క్షమాపణలు చెప్పిన స్టార్‌ హీరో సోదరి | Riddhima Kapoor Sahni Issues Apology | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 27 2018 7:37 PM | Last Updated on Tue, Nov 27 2018 7:39 PM

Riddhima Kapoor Sahni Issues Apology - Sakshi

ప్రముఖ డిజైనర్‌.. రణ్‌బీర్‌ కపూర్‌ సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని, ‘కోకిచి మికిమోటో’ అనే ఆభరణాల సంస్థకు క్షమపణలు తెలిపారు. విషయం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం రిద్ధిమా కపూర్‌ ‘ఆర్‌ జ్యూవెలరి’ పేరుతో సొంత బ్రాండ్‌ను ప్రారంభించి.. ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయించి అమ్ముతున్నారు. ఈ క్రమంలో పండుగల సీజన్‌ సందర్భంగా రిద్ధిమా ఒక చెవి దుద్దుల డిజైన్‌ను విడుదల చేశారు. అయితే ఈ చెవి దుద్దుల డిజైన్‌, ప్రముఖ ముత్యాల నగల తయారీదారులు ‘కోకిచి మికిమోటో’ కంపెనీ తయారు చేసిన చెవి దుద్దుల డిజైన్‌ రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి. దాంతో రిద్ధిమా, కోకిచి వారి డిజైన్‌ను కాపీ కొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

తొలుత ఈ విషయం గురించి ఒక అపరిచిత వ్యక్తి తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో ఈ విషయం కాస్తా వైరల్‌ కావడంతో రిద్ధిమా క్షమాపణలు చెప్పారు. ‘ఒరిజినల్‌ డిజైన్‌ని ట్యాగ్‌ చేయకపోవడం మా తప్పే. డిజైనర్‌ల సృజనాత్మకతను మేము గౌరవిస్తాము. మేము ఎవరిని కాపీ చేయము.. ఒకవేళ అలాంటి పనులు చేస్తే మాకు స్ఫూర్తినిచ్చిన వారిని మేము ఎప్పటికి గౌరవిస్తాము’ అంటూ రిద్ధిమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement