త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే జార్ఖండ్‌లో ఎన్‌న్డీఏ కూటమి సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాని మిత్రపక్షాలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి.
అయితే ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు సీట్ల విషయంలో చిక్కుముడి పడిందని సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో ఆర్జేడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాలము సీటు ఆర్జేడీకి ఖరారుకాగా, చత్రా సీటు కోసం ఆర్జేడీ కూడా పట్టుపడుతోంది. మంత్రి సత్యానంద్ భోక్తా ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఆర్జేడీ సీట్ల కేటాయింపులో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన బీహార్ సమీకరణల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో జార్ఖండ్‌లో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. లోహర్దగా సీటు కోసం అటు జేఎంఎం, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జేఎంఎం నుంచి చమ్రా లిండా ఈ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు హజారీబాగ్ స్థానంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment