27న విజయవాడలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు
Published Mon, Nov 21 2016 11:32 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
కర్నూలు సిటీ: కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం ముసాయిదాకు వ్యతిరేకంగా ఈనెల 27న విజయవాడలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన జాతీయ విద్యా విధాన రూప కల్పనకు దత్తాంశాలు–2016 అనేది భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, ప్రధాన వక్తలుగా ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, విరసం నాయకులు సీఎస్‌ఆర్ ప్రసాద్, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం హాజరువుతారని తెలిపారు. సమావేశంలో డీటీఎఫ్ నాయకులు గట్టు తిమ్మప్ప, అల్లాబకాష్, బజారప్ప, ముద్ద రంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement