
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ మండలం సారంగాపూర్ శివారులో దారుణం చోటుచేసుకొంది. సినిమా అని చెప్పి ఓ యువతిని బయటకు తీసుకెళ్ళి ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా మరో యువకుడు వీడియో చిత్రీకరించాడు. శనివారం బాధితురాలు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనకు వ్యతిరేకంగా జిల్లాలోని మహిళా సంఘాలు, ఐద్వా నాయకురాలు సబ్బని లత ఆసుపత్రికి వచ్చి సంఘీభావం తెలిపారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ప్రియుడు సురేష్, తన కూతురిని సినిమా అని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment