ఫోటో కర్టజీ డీడీ న్యూస్
#RepublicDay2024-ISRO Tableau 75వ రిపబ్లిక్ డే పరేడ్‌లో సగర్వంగా కవాతు నిర్వహించి భారతదేశపు రాకెట్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 'చంద్రయాన్-3 - ఎ సాగా ఇన్ ది ఇండియన్ స్పేస్ హిస్టరీ' కర్తవ్య పథంలోకి దూసుకెళ్లి రికార్డు క్రియేట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని శకటంపై చంద్రయాన్ -3 మిషన్ సాధించిన విజయాలను, ఆదిత్య ఎల్ వన్ ప్రాజెక్ట్ వివరాలు, 'బాహుబలి రాకెట్' లాంచ్ వెహికల్ మార్క్ 3 నమూనా తదితర వివరాలను ప్రదర్శించింది. అలాగే అంతరిక్ష పితామహులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట , వరాహమిహిరులు కూడా ఈ శకటంలో దర్శనిమచ్చారు.
చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దిగిన ల్యాండింగ్ సైట్‌ను శివ శక్తి పాయింట్‌తోపాటు విక్రమ్ ల్యాండర్ , ప్రజ్ఞాన్ రోవర్ వివరాలను ప్రదర్శించింది. బెంగుళూరు, అహ్మదాబాద్, తిరువనంతపురం, శ్రీహరికోటలోని వివిధ ఇస్రో కేంద్రాలకు చెందిన ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తల బృందం ఆహూతులను ఆకట్టుకున్నారుఇస్రో షీరోలైన ఆదిత్య L1 మిషన్ డైరెక్టర్ నిగర్ షాజీ ,చంద్రయాన్-2 మిషన్‌కు నాయకత్వం వహించిన ఎం వనిత, ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఓషన్‌శాట్ తయారీ మిషన్ హెడ్ శ్రీమతి తేన్‌మొళి సెల్వి కె , చంద్రయాన్-3 మిషన్‌కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన తదితరులు దీనికి నాయకత్వం వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 220 మంది మహిళా శాస్త్రవేత్తలు కవాతు చేశారు. రెండు చారిత్రాత్మక విజయాల తర్వాత ఇస్రో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంది.
Happy Republic Day🇮🇳#ISRO’s #RepublicDay tableau led on Kartavya Path by Bharat’s #NariShakti. pic.twitter.com/XP2g6bAuJY
— ISRO InSight (@ISROSight) January 26, 2024
దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది వేడుకల్లో త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాల మహిళా అధికారుల నేతృత్వంలో మహిళాబృందం తొలిసారిగా మార్చ్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆర్మీ డెంటల్ కార్ప్స్ నుండి కెప్టెన్ అంబా సమంత్, ఇండియన్ నేవీ నుండి సర్జ్ లెఫ్టినెంట్ కాంచన,ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన లెఫ్టినెంట్ దివ్య ప్రియతో కలిసి మేజర్ సృష్టి ఖుల్లర్ నేతృత్వంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు చెందిన పూర్తి మహిళా బృందం కర్తవ్యపథ్‌లో నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
Happy Republic Day to all Indians and #ISRO lovers 🇮🇳
— ISRO Spaceflight (@ISROSpaceflight) January 26, 2024
The #RepublicDayParade today featured a Chandrayaan-3/ISRO tableau!! Here's the video of that:pic.twitter.com/6blzAUj8nn
Comments
Please login to add a commentAdd a comment