సమస్యల పరిష్కారంలో విఫలం
విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడావి రమేశ్ అన్నారు.
ఉట్నూర్ : విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడావి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డీటీఏఫ్ భవన్‌లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెల్లింపులు లేవని అన్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి వెంటనే పదోన్నతులు కల్పించాలని, ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీటీఏఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుగు సామ్యుల్, కౌన్సిలర్ బోజ్జు, జిల్లా ప్రధాన కార్యదర్శి వక్షోధర్, ఉపాధ్యక్షులు రవిత, దిలీప్, కార్యదర్శులు ప్రకాశ్, శ్రీదర్‌బాబు, కౌన్సిలర్ గజానంద్, అడిట్ కమిటీ కన్వీనర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.