మన్మోహన్‌ సింగ్‌పై కేజ్రీవాల్‌ ప్రశంసలు | Arvind Kejriwal Says People Are Missing Educated PM Like Manmohan Singh | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌ సింగ్‌పై కేజ్రీవాల్‌ ప్రశంసలు

Published Thu, May 31 2018 1:29 PM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM

Arvind Kejriwal Says People Are Missing Educated PM Like Manmohan Singh - Sakshi

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కాలేజీ డిగ్రీ నకిలీదంటూ ఆరోపించారు. అంతేకాకుండా ‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వంటి విద్యావంతుడైన మేధావిని దేశ ప్రజలు మిస్‌ అవుతున్నారు. ఆయనలాంటి విద్యావంతుడినే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ’ ట్వీట్‌ చేశారు.

అయితే గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన కేజ్రీవాల్‌.. మన్మోహన్‌ సింగ్‌ను ధృతరాష్ట్రుడితో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘అంతేకాకుండా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీ.. మన్మోహన్‌ సింగ్‌ను ముందుకుతెచ్చి ప్రధానిని చేసింది. మరి ధృతరాష్ట్రుడి వంటి మన్మోహన్‌ సింగ్‌ తన ప్రభుత్వంలోని, కాంగ్రెస్‌ పార్టీలోని అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యారంటూ’ గతంలో ట్వీట్‌ చేశారు. 2015 ఎన్నికల సమయంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడిని..‘బీజేపీ మన్మోహన్‌ సింగ్‌గా’ అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement