దానితోనే యువతుల్లో సంతానలేమి..
సాక్షి, సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహరపు అలవాట్లు, ఆలస్యపు వివాహాల వల్ల మహిళల సంతాన సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నోవా ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ సరోజ కొప్పాల చెప్పారు. మద్యం, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల అండాశయ నిల్వలు పడిపోవడంతో పాటు, ఎగ్స్‌కౌంట్ తగ్గడానికి కారణం అవుతున్నట్లు తెలిపారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
జీవనశైలిలో మార్పు వల్ల రజస్వల మొదలు గర్భం ధరించడం, నెలసరి రుతుక్రమం వరకు ఇలా అన్ని సమస్యాత్మకంగా మారుతున్నాయన్నారు. తల్లి కావాలని ఆశపడే వారికి ఇదో పెద్దశాపంగా మారిందన్నారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి తమ వద్ద చక్కని పరిష్కార మార్గం ఉందని చెప్పారు. జీవకణ దానం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు.