seat dispute
-
జార్ఖండ్‌లో కొలిక్కిరాని ఇండియా కూటమి సీట్ల కేటాయింపు
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే జార్ఖండ్‌లో ఎన్‌న్డీఏ కూటమి సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాని మిత్రపక్షాలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు సీట్ల విషయంలో చిక్కుముడి పడిందని సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో ఆర్జేడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాలము సీటు ఆర్జేడీకి ఖరారుకాగా, చత్రా సీటు కోసం ఆర్జేడీ కూడా పట్టుపడుతోంది. మంత్రి సత్యానంద్ భోక్తా ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఆర్జేడీ సీట్ల కేటాయింపులో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన బీహార్ సమీకరణల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో జార్ఖండ్‌లో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. లోహర్దగా సీటు కోసం అటు జేఎంఎం, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జేఎంఎం నుంచి చమ్రా లిండా ఈ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు హజారీబాగ్ స్థానంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ దొరకలేదు. -
ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?
ఇండిగో విమానంలో ఒక ప్యాసింజర్‌కి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని ప్రయాణికులను దించేసి వెళ్లి పోయిన ఘటన మరువకముందే విమానంలో సీటు కుషన్ మిస్ అయిన ఘటన నెటిజనుల ఆగ్రహానికి కారణమైంది. ఇండిగో ఫ్లైట్ 6E6798లో నాగపూర్‌కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అనుకున్న సమయనికి విమానం ఎక్కి, విండో సీట్ నెం 10A ఎంజాయ్ చేయాలన్న ఉత్సాహంతో దగ్గరికి వెళ్లి చూసి ఒక్కసారి షాక్ అయ్యారు. సీటులోని కుషన్ మిస్ అయింది. కేవలం స్టీల్ ఫ్రేమ్ మాత్రమే కనిపించింది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక పట్నాయక్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో వెంటనే క్యాబిన్ సిబ్బందిని సంప్రదించారు. సీటు కింద ఉంటుంది చూడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా కూడా లేకపోవడంతో మళ్లీ సిబ్బందిని అడిగే అప్పుడు తీసుకొచ్చి కుషన్ అమర్చారు. అప్పటివరకు ఆమె నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సాగరిక భర్త సుబ్రత్ పట్నాయక్ దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. లాభాలను పెంచుకునే మార్గం ఇదేనా.. చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బోర్డింగ్‌కు ముందు గ్రౌండ్ స్టాఫ్ , సిబ్బంది నిర్లక్ష్యాన్ని సుబ్రత్ ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ట్రయల్ కావచ్చు. త్వరలోనే ఇండిగో సీట్ కుషన్ల కోసం 250-500 వసూలు చేస్తుందేమో అంటూ ఒకరు సెటైర్లు వేశారు. మరోవైపు దీనిపై ఇండిగో స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. సీటు కుషన్ దాని వెల్క్రో నుండి కొట్టుకుపోతుంది.దాన్ని సిబ్బంది రీప్లేస్ చేస్తుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలను అందిస్తామంటూ ఇండిగో ఎయిర్ లైల్స్ వివరణ ఇచ్చింది. #Indigo !! #Flight 6E 6798 !! Seat no 10A ! Pune to Nagpur!!! Today’s status … Best way to increase profit 😢😢…Pathetic … pic.twitter.com/tcXHOT6Dr5 — Subrat Patnaik (@Subu_0212) November 25, 2023 -
రాహుల్ గాంధీకి మరో అవమానం!
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా శుక్రవారం ఇండియా గేట్ వద్ద జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి నాలుగో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదమైంది. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందువరుసలో సోనియా గాంధీకి ప్రభుత్వం సీటు కేటాయిస్తుండగా..తాజాగా రాహుల్‌కు నాలుగో వరుసలో సీటు కేటాయించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ కుటుంబాన్ని అణిచివేయాలనుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఏ సీట్లో కూర్చోవడానికీ రాహుల్‌కు ఇబ్బంది లేకపోయినా తమ నేతను అణిచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిచడంపైనే తమ అభ్యంతరమని కాంగ్రెస్ నేత చరణ్ సింగ్ సప్రా అన్నారు. మరోవైపు ఆసియా దేశాధినేతలు గణతంత్ర వేడుకలకు పెద్దసంఖ్యలో అతిధులుగా వస్తున్న క్రమంలో తొలి వరసను వారికి కేటాయించామని ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకుంది. ఎవరినీ కించపరచాలన్నది ప్రభుత్వ అభిమతం కాదని బీజేపీ నేత సుధాంశు మిట్టల్ కాంగ్రెస్ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. -
ఆకాశంలో సీట్ల గొడవ.. విమానం దారి మళ్లింపు
హోస్టన్: ఆకాశంలో సీట్ల కోసం ప్రయాణికులు గొడవ పడటం.. విమానం దారి మళ్లించడం అమెరికాలో పరిపాటిగా మారిపోయింది. వారంలోనే ఇలాంటి సంఘటనలు మూడు జరిగాయి. తాజాగా న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు బయల్దేరిన విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు సీట్ల కోసం గొడవ పడ్డారు. వెంటనే విమానాన్ని ల్యాండ్ చేయాలంటూ ఓ ప్రయాణికురాలు డిమాండ్ చేసింది. దీంతో ఫైలట్ విమానాన్ని దగ్గరలోని విమానాశ్రయం వైపు మళ్లించాడు. జాక్సన్‌విల్లె అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దించారు. అనంతరం అధికారులు పోలీసుల భద్రతతో విమానాన్ని పంపించారు.