చేసుకుంటూ వెళుతూ నిస్వార్థంగా నిన్ను ఆదరించి, కింగ్‌లాగా చూస్తారు. డెమీగాడ్లానూ చూస్తారు. అనుభవపూర్వకంగా తెలుసుకొని చెబుతున్నాను సినిమా పరిశ్రమలాంటిది మరోటి లేదు. నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి? ఆయన స్టయిల్లో ఉంటుంది. ఆయన స్టయిల్లో నేను చేయడం కొత్తగా ఉంటుంది. లుక్ పూర్తిగా సెట్ కాలేదు. త్వరలోనే కొరటాల శివగారే ప్రకటిస్తారు. ఫైనల్లీ.. ఈ ప్రొఫెషన్ మిమ్మల్ని మెగాస్టార్‌ని చేసింది. వేలమంది అభిమానులను ఇచ్చింది. అదే వృత్తి మిమ్మల్ని కడుపు నిండా భోజనం చేయనివ్వలేదు, కంటి నిండా నిద్రపోనివ్వలేదు...వేళకు తినాలని, కడుపు నిండా తినాలని మన శరీరానికి ఆకలి ఎలా ఉంటుందో మన ఆత్మకి కూడా ఒక ఆకలి ఉంటుంది. ఆ సోల్‌కి కావాల్సింది దొరికితే ఫిజికల్ హంగ్రీ అనేది అసలు సమస్యే కాదు. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో నా సోల్ నిండుగా, సంపూర్ణంగా ఉంది. అందుకని ‘డైట్’ చేస్తున్నా ఏమీ అనిపించడంలేదు. ‘ఐయామ్ హ్యాపీ’. ‘సైరా’ సినిమా ఎందుకు చూడాలి అంటే తెలియని చరిత్ర కోసం చూడాలి. యువతను ప్రభావితం చేసేలా నరసింహారెడ్డి కథను చూపించగలిగారా? సురేందర్ రెడ్డిని ఈ సినిమాకి డైరెక్టర్‌గా అడిగినప్పుడు కొంచెం టైమ్ కావాలన్నాడు. తర్వాత కొన్ని రోజులు టచ్‌లో లేకపోవడంతో ‘చేయకూడదనుకుంటున్నాడా?’ అనిపించింది. అయితే కథతో సహా వచ్చాడు. చాలా అద్భుతంగా అనిపించింది. నరసింహారెడ్డి కథను తను తీసిన విధానం చూసేవారిని ప్రభావితం చేస్తుంది. ఈ సినిమాలో చిరంజీవిని చూడరు. ఒక పాత్రను చూస్తారు. సినిమాలో ఏం కోరుకుంటారో అవన్నీ ఉండటంతో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. చాలామందిలో దేశభక్తి క్షీణిస్తున్న ఈ తరుణంలో మన పూర్వీకులు ఎంత సఫర్ అయ్యారు? బానిస బతుకు బతికి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్లందరి ప్రాణత్యాగాల ఫలమే మన స్వాతంత్య్రం అన్నది తెలుసుకోవాలి. వాళ్లందరినీ తలచుకోవాలి. గొప్పగా వాళ్లను స్మరించుకోగలిగితే అదే మనం వాళ్లందరికీ ఇచ్చే నివాళి. అలాంటి ఫీలింగ్ కలగాలంటే సినిమాను మించిన పవర్ఫుల్ మీడియమ్ లేదని అనుకుంటా. యువతరం చూడాల్సిన సినిమా. మీరు పిల్లల్ని బాగా ప్రేమిస్తారు. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్లు గ్రాండ్ చిల్డ్రన్ని గ్రాండ్‌గా చూసుకుంటారు కదా... గత నాలుగు రోజులుగా ‘సైరా’ ప్రమోషన్స్ చేస్తూ ఇంట్లో ఉండటం లేదు. మా చిన్నమ్మాయి శ్రీజ చిన్న కూతురికి పది నెలలు. ప్రమోషన్స్ అయి, ఇంటికి వెళ్లగానే కేకలు పెట్టేసింది. నన్ను చూసి పాప ఒకటే హుషారుగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎత్తుకున్న తర్వాత కొనుక్కున్న కొత్త బొమ్మలను చూపించింది. అంతే.. నాలుగు రోజుల అలసట జస్ట్ అరగంటలో దూరం అయిపోయింది. పిల్లలు మన స్ట్రెస్‌ని అంతా ఇట్టే తగ్గించేస్తారు. అందుకే ‘ఐ లవ్ చిల్డ్రన్’. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, మనవరాళ్లు నివృతి, సమారా, సంహిత, మనవడు ఆర్నవ్ ‘మగధీర’ చూసి ఇలాంటి సినిమా చేయలేకపోయానన్నందుకు చరణ్ మీతో ‘సైరా’ తీశారు. ఈ సినిమా చేసినందుకు మీ భార్య సురేఖ ఏమన్నారు? ఇవాళ (సోమవారం) ఉదయం సురేఖ ఓ మాట అంది. ఈ సినిమా కొన్ని చోట్ల మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల మంచి బిజినెస్ అయింది. ‘మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్ టైమ్‌లో మీకు గొప్ప పాత్ర ఇది. ఆ తృప్తిని డబ్బుతో కొలవలేం. మీ కోరిక తీర్చాలని రామ్ చరణ్ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరింది (సురేఖ సమర్పణలో ‘సైరా’ రూపొందింది)’ అని చెప్పింది. అలా ‘సైరా’ విషయంలో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉన్నాం. నటుడిగా శరీరానికి విపరీతమైన కష్టాన్ని ఇచ్చేశాం. కొంచెం సుఖపెట్టి ఉండుంటే బావుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదు. నాకు సుఖం అంటేనే ఇష్టం ఉండదు. ఖాళీగా ఉంటే రెస్ట్‌లెస్ అయిపోతాను. ఉదాహరణకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది. కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’కి మార్నింగ్ 7 అంటే 7, 9 అంటే 9కి మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ని. చాలా హ్యాపీగా ఉండేది. ‘పని చేస్తేనే, షూటింగ్‌కి వెళ్తేనే మీరు హ్యాపీగా, హుషారుగా ఉంటారు. ఖాళీగా ఉంటే మాత్రం ఏంటోలా అయిపోతారు’ అని సురేఖ అంటుంది. -
కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ‘ప్రస్తుతం కేసీఆర్ వయస్సు 64 ఏళ్లు. భారత సమకాలీన రాజకీయాలను బట్టి చూస్తే కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు. మరో 15, 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఆలోపు నేను లేదా హరీశ్ రిటైర్ కావొచ్చు. ప్రస్తుతం కేసీఆర్‌గారే మాకు బాస్. మరో 15, 20 ఏళ్లు ఆయన నాయకత్వంలోనే అందరం కలిసి పనిచేస్తాం. మాకు స్వతంత్రంగా ఎజెండాలు లేవు. ఆశలు లేవు. హరీశ్ రావుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అధికారం కోసం మా మధ్య పోటీ లేదు’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు. తమ కుటుంబంలో విభేదాలు లేవని, పార్టీలో హరీశ్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం లోటేనని అంగీకరించారు. ఆ లోటును ముఖ్యమంత్రి పూడుస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కోదండరాం.. ‘జేఏసీను ఏర్పాటుచేసింది, జేఏసీకి చైర్మన్‌గా కోదండరాంను నియమించింది కూడా కేసీఆర్‌గారే. కానీ ఏ కారణం వల్లనో ప్రభుత్వానికి ఆయనతో విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ టెంటు వేసినా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆయనకు కూడా మంచిది కాదు’ అని కేటీఆర్ హితవు పలికారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనేక బాలారిష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని.. వారితో శెభాష్ అనిపించుకునేవిధంగా సాగుతున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ చాలావేగంగా ముందుకువెళ్లుతున్నదని, ఈ విషయం అనేక జాతీయ సర్వేల్లో వెల్లడైందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలనాధ్యక్షుడు కాబట్టే ఆరునెలల వ్యవధిలో తెలంగాణ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించిందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ఉద్దేశాలు మంచివే అయినా, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు.