ఆర్‌యూ సమస్యలు పీఏసీ చైర్మన్‌ దృష్టికి | ru issues to the attention of the chairman ofఘూలడ | Sakshi
Sakshi News home page

ఆర్‌యూ సమస్యలు పీఏసీ చైర్మన్‌ దృష్టికి

Published Fri, Nov 11 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్‌ యాదవ్‌ కోరారు.

కర్నూలు (ఓల్డ్‌సిటీ):
రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్‌ యాదవ్‌ కోరారు. వారి ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు గురువారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసి యూనివర్సిటీ సమస్యలను విన్నవించారు. ఆధారాలను కూడా అందజేశారు. వీసీ నరసింహులు అవినీతిపై విచారణ జరిపించాలన్నారు.  రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ పాటించకుండా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆన్‌ కాంట్రాక్టులను భర్తీ చేశారని, బంధువులకు, తప్పుడు సర్టిఫికెట్లు, ఫేక్‌ పీహెచ్‌డీలు పెట్టిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని, సీఈ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఫైనాన్స్‌ ఆఫీసర్లను నిబంధనలకు విరుద్ధంగా నియమించాలరని ఆరోపించారు. రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ ప్రొఫెసర్‌షిప్‌ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా, సగం జీతం వచ్చినా ఆయన్నే రిజిస్ట్రార్‌గా కొనసాగించడం దారుణమన్నారు. తక్షణమే వీసీ నరసింహులును రీకాల్‌ చేయాలని, యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై సీబీ సీఐడీ దర్యాప్తు జరిపించాలని కోరారు. దీనిపై పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడే వారిపై ఆధారాలతో సహా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌యూ జేఏసీ నేతలు శ్రీరాములు, రాఘవేంద్ర, సురేశ్, రమణ, లక్ష్మణ్, శంకర్, నాగరాజు, భరత్, రాజు, వెంకటేశ్, అశోక్, వైఎస్‌ఆర్‌సీపీ నేత దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
10 కెఎన్‌ఎల్‌ 283: బుగ్గనతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement