గన్తో బెదిరించి పోలీస్ స్టేషన్లో అత్యాచారం | A woman gangraped on gun-point by a police inspector | Sakshi
Sakshi News home page

గన్తో బెదిరించి పోలీస్ స్టేషన్లో అత్యాచారం

Published Mon, Oct 12 2015 11:03 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

గన్తో బెదిరించి పోలీస్ స్టేషన్లో అత్యాచారం - Sakshi

గన్తో బెదిరించి పోలీస్ స్టేషన్లో అత్యాచారం

లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఓ మహిళపట్ల భక్షకులుగా మారారు. తన భర్త కేసు విషయంలో స్టేషన్కు వెళ్లిన మహిళపై సబ్ ఇన్ స్పెక్టర్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్లోనే అత్యాచారం చేశారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి వివరాల ప్రకారం ఓ తప్పుడు కేసులో బాధితురాలి భర్తను పోలీసులు గత నెల ఆగస్టు 1న అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో మాట్లాడేందుకు ఆమె స్టేషన్కు అదే నెల 6న వెళ్లింది. ఆ సమయంలో పోలీసులు తుపాకీతో బెదిరించే అదే స్టేషన్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement