kashibugga
-
ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్
కాశీబుగ్గ: కూటమి ప్రభుత్వహయాంలో అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిన్న తెనాలిలో కేంద్రమంత్రి అనుచరుడి దురాగతం.. మొన్న బద్వేలులో ఉన్మాది దారుణం.. అంతకుముందు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఇలా అత్యాచారాలు, వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం బయటకు వచ్చింది.పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు, ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న కాలనీకి చేరుకున్నారు.అక్కడ కేక్‌కట్ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడి నుంచి మరో విద్యార్థిని తప్పించుకోగలిగింది. తప్పించుకున్న విద్యార్థని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసినా పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర
కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే సామాజిక సాధికారత సాధ్యమైందని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా వైఎస్ జగన్ పాలిస్తున్నారని.. అందుకే తమ పథకాలను చంద్రబాబు కూడా కాపీ కొట్టడానికి తయారైపోయారని వారు ఎద్దేవా చేశారు. పేదల పక్షాన నిల్చుని పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వీరు ప్రసంగించారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్ పదవుల్లో సీఎం జగన్ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు. అవినీతి మరక లేకుండా ‘సంక్షేమం’ : ధర్మాన అనంతరం.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిని గుర్తుచేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెడితే మూడు నాలుగు ప్రభుత్వాలు మారితే గానీ అది కార్యరూపం దాల్చేది కాదని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనుల్లో వేగం కనిపిస్తోందని.. పాలనలో ఆయన కొత్త ఒరవడి సృష్టించారని తెలిపారు. ఉద్యమాలు జరిగితేగానీ జరగని పనులు ప్రస్తుత ప్రభుత్వం సులభంగా చేస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాల కింద రూ.రెండు లక్షల ముప్పై వేల కోట్లను ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా జమచేశారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుకు ఇది మచ్చుతునక అని ధర్మాన అన్నారు. చంద్రబాబు కూడా ఈ సంక్షేమ పథకాలపై ఎలాంటి అవినీతి ఆరోపణ చేయలేకపోయారన్నారు. బాబు పాలనకు, జగన్ పాలనకు మధ్యనున్న తేడాను ప్రజలే బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. బాబు జీవితమంతా తన వారికి దోచి పెట్టడానికి, దోచుకున్నది దాచుకోవడానికే సరిపోయిందని ధర్మాన ఎద్దేవా చేశారు. పేదలు తలెత్తుకుని బతికేలా.. ఇక మేనిఫెస్టోలో ఇచి్చన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో పేదలు తలెత్తుకుని బతికేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన మనవళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదలకు మాత్రం ఆంగ్ల మాధ్యమం వద్దంటూ కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటివి పేద విద్యార్థులకు వరమని ఆయన తెలిపారు. తన దృష్టిలో ఇద్దరే ఇద్దరు మామలని.. ఒకరు చందమామ అయితే మరొకరు జగన్ మామ అని కొనియాడారు. మరోవైపు.. జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే సాధ్యమన్నారు. ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర అని తమ్మినేని అభివరి్ణంచారు. జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకే వెళ్తుందని, మధ్యవర్తిత్వం లేని పాలన అందిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఎన్ని బటన్లు నొక్కారో అందుకున్న వారికే తెలుసునన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస శ్రీకాంత్, ఎమ్మెల్యేలు కంభాల జోగులు, రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఇక ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. పల్లె ప్రాంతాల నుంచి వెల్లువలా బహిరంగ సభకు తరలివచ్చారు. సభ నిర్వహించిన ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ కేటీ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగింది. నేడు విశాఖ, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో యాత్ర.. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం విశాఖపట్నం జిల్లా గాజువాక, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా..
సాక్షి, కరీంనగర్/ వరంగల్: కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారు ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి వేములవాడకు వెళ్తున్న ఏపీ 36ఏటీ 0648 గల మారుతి ఆల్టో కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూతురికి వీసా రావడంతో కారులో మృతి చెందిన ఇద్దరిని వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న తమ కూతురు మేఘన, మేనల్లుడు అశోక్ గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాశీబుగ్గలో విషాదం అయితే కూతురు మేఘనకు అమెరికా వీసా రావడంతో కుటుంబమంతా వేములవాడ రాజన్న దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరగా.. మార్గమధ్యలో మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం తెలియడంతో కాశీబుగ్గలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. చదవండి: పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం -
బడి రుణం తీర్చుకున్నారు
సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అక్షరాలు నేరి్పన చోటు శిథిలమవ్వకుండా వారు కాపాడారు. విద్యా బుద్ధులు నేరి్పన బడి నిర్జీవమవుతుంటే వచ్చి ఆదుకున్నారు. బతుకునిచ్చిన బడి చితికిపోతుంటే ముందుకు వచ్చి తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా అమలు చేశా రు. మొత్తానికి ఆ బడి రుణం తీర్చుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని చినబడాంలో 1956లో ప్రభు త్వ పాఠశాల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వివిధ హోదా ల్లో స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు ఊరు వచ్చిన వారంతా శిథిలావస్థలో ఉన్న బడిని చూసి చలించిపోయేవారు. బడి దుస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అంతా కలిసి బడిని బాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ సమావేశం పెట్టుకుని ఎవరెవరు ఏమేం చేయాలో బాధ్యతలు పంచుకున్నారు. అంతే.. ఏకంగా రెండు అంతస్తుల్లో నా లుగు గదులు, రక్షణ గోడ, ముఖ ద్వా రం ఏర్పాటైపోయాయి. కొందరు స్థలం రాసివ్వగా, మరికొందరు పనికి సాయం చేశారు, ఇంకొందరు డబ్బులు పంపించారు. మొత్తానికి రూ.25లక్షల విలువైన భవనాలను అవలీలగా కట్టేశారు. నేడు భవనాలు ప్రారంభం చినబడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు నిర్మించిన భవనాలను పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఇతర ఉపా«ధ్యాయులు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దాతలు ముందుకు రావడం సంతోషం ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు ఇలాంటి దాతలు తో డైతే పాఠశాలలు బంగారంలా తయారవుతాయి. పూర్వ విద్యార్థులు, పెద్దలు ముందుకు వచ్చి వితరణ చేశారు. రూ.25 లక్షలు ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు, వైద్య వృత్తిలో స్థిరపడినవారు సాయం అందించారు. – కె.శ్రీనివాసరావు, హెచ్ఎం, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చినబడాం దాతలు నిర్మించిన ముఖ ద్వారం, ప్రహరీ -
పేదలకు సంతృప్తిగా భోజనం
సాక్షి, శ్రీకాకుళం/అమరావతి: ‘రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినే పరిస్థితి లేదు. ఏ బియ్యం అయితే మనం తినగలుతామో వాటినే పేదలకు పంపిణీ చేస్తాం. పూర్తిగా ఫిల్టరింగ్ చేసి.. 5, 10, 15, 20 కేజీలుగా ప్యాక్ చేసి సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే సరఫరా చేస్తాం’ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు అనుగుణంగానే తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కాశీబుగ్గలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు. పంపిణీ ఏర్పాట్లు ఇలా.. జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, 1,141 గ్రామ పంచాయితీల పరిధిలో 1,865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు. వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్ డిపోల్లో సిద్ధంగా ఉంచారు. వీటిలో 5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి. పంపిణీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు తలెత్తితే తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్ లేదా వలంటీర్ అందుబాటు, యూనిట్లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు నూతన విధానం వల్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాకు, తూకంలో మోసాలకు అడ్డుకట్ట పడనుంది. 20 ఏళ్లుగా పరిశోధనలకే పరిమితం ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఐఎంఏ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ బృందం కవిటి ప్రాంతంలో ఈ కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో కేజీహెచ్ వైద్యులు 2005లో పరిశోధన వైద్య శిబిరాలు చేపట్టగా.. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి పర్యటించారు. అదే ఏడాది రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.కృష్ణమూర్తి , చీఫ్ కెమిస్ట్ ఎ.సతీష్, 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఇక్కడ పర్యటించారు. 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ బృందం, న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ బృందం, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత, 2012లో జపాన్, అమెరికన్ బృందాలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం అధ్యయనం జరిపాయి. 2013లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ బృందాలు పరిశోధనలు చేశాయి. 2017 నుంచి భారతీయ వైద్యపరిశోధనా మండలి పరిశోధన సాగుతోంది. కిడ్నీ బాధితులకు కొండంత అండ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పాదయాత్రలోనూ.. అంతకుముందు ఉద్దాన ప్రాంత పర్యటనలో కిడ్నీ బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే చర్యలకు ఉపక్రమించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. వైద్య సేవలందించేందుకు వీలుగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటర్, అతి పెద్ద డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో సరిపెట్టకుండా వ్యాధికి మూలమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ.600 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వీటన్నిటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. -
బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): పద్మవ్యూహం వంటి ట్రాఫిక్‌ను తప్పించుకోలేక, ట్రాఫిక్ నియమాలు తెలియక, ఇరుకైన రోడ్డులో చిక్కుకుని బస్సు చక్రాల కింద పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలను కలచివేసింది. కాశీబుగ్గ రాజీవ్‌గాంధీ బస్‌స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం 5గంటలకు గుర్తుతెలియని యువకుడు అత్యంత ట్రాఫిక్ రద్దీకి ఆందోళన చెందాడు. ఇదేక్రమంలో వస్తున్న పలాస–నువ్వలరేవు ఆర్డినరీ ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా, ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడిపోయాడు. పలాస ఆర్టీసీ డిపోకు చెందిన ఈ బస్సు నుడుంపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడాడు. ప్రయాణికులు 108 అంబులెన్సులో పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఉదయం నుంచి కాశీబుగ్గ బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా కొంతమంది కొట్టారని, ఈ క్రమంలో టెన్షన్‌తో తిరుగుతున్నాడని ఇంతలో ప్రమాదానికి గురయ్యాడని కాశీబుగ్గ పోలీసులకు స్థానికులు వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చివరకు ప్రయత్నించినా... 108 సిబ్బంది రమణ, సత్యం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడి ప్రాణాలు కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సిబ్బంది తెలియజేశారు. అంతలో నర్సులు సీపీఆర్ (కార్డీయో పల్మనరీ రిస్సెస్టేషన్) విధానాన్ని ప్రయోగించి గుండెపై నెట్టారు. ఈ క్రమంలో ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించినా ప్రయోజనం లేకపోయింది. -
బాధ్యత నిర్వహిస్తే.. బదిలీ చేశారు
సాక్షి, కాశీబుగ్గ: ఇంటి ముందు, ఇంటిపైనా, వీధుల్లో ఫ్లెక్సీలు తొలగించమన్నందుకు ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బదిలీ చేసిన ఉదంతం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పలాస మండలం లక్ష్మిపురం పంచాయతీ పరిధిలో ఉన్న కిష్టుపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ బూర్లె మాధవి ఇంటి వద్ద మంగళవారం జెండాలు ఎగరడంతో బ్రాహ్మాణతర్లా రూట్లో ఎన్నికల అధికారి డి అనితాదేవి ఆదేశాల మేరకు వీఆర్ఓ సంతోష్‌కుమార్ వాటిని తొలగింపజేశారు. వీఆర్ఓకు బెదిరింపులు లక్ష్మిపురం పంచాయతీ ఎంపీటీసీ బూర్లె మాధవి భర్త బూర్లె రాజు వీఆర్ఒపై ఫోన్లో విరుచుకుపడి.. ఎక్కడున్నావో చెప్పు.. ఎవడవురా నీవు ఎవరనుకుంటున్నావు, కట్టేసి కొడతాంరా అంటూ చిందులు వేశారు. అప్పటికీ ఊరుకోక ఎమ్మెల్యే అల్లుడు యార్లగడ్డ వెంకన్నచౌదరి, పీరుకట్ల విఠల్‌రావులతో తహశీల్దారు కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారి అనితాదేవితో వాదనకు దిగారు. రూల్స్ ఎలా ఉంటే అలా చేస్తామని చెప్పడంతో వెనుదిరిగి తహసీల్దారు బాపిరాజును పట్టుకుని ఇలా అయితే గొడవలు వస్తాయని చెప్పి వీఆర్ఓను బదలాయించారు. ఆయనకు వేరే ప్రాంతం చూడమని, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పీరుకట్ల విఠల్ బంధువు హేమగిరిని వీఆర్ఓగా ఫుల్చార్జ్తో నియమించారు. ఎటువంటి గొడవలు రాకూడదని మార్చాం.. ఎన్నికల విధులలో భాగంగా కిష్టుపురం వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌కుమార్‌ను వేరే ప్రాంతానికి పంపించి ఫుల్‌చార్జ్ వీఆర్ఓ హేమగిరిని నియమించాము. వాస్తవంగా తహసీల్దారు కార్యాలయం వద్ద ఎటువంటి గొడవలు జరగలేదు. కిష్టుపురంలో జెండాలు తొలగించమంటే అబ్జక్షన్ చేశారు. దానికి ఎన్నికల అధికారి వివరణ ఇవ్వడంతో వెనుదిరిగారు. –బాపిరాజు, తహసీల్దారు, పలాస -
వినికిడి లోపమని వదిలేశారు!
కాశీబుగ్గ(పలాస): వినికిడి లోపముందని భర్త ఆదరించకపోవడం, అదనపు కట్నం తేవాలని అత్తమామలు వేధించడంతో పలాస పట్టణంలోని ఉలాసపేటకు చెందిన గెంబలి సౌందర్య బుధవారం మౌనదీక్ష చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఉలాసపేటకు చెందిన సుడియా గౌతమ్‌తో విజయనగరం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన గెంబలి నారాయణ, శారదల కుమార్తె సౌందర్యతో 2016 డిసెంబరు 9న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదును కట్నంగా ఇచ్చారు. నెల రోజుల తర్వాత సౌందర్యకు వినికిడి లోపం ఉన్నట్టు భర్త, అత్తమామలు గ్రహించారు. దీంతో గౌతమ్ తన భార్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య తనిఖీలు చేయించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను అక్కడే విడిచిపెట్టి బెంగళూరు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సౌందర్య తల్లి దండ్రులు తన కుమార్తెను పార్వతీపురం తీసుకువచ్చారు. అక్కడి నుంచి వియ్యంకులకు ఫోన్ చేసి తమ కుమార్తెను తీసుకెళ్లాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో బుధవారం కుమార్తెతో కలిసి పలాస వచ్చి గౌతమ్ ఇంటి ముందే మౌనదీక్ష చేపట్టారు. ఈ సమయంలో అత్త రమాదేవి మౌన దీక్ష వహిస్తున్న సౌందర్యకు కిటికీలో నుంచి తిట్ల వర్షం కురిపించింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లకపోతే ఏం జరుగుతుందో తెలియదని హెచ్చరికలు జారీ చేసింది. దిక్కుతోచని స్థితిలో సౌందర్య 100 నంబర్ కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలతో మాట్లాడగా అదనంగా మరో రూ.20 లక్షలు ఇచ్చి కాపురానికి పంపించాలని అత్త రమాదేవి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు కాశీబుగ్గ పోలీసుల పరిశీలనలో ఉంది. -
వివాహిత అదృశ్యం
కాశిబుగ్గ : కాశిబుగ్గకు చెందిన వివాహిత నాగుల ప్రణిత పని మీద బయటికి వెళ్లి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాలేదని శనివారం సాయంత్రం ఆమె భర్త రవికిషోర్ ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రోజ్‌కలర్ పంజాబీ డ్రెస్సుతో అనుమానంగా తిరుగుతూ నగరంలో ఎవరికైనా కనిపిస్తే9491089131 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని సీఐ భీంశర్మ తెలిపారు. -
మదర్ దీవెనలో కాశిబుగ్గ
నగరానికి రెండుసార్లు వచ్చిన విశ్వమాత నేడు మదర్‌థెరిస్సా జయంతి కాశిబుగ్గ : మదర్‌థెరిస్సా అంటేనే ప్రేమానురాగాలకు నిలయం. కులమతాలకు అతీతంగా ఎంతో మందికి సేవలందించిన మహనీయురాలు ఆమె. మానవతా మూర్తిగా, విశ్వమాతగా సత్యం, దయ, ప్రేమ, స్నేహం, అనురాగం, కరుణ, ఆత్మీయతలను ప్రపంచానికి పంచిన మదర్ జయంతి శుక్రవారం జరుగనుండగా ఓరుగల్లులోని కాశిబుగ్గ ప్రాంతానికి ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఓ సారి మననం చేసుకుందాం.. కాశిబుగ్గతో ‘అమ్మ’కు అనుబంధం.. ఓరుగల్లుకు మదర్‌తో మరిచిపోలేని అనుబంధం ఉంది. నగరంలోని క్రిష్టియన్ కాలనీ అద్దెభవనంలో మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాన్ని 1980 మార్చి 19న ఆమె ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వేలాది మందికి తన తీయని గొంతుతో సందేశాన్ని వినిపించి, సేవచేయాలని పిలుపునిచ్చారు. అనాథ పిల్లలకు, కుష్టు రోగులకు, వికలాంగులకు ఉచితంగా మందులు, బట్టలు పంపిణీ చేశారు. నాడు ఆమె చేతి నుంచి వస్త్రాలు పొందిన గుండెటి శ్యాంకుమార్ ఇప్పటికీ మదర్ జయంతి రోజున పేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత అనాథాశ్రమాన్ని కాశిబుగ్గ 13వ డివిజ¯Œæలో సొంత భవనంలో నిర్మించగా, 1988 ఫిబ్రవరి 21న అప్పటి గవర్నర్ కుముద్‌బిన్ జోషితో కలసి మదర్ ఆ భవనాన్ని ప్రారంభించారు. ఇలా విశ్వమాత నాటి జ్ఞా పకాలను కాశిబుగ్గ వాసులు ప్రతి జయంతి రోజు న గుర్తు చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఉంటున్న 80 మంది వృద్ధులకు సేవలందిస్తున్నారు. -
ఆదాయం ఓకే.. సంక్షేమమేదీ?
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చెందాలన్నా.. ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు రావాల న్నా.. పాలక మండళ్లు ఏర్పడాలన్నా వాటి నిర్వహణ సక్రమంగా ఉండాలి. అప్పుడే ఎక్కువ సంఖ్యలో రైతులు పంట సరుకులు తీసుకురావడం.. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది. అయితే, రైతు ల ద్వారా రాబడి పెద్దమొత్తంలో ఉన్నా వారి సంక్షేమం కోసం నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టే విషయంలో అటు పాలకవర్గాలు, ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రైతులు సౌకర్యాల లేమితో ఇబ్బం ది పడుతుండగా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల నిర్వహణ లోపభూయిష్టంగా మారుతోంది. జిల్లాలో 14 మార్కెట్లు జిల్లా పరిధిలో ప్రస్తుతం 14 మార్కెట్లు ఉండగా, వీటిన్నింటిపై గత ఆరేళ్లలో రూ.177 కోట్ల ఆదాయం వ చ్చింది. ఇందులో ఒక వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ ద్వారా గత ఏడాది రూ.20కోట్ల ఆదాయం లభించింది. ఇది ఏటేటా పెరుగుతున్నా మార్కెట్లో మౌలిక వసతుల కల్పన ఆ స్థాయిలో ఉండడం లేదు. ఇక మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చే రైతుల సంక్షేమాన్ని అటు పాలకవర్గాలు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో వారు అరిగోస పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు రైతుబం ధు పథకం, రైతు బీమా, రైతు ఆరోగ్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవా ల్సి ఉంటుంది. కానీ, ఆ దిశగా ఏ పాలకవర్గం కూడా దృష్టి సారించడం లేదు. వరంగల్ మార్కెట్ ఆదాయమే రూ.94 కోట్లు వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు ఏటా ఆదాయం పెరుగుతున్నా మౌలిక సదుపాయాలకు సర్కారు ఖ ర్చు చేస్తున్నది అంతంత మాత్రమే. ఈ మార్కెట్‌కు 2008-2009 సంవత్సరానికి 13.16 కోట్ల ఆదాయం రాగా, 2009-2010 లో రూ.14-15 కోట్లు, 2010-11లో రూ.17.36 కోట్లు, 2011-12లో రూ.18.05 కోట్లు వచ్చింది. ఇక 2012-13 సంవత్సరంలోనైతే మార్కెట్ ఆదాయం రూ.20కోట్లకు చేరుకోగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు సుమారు రూ.12 కోట్లకు చేరుకుంది. అంటే మొత్తం ఆరేళ్లలో సుమారు రూ.94 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఆరోగ్య కేంద్రాల ద్వారా నెలకు రూ.10వేల మందులు మా త్రమే రైతులకు అందజేస్తున్నారు. అలాగే, గత ఆరేళ్ల లో నర్సంపేట మార్కెట్‌కు రూ.16.44 కోట్ల ఆదా యం రాగా, కేసముద్రం మార్కెట్ రూ. 10.52 కో ట్లు, జనగామకు రూ.11.88 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.7.96 కోట్లు, ములుగుకు రూ 6.89 కోట్లు చే ర్యాలకు రూ.5.25 కోట్లు, పరకాలకు రూ.4.96 కో ట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌కు రూ.4.25 కోట్లు, వర్ధన్నపేటకు రూ.2.97 కోట్లు, నెక్కొండకు రూ.3.91 కోట్లు, ఆత్మకూరుకు రూ.2.13 కోట్లు, తొర్రూరుకు 4.55 కోట్లు, కొడకండ్ల మార్కెట్‌కు రూ.2.04 కోట్ల ఆదాయం లభించింది. అన్ని కలిపి 2008 నుంచి 2014 వరకు రూ.177 కోట్ల ఆదాయం వస్తే, రైతు సంక్షేమానికి రూ.2కోట్లే ఖర్చు చేశారంటే పాలకవర్గాలు, అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. రైతు సంక్షేమం కోసం ఇలా ఖర్చు చేయచ్చు మార్కెట్ యార్డులకు పంట సరుకులు తీసుకొచ్చే రై తుల ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వారి సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు. రైతు బంధు, రైతు బీమా, రైతుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటుచే స్తూ వారికి విశేష సేవలు అందించవచ్చు. కానీ జిల్లా లో ఉన్న 14 మార్కెట్లలోని ఏ పాలకవర్గం కూడా ఈ దిశగా దృష్టి సారించడం లేదు. కొన్ని మార్కెట్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం సైతం అందుబాటులో లేదంటే మార్కెట్‌కు వచ్చే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అ ర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతి మార్కెట్‌కు వచ్చే ఆదాయంలో 20 శా తం నిధులు యార్డుల అభివృద్ధికి, మార్కెట్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయొచ్చ నే నిబంధన ఉండగా... ఈ నిధులు మాత్రం ఏటా తప్పకుండా ఖర్చు చేస్తున్నారు. ఏమంటే ఈ నిధుల ద్వారా చేపట్టే పనుల ద్వారా కమీషన్లు లభిస్తాయనే ఆశ. ఇప్పటికైనా పాలకవర్గాలు, అధికారులు రైతు సంక్షేమంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.