
భూమి అమ్మలేదని గ్యాంగ్ రేప్, కాల్పులు
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్లో అమానుషం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్లో అమానుషం చోటుచేసుకుంది. భూమి అమ్మలేదనే అక్కసుతో వివాహిత మహిళ (34)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు.
పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి కుటుంబానికి సంబంధించిన భూమిని, నిందితులకు అమ్మడానికి ఆమె భర్త నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆమె ఇంటి నుంచి మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కాళ్లపై కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులు మున్నా, కల్లూ, గఫ్ఫార్, కలీంలను అరెస్ట్ చేసినట్లు సీతాపూర్ ఎస్పీ బీబీ సింగ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు.