ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్‌ | Inter Student Gang Raped In Srikakulam District, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్‌

Published Tue, Oct 22 2024 5:56 AM | Last Updated on Tue, Oct 22 2024 11:29 AM

Inter student gang raped in Srikakulam distric

శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో ఘటన 

పుట్టినరోజు వేడుకలకు పిలిచి దారుణం  

రాష్ట్రంలో కొనసాగుతున్న కీచకపర్వం

కాశీబుగ్గ: కూటమి ప్రభుత్వహయా­ంలో అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిన్న తెనాలిలో కేంద్రమంత్రి అనుచరుడి దురాగతం.. మొన్న బద్వేలులో ఉన్మాది దారుణం.. అంతకుముందు అత్తాకోడళ్లపై సామూహిక అత్యా­చారం ఇలా అత్యాచారా­లు, వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నా­యి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పుట్టిన­రోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమ­­వారం బయటకు వచ్చింది.

పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినులు, ఇంటర్‌ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్‌ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూర­ంగా ఉన్న కాలనీకి చేరుకు­న్నారు.

అక్కడ కేక్‌కట్‌ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడి నుంచి మరో విద్యార్థిని తప్పించుకోగలిగింది. తప్పించుకున్న విద్యార్థని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసినా పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవడంతో ఆమె తల్లిదండ్రులు పో­లీ­సులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

కూటమి ప్రభుత్వంలో ఆగని అఘాయిత్యాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement