కదంతొక్కిన జాగిలాలు | Dogs parade on republic day | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన జాగిలాలు

Published Wed, Jan 27 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

కదంతొక్కిన జాగిలాలు

కదంతొక్కిన జాగిలాలు

న్యూఢిల్లీ: 26 ఏళ్ల తర్వాత జాగిలాల కవాతు రిపబ్లిక్ డే పరేడ్‌కే హైలైట్‌గా నిలిచింది. 24 లాబ్రాడార్, 12 జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన (మొత్తం 36) శునకాలు రాజ్‌పథ్ రోడ్డు జరిగిన పరేడ్‌లో పాల్గొన్నాయి. భారత సైన్యంలోని 1,200 జాగిలాల నుంచి వీటిని ఎంపిక చేశారు. ఇవి సైన్యంలో ప్రమాదకర వస్తువుల గుర్తింపుతోపాటు, గార్డ్, పెట్రోలింగ్ డ్యూటీ చేస్తాయి. జాగిలాల పరేడ్‌ను ప్రేక్షకులు కేరింతలతో ప్రోత్సహించారు. అప్రమత్తత, దూకుడు, సంకేతాలను అమలు పరిచే తీరు ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు రిమౌంట్ వెటర్నరీ కోర్‌కు చెందిన కెప్టెన్ అనురాగ్ బొరువా తెలిపారు.

‘ఈసారి పరేడ్‌లో జాగిలాల కవాతు నిర్వహించాలన్నది విధానపరమైన నిర్ణయం. ఆపరేషన్‌లో భాగంగా ఇవి అప్రమత్తంగా ఉండి.. ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడతాయి’ అని మరో అధికారి చెప్పారు.  విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన జాగిలాలకు, వాటి శిక్షకులకు శౌర్యచక్ర అవార్డులు అందించారు. ఇంతవరకు ఆరు సేనా మెడల్స్‌తోపాటు 500లకు పైగా పతకాలను ఈ వెటర్నరీ కోర్ అందుకున్నాయి. గత ఆగస్టులో సరిహద్దుగుండా చొరబాటుకు ప్రయత్నించిన సాయుధ బలగాలను గుర్తించి వారిని అడ్డుకునే క్రమంలో నాలుగేళ్ల మన్సీ (లాబ్రాడార్) తోపాటు దీని శిక్షకుడు బషీర్ అహ్మద్ ప్రాణాలు కోల్పాయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement