dtf
-
సమరశీల పోరాటాలకు సిద్ధమవుదాం
ఎమ్మిగనూరురూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సవాలుగా మారిన సీపీఎస్ రద్దు కోసం çసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి ఎస్వీ రమణయ్య పిలుపునిచ్చారు. స్థానిక గా«ంధీనగర్‌లో డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవి విరమణ పొందిన తరువాత భవిష్యత్త్‌కు భద్రత లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం తగదన్నారు. ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు అనుకులంగా సంక్షేమ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని అలోచిస్తున్నాయన్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద 9565 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా నిబంధనలకు విరుద్ధంగా వాటిలో 155 మందికి హెచ్ఎంలుగా పదోన్నతలు కల్పించారన్నారు. దీంతో సాంకేతికంగా జీతాలు చెల్లింపు సమస్య వచ్చిందని చెప్పారు. జిల్లాలో పదోన్నతులు పొందిన 33 మంది హెచ్ఎంల జీతాల చెల్లింపునకు ట్రెజరీ అధికారులు నిరాకరిస్తే డీటీఎఫ్ కృషి ఫలితంగా ఏపీ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందన్నారు. అయితే సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇందులో భాగంగా 2012 జనవరిలో జారీ చేసిన 3,4 జీఓలను సవరించి హెచ్ఎంల పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారంకోసం 2017 జనవరి 11 న విజయవాడ(అమరావతి)లో ధర్నా తలపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కె.రత్నం, జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కరె కృష్ణ, జి.తిమ్మప్ప నాయాకులు వీరన్న, గొట్ల చంద్రశేకర్, కిశోర్, రామన్న, వెంకట్రాముడు, ఈశ్వరరెడ్డి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి డీటీఎఫ్ మద్దతు
అనంతపురం: ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘురామయ్యకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష¯ŒS (డీటీఎఫ్)సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవ¯ŒSలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి రఘురామయ్య, రాష్ట్ర కార్యదర్శి నరశింహులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవ, ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడారు. ఏపీటీఎఫ్, డీటీఎఫ్ ఫెడరేష¯ŒSల విధానాలు, లక్ష్యాలు, ఆశయాలు ఒకే విధంగా భావసారూప్యం కలిగి ఉండడం వల్ల డీటీఎఫ్ ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి భేషరతుగా మద్దతు ఇస్తున్నామన్నారు. డీటీఎఫ్ అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు. -
అందరికీ సమాన విద్యనందించాలి
అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ నల్లగొండలో అట్టహాసంగా డీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం తరలివచ్చిన 31 జిల్లాల ఉపాధ్యాయులు నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వాలు కుల, మత, వర్గాలకు అతీతంగా అసమానతలు లేని విద్యనందించాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ అధ్యక్షుడు, ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ కోరారు. శనివారం నల్లగొండలోని శివాంజనేయ గార్డెన్లో జరిగిన డీటీఎఫ్ (డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్) 4వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహా సభలకు ముఖ్య అతిథిగా హాజ రైన ఆయన డీటీఎఫ్ జెండాను, సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరి గిన సభలో ఆయన ప్రసంగిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలన్నారు. విద్యలో మార్పు లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, కాషారుుకరణను, ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. అన్ని వర్గాలకు సమానమైన, నాణ్యమైన విద్య అందించాలంటే కామన్ స్కూల్ ద్వారానే సాధ్యమన్నారు. ఉపాధ్యాయులు హక్కుల కోసం పోరాడుతూనే విద్యా వ్యవస్థపై కూడా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. బాధ్యతగా వ్యవహరించాలి : ఎంపీ ఉపాధ్యాయులు హక్కులు అడగడంతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. డిండి, చందంపేట లాంటి ప్రాంతాల్లో 50 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం కొత్త విద్యా పాలసీకి సలహాలు అడగగా పం పించామన్నారు. సీపీఎస్ రద్దు నెరవేరని కోరికని, ఇది కేంద్రం పరిధిలోనిదన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సహకారాలు అందిస్తామని తెలిపారు. సామాజిక ప్రగతికి విద్య అవసరం సామాజిక ప్రగతికి విద్య ఎంతో అవసరమని, మూడు దశాబ్దాలుగా డీటీఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రఘుశంకర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యారంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కామన్ స్కూల్ విధానం ఏర్పాటు చేయడంలేదన్నారు. సమానవిద్య, నాణ్యమైన విద్య అందించాల్సి ఉందన్నారు. విద్య కాషాయీకరణ, వ్యాపారీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రేషనలైజేషన్ ద్వారా పాఠశాలల మూసివేత సరైంది కాదన్నారు. 11 అంశాలపై ఈ మహా సభలలో చర్చ జరుగుతుందని తెలిపారు. సీపీఎస్ విదానం వల్ల రాష్ట్రంలో 1 లక్షా 16 వేల మంది ఉపాధ్యాయులు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధం గా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నోముల సత్యనారాయణ, డీటీఎఫ్ నేతలు రాఘవాచారితో పాటు పలువురు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.క్రిష్టప్ప, అధ్యాపక జ్వాల సంపాదకులు ఎం. గంగాధర్, డీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సోమయ్య, వెంకట్రాములు, శంతన్, పద్మలత, కార్యదర్శులు సామ్యూల్, రాజిరెడ్డి, లింగారెడ్డి, ఎస్. భాస్కర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు ఎస్. విద్యాసాగర్‌రెడ్డి, ఎం. దశరథరామారావు, భాస్కర్, ప్రధాన కార్యదర్శులు వెంకులు, లింగయ్య, సత్త య్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్ నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
27న విజయవాడలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు
కర్నూలు సిటీ: కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం ముసాయిదాకు వ్యతిరేకంగా ఈనెల 27న విజయవాడలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన జాతీయ విద్యా విధాన రూప కల్పనకు దత్తాంశాలు–2016 అనేది భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, ప్రధాన వక్తలుగా ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం హాజరువుతారని తెలిపారు. సమావేశంలో డీటీఎఫ్ నాయకులు గట్టు తిమ్మప్ప, అల్లాబకాష్, బజారప్ప, ముద్ద రంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా విద్యారణ్యపురి: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్)ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు ఉద్యోగులకు ఒక సామాజిక భద్రతగా పాతపెన్షన్ విధానం ఉండేదన్నారు.అయితే నూతన పెన్షన్ విధానం (సీపీఎస్)తో ఉద్యోగ విరమణ పొందిన కుటుంబానికి సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రంగా చెపుతున్న తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు సంఘటితంగా పోరాడుతామన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం గంగాధార్ మాట్లాడుతూ ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణతో ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు ఉద్యోగులు ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో పెన్షన్ ,గ్రాట్యూటీ, జీపీఎఫ్ వంటివి నష్టపోవాల్సి వస్తుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటరెడ్డి , టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి రాంచందర్, జనరల్ సెక్రటరీ టి.సుధర్శనం నాయకులు జి ఉప్పలయ్య, పి.సుధర్శన్‌రెడ్డి, బి. జాన్‌నాయక్, డి. మహేందర్‌రెడ్డి, ఎ. గోవిందరావు, కె. కొమ్మాలు, డి.కుమారస్వామి, జి. శ్రీనివాస్‌రెడ్డి, బి. రాములు, జి. ఆదిరెడ్డి, జి.సురేందర్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో విఫలం
ఉట్నూర్ : విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడావి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డీటీఏఫ్ భవన్లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెల్లింపులు లేవని అన్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి వెంటనే పదోన్నతులు కల్పించాలని, ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీటీఏఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుగు సామ్యుల్, కౌన్సిలర్ బోజ్జు, జిల్లా ప్రధాన కార్యదర్శి వక్షోధర్, ఉపాధ్యక్షులు రవిత, దిలీప్, కార్యదర్శులు ప్రకాశ్, శ్రీదర్‌బాబు, కౌన్సిలర్ గజానంద్, అడిట్ కమిటీ కన్వీనర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.