సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా శుక్రవారం ఇండియా గేట్ వద్ద జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి నాలుగో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదమైంది. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందువరుసలో సోనియా గాంధీకి ప్రభుత్వం సీటు కేటాయిస్తుండగా..తాజాగా రాహుల్‌కు నాలుగో వరుసలో సీటు కేటాయించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ కుటుంబాన్ని అణిచివేయాలనుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఏ సీట్లో కూర్చోవడానికీ రాహుల్‌కు ఇబ్బంది లేకపోయినా తమ నేతను అణిచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిచడంపైనే తమ అభ్యంతరమని కాంగ్రెస్ నేత చరణ్ సింగ్ సప్రా అన్నారు.
మరోవైపు ఆసియా దేశాధినేతలు గణతంత్ర వేడుకలకు పెద్దసంఖ్యలో అతిధులుగా వస్తున్న క్రమంలో తొలి వరసను వారికి కేటాయించామని ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకుంది. ఎవరినీ కించపరచాలన్నది ప్రభుత్వ అభిమతం కాదని బీజేపీ నేత సుధాంశు మిట్టల్ కాంగ్రెస్ ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment