governmenment
-
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్‌లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్‌లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్‌లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఒక వితంతు వృద్ధ మహిళ మృతిచెందినట్టు నిర్థారిస్తూ ఆమెకు రావాల్సిన పెన్షన్ నిలిపివేశారు. ఈ నేపధ్యంలో బాదామ్‌దేవి అనే ఆ వృద్ధురాలు తన సమస్య పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. పెన్షన్ నిలిపివేసి.. తాను బతికే ఉన్నానని, తనను గుర్తించి, తనకు తిరిగి పెన్షన్ ఇప్పించాలని వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు పెన్షన్ నిలిపివేశారని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఆమె తాను బతికే ఉన్నానని, అధికారులు నిర్థారించిన విధంగానైనా తనకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతోంది. 2023 జనవరి 20న తనకు పెన్షన్ నిలిపివేశారని, కారణం అడిగితే చనిపోయావని అన్నారని ఆమె తన వినతిపత్రంలో పేర్కొంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినా.. 20 ఏళ్లుగా తాను పెన్షన్ అందుకుంటున్నానని, అయితే ఈ ఏడాది దానిని నిలిపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఈ ఏడాది జనవరి 6న లైఫ్ సర్టిఫికెట్ సమర్పించానని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే తాను జీవించివున్నా ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానన్నారు. కాగా ఆమె దరఖాస్తును చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి సుభమ్ గుప్త మాట్లాడుతూ ఈ విషయమై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. ఇది కూడా చదవండి: 16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ.. -
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా..?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే, గత వారం పాకిస్థాన్ పార్లమెంట్లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఇమ్రాన్‌కు షాకిస్తూ ఎంపీలు, మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో దిగువ సభలో ప్రభుత్వ మిత్రపక్షాలన్నీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని పర్వేజ్ ఎలాహి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏర్పడింది. ఇక, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఉందని.. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. అవిశ్వాసానికి ముందు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
మద్యాన్ని వెలివేశారు!
చొప్పదండి, న్యూస్‌లైన్: ప్రజలను జాగృతం చేయడంలో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిరుపేదల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని గ్రామం నుంచి ‘వెలివేశారు’. మద్య నిషేధం అమలుకు నిర్ణయించి ఈ మేరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి స్ఫూర్తిగా ప్రభుత్వం ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమం అమలుకు జిల్లాలో నాలుగు గ్రామాల ను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి దేశాయిపేట. గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1,265 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఇక్కడి యువతను ఎంపిక చేసి పలు దఫాలు గా శిక్షణ ఇచ్చారు. గ్రామంలో వివిధ పనుల అమలుకు 20 వరకు కమిటీలను గ్రామస్తులతో నియమించారు. ఒక్కో కమిటీకి ఒక్కో పని అప్పగించారు. బీఎన్వీలు గ్రామంలో మద్యనిషేధంపై సమావేశాల్లో నిర్ణయించి ప్రజాప్రతి నిధుల సహకారంతో అమలుకు రెండేళ్ల క్రితం బాటలు వేశారు. గ్రామంలోని స్వశక్తి మహిళ లు, యువత, విద్యార్థులు, నాయకులు కలిసి మద్యనిషేధంపై ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు చేయబోమని ప్రతినచేయించారు. స్వాతంత్య్ర దినం సందర్భంగా దేశాయిపేటలో అప్పట్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులోకి వచ్చింది. రెండేళ్లుగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి చేరువగా వీరి ప్రయాణం సాగుతోంది. ఎన్నికల హామీతో గుమ్లాపూర్‌లో.. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడానికి మండల పరిధిలోని గుమ్లాపూర్ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని డప్పు చాటింపు చేయించారు. గామ జనాభా 2,848 మంది. పంచాయతీ ఎన్నికలకు ముందు అభ్యర్థులతో గ్రామస్తులు ముఖాముఖి నిర్వహించారు. మద్య నిషేధం అమలు చేయాలని స్వశక్తి మహిళలు డిమాండ్ చేశారు. ఇందుకు అభ్యర్థులు లిఖిత పూర్వక హామీఇచ్చారు. నేటి నుంచి ఇది అమల్లోకి రానుందని సర్పంచ్ ముష్కె వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పాలకవర్గం తీర్మానించింది. కమిటీలు వేశాం మద్యనిషేధంతో పాటు అన్ని పనుల నిర్వహణకు కమిటీలు వేశాం. మద్యం అమ్మకాలు నిషేధించడానికి గ్రామస్తులంతా ఒప్పుకున్నారు. వాలంటీర్లం పలుసార్లు ర్యాలీలు నిర్వహించాం. - సుద్దాల శ్రీనివాస్‌గౌడ్, బీఎన్వీ వాలంటీర్, దేశాయిపేట గ్రామస్తుల సమష్టి నిర్ణయం గ్రామంలో మద్యనిషేధం అమలు చేయాలని అంతా సమష్టిగా నిర్ణయించాం. అందరం మద్య నిషేదానికి ప్రతిజ్ఞ చేశాం. అందరూ కట్టుబడి ఉన్నారు. గ్రామంలో ప్రశాంతత ఉంది. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తున్నాం. - మోర భద్రేశం, మాజీ సర్పంచ్, దేశాయిపేట ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నాం.. గ్రామంలో బహిరంగ మద్య నిషేధం, మద్యం అమ్మకాల నిషేధంపై ఎన్నికల ముందు మాటిచ్చాం. ప్రజల కోరిక మేరకు పంచాయతీ పాల కవర్గ సమావేశంలో దీనిపైనే తొలి తీర్మానం చేశాం. యువత భాగస్వామ్యం బాగుంది. - ముష్కె వెంకట్‌రెడ్డి, సర్పంచ్, గుమ్లాపూర్