న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్య స్థాయి మరింతగా పెరిగింది. కాళింది కుంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియోలో యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగుతో కూడిన మందపాటి పొర కనిపిస్తోంది. ఈ నదిలో గత కొన్ని రోజులుగా నురుగు కనిపిస్తోంది.
వారాంతాల్లో యమునా ఘాట్‌లను శుభ్రం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నురుగు ఎక్కువగా ఉందని, ఇది చర్మంతో పాటు కళ్లకు కూడా ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ఢిల్లీలో వాయుకాలుష్యం, యమునలో విషపు నురుగలకు ఆప్ కారణమంటూ బీజేపీ విమర్శిస్తోంది.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునలో స్నానం చేసిన కొన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన వైద్యులను సంప్రదించారు. వారు ఆయనకు చికిత్స అందించాక, విశ్రాంతి అవసరమని సూచించారు. యమునా ప్రక్షాళన విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. 2025 ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వస్తే యమునా క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
#WATCH | Delhi | Thick toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high. pic.twitter.com/VZhXwvPNd4
— ANI (@ANI) October 26, 2024
ఇది కూడా చదవండి: దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment