మదర్ దీవెనలో కాశిబుగ్గ
-
నగరానికి రెండుసార్లు వచ్చిన విశ్వమాత
-
నేడు మదర్‌థెరిస్సా జయంతి
కాశిబుగ్గ : మదర్‌థెరిస్సా అంటేనే ప్రేమానురాగాలకు నిలయం. కులమతాలకు అతీతంగా ఎంతో మందికి సేవలందించిన మహనీయురాలు ఆమె. మానవతా మూర్తిగా, విశ్వమాతగా సత్యం, దయ, ప్రేమ, స్నేహం, అనురాగం, కరుణ, ఆత్మీయతలను ప్రపంచానికి పంచిన మదర్ జయంతి శుక్రవారం జరుగనుండగా ఓరుగల్లులోని కాశిబుగ్గ ప్రాంతానికి ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఓ సారి మననం చేసుకుందాం..
కాశిబుగ్గతో ‘అమ్మ’కు అనుబంధం..
ఓరుగల్లుకు మదర్‌తో మరిచిపోలేని అనుబంధం ఉంది. నగరంలోని క్రిష్టియన్ కాలనీ అద్దెభవనంలో మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాన్ని 1980 మార్చి 19న ఆమె ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వేలాది మందికి తన తీయని గొంతుతో సందేశాన్ని వినిపించి, సేవచేయాలని పిలుపునిచ్చారు. అనాథ పిల్లలకు, కుష్టు రోగులకు, వికలాంగులకు ఉచితంగా మందులు, బట్టలు పంపిణీ చేశారు. నాడు ఆమె చేతి నుంచి వస్త్రాలు పొందిన గుండెటి శ్యాంకుమార్ ఇప్పటికీ మదర్ జయంతి రోజున పేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత అనాథాశ్రమాన్ని కాశిబుగ్గ 13వ డివిజ¯Œæలో సొంత భవనంలో నిర్మించగా, 1988 ఫిబ్రవరి 21న అప్పటి గవర్నర్ కుముద్‌బిన్ జోషితో కలసి మదర్ ఆ భవనాన్ని ప్రారంభించారు. ఇలా విశ్వమాత నాటి జ్ఞా పకాలను కాశిబుగ్గ వాసులు ప్రతి జయంతి రోజు న గుర్తు చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఉంటున్న 80 మంది వృద్ధులకు సేవలందిస్తున్నారు.