ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
అయితే, గత వారం పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఇమ్రాన్‌కు షాకిస్తూ ఎంపీలు, మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది.
ఇదిలా ఉండగా.. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో దిగువ సభలో ప్రభుత్వ మిత్రపక్షాలన్నీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని పర్వేజ్ ఎలాహి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏర్పడింది. ఇక, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఉందని.. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. అవిశ్వాసానికి ముందు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment